Posts

Showing posts with the label CCI has initially found that third-party payments are being restricted

జరిమానా నిబంధనలపై ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసిన యాపిల్ సంస్థ : డిసెంబర్ 3న విచారణ

Image
భా రతీయ పోటీ చట్టం లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ యాపిల్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఉల్లంఘనకు పాల్పడిన సంస్థలపై విధించే జరిమానాలను వారి ప్రపంచ టర్నోవర్‌తో అనుసంధానించే నిబంధనల రాజ్యాంగబద్ధతను కంపెనీ ప్రశ్నించింది. యాపిల్ తన రిట్ పిటిషన్‌లో కాంపిటీషన్ చట్టంలోని సవరించిన సెక్షన్ 27(బి), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 నాటి టర్నోవర్ నిబంధనలను ప్రధానంగా సవాల్ చేసింది. పోటీ చట్టంలో సవరించిన నిబంధనల ప్రకారం.. పెనాల్టీల సమయంలో కంపెనీ ఉత్పత్తులు, సేవల నుంచి పొందిన గ్లోబల్ టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. తద్వారా జరిమానాలకు సంబంధించి ప్రపంచవ్యాప్త ఆదాయాన్ని లెక్కిస్తారు. దాంతో కంపెనీపై ఏదైనా జరిమానా విధించాల్సి వస్తే గ్లోబల్‌ టర్నోవర్‌ను లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. ఇది కంపెనీకి నష్టం. యాపిల్ ఈ నిబంధనలను కొట్టివేయాలని కోరుతోంది. యాపిల్ న్యాయపరమైన సవాల్‌ 2022లో ప్రారంభమైన యాంటీట్రస్ట్ దర్యాప్తుతో ముడిపడి ఉంది. టిండర్ యజమాని మ్యాచ్ గ్రూప్, కొన్ని భారతీయ స్టార్టప్‌ల ఫిర్యాదుల మేరకు సీసీఐ దర్యాప్తును ప్రారంభించింది. థర్డ్‌ పార్టీ చెల్లింపులను పరిమితం చేస్తున్నట్లు సీసీ...