ఐక్యూ 10 సిరీస్ నుంచి కొత్త ఫోన్ల విడుదల !
ఐక్యూ 10 సిరీస్ నుంచి కొత్తగా ఐక్యూ 10 , ఐక్యూ 10 ప్రో మోడళ్లు చైనాలో తాజాగా లాంచ్ అయ్యాయి. వీటిలో ఐక్యూ 10 ప్రో వేరియంట్ హై లెవల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ సెటప్ 8K వీడియోను రికార్డ్ చేయగలదు. దీంతోపాటు 14.6-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ 150-డిగ్రీ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 100% DCI-P3 రేటింగ్ దీని సొంతం. అంటే ఇది RGB కలర్ స్పేస్ మొత్తం స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC చిప్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ అవసరాల కోసం ఫ్రేమ్ రేట్లను పెంచడానికి ఇంటర్‌పోలేషన్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ చిప్‌సెట్ డివైజ్‌లో పవర్‌ను కూడా నియంత్రిస్తుంది, ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. ఈ ఫోన్‌లో 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 4700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది రెండు సెల్స్...