3

ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు ఐదేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ చైనాలోని హాంగ్జౌ వేదికగా డిసెంబర్ 9 నుంచి 13 వరకు జరుగనుంది. 2022లో కూడా సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ, గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో 2021 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. 2021లో జరిగిన ఫైనల్లో సింధు.. దక్షిణ కొరియా షట్లర్ అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సింధు 2018లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆతర్వాత 2019, 2020లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తిరిగి 2021లో ఫైనల్‌కు చేరినా అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయింది. 2022లో అర్హత సాధించినప్పటికీ ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.

Related Post

Previous
Next Post »