టీవీకే ప్రభంజనానికి ఊతమిచ్చిన 'మేనిఫెస్టో' !
త మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కజగం' ప్రభంజనం సృష్టించింది. విజయానికి ఆ పార్టీ చీఫ్ విజయ్ ప్రకటించిన ఎన్నికల 'మేనిఫెస్టో' కీలకంగా మారింది. ప్రధానంగా మహిళలు, రైతులు, యువత లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చారు. 60 ఏళ్లలోపు ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఏడాదికి ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రభుత్వ శాఖ, ప్రత్యేక మహిళా కోర్టులు వంటివి టీవీకే వాగ్దానం చేసింది. ప్రతి వధువుకు ఒక సావరిన్ బంగారు నాణెం, ఒక పట్టు చీర, తల్లులకు, పుట్టిన శిశువుకు బంగారు ఉంగరం ఇస్తామని హామీ ఇచ్చింది. పాఠశాల మానేసే బాలికల సంఖ్యను తగ్గించడానికి, వారి తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి రూ.15,000 అందజేస్తామని తెలిపింది. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది. మరోవైపు యువత కోసం 'మేనిఫెస్టో'లో కీలక హామీలను విజయ్ పార్టీ ప్రకటించింది. 12వ తరగతి నుంచి పీహెచ్డీ స్థాయి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నియామకాలన్నింటికీ ఒక 'పారదర్శక...