Posts

Showing posts with the label Commonwealth Games

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ : మహిళల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో సెమీ ఫైనల్స్‌కి చేరిన సాక్షి చౌదరి

Image
గ్లా స్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకూ భారత్ 12 పతకాల (2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల బాక్సింగ్ 51 కెజిల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖరారైంది. ఈ బౌట్‌లో ఆరంభం నుంచి సాక్షి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్‌లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది.

కామన్వెల్త్ గేమ్స్‌ : వెయిట్‌లిఫ్టర్ చానబమ్ రిషికాంత్ సింగ్ కి చేజారిన స్వర్ణం

Image
గ్లా స్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది. భారత్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ చానబమ్ రిషికాంత్ సింగ్ ఆదివారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఎడిషన్‌లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకు ముందు పారా-పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ ఇండియాకు తొలి కాంస్య పతకాన్ని సాధించిపెట్టిన విషయం తెలిసింది. మ్యాచ్ ప్రారంభంలో 28 ఏళ్ల రిషికాంత్ సింగ్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. స్నాచ్ విభాగంలో రిషికాంత్ తన మూడు ప్రయత్నాలను (116 కిలోలు, 119 కిలోలు, 121 కిలోలు) బరువులు ఎత్తి సక్సెస్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో 121 కిలోల బరువు ఎత్తిన రిషికాంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్నాచ్ రికార్డును కూడా నెలకొల్పాడు. స్నాచ్ రౌండ్ ముగిసేసరికి అతను మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మొహమ్మద్ అనిక్‌తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలో 143 కిలోల బరువును సునయాసంగా ఎత్తిన రిషికాంత్ సింగ్.. రెండో ప్రయత్నంలో 148 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పటి వరకూ మూడో స్థానంలో కొనసాగుతున్న మలేషియన్ వె...