హెచ్‌ఎండీఏకి 'తెల్ల ఏనుగుల'లా మారిన డబుల్ డెక్కర్ బస్సులు
గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులు హెచ్‌ఎండీఏకి 'తెల్ల ఏనుగుల'లా మారాయి. అలనాటి డబుల్ డెక్కర్ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వీటిని ప్రవేశపెట్టారు. ఒక్కో బస్సు కోసం రూ.2.16 కోట్ల చొప్పున సుమారు రూ.12.96 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. రూట్లు, బస్సుల నిర్వహణ వంటి అంశాలపైన ఎలాంటి స్పష్టత లేకుండా అప్పటి ఫార్ములా-ఈ పోటీలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా కొనుగోలు చేసిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు అలంకారప్రాయంగా మారాయి. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడిపింది. సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం, కోఠీ, జూపార్కు తదితర రూట్లలో ఈ బస్సులు తిరిగాయి. అతిపెద్ద ప్రజారవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీకి మాత్రమే ఈ బస్సుల నిర్వహణ సాధ్యమైంది. క్రమంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, ఎలివేటెడ్ కారిడార్‌లు వంటివి అందుబాటులోకి రావడంతో డబుల్ డెక్కర్‌ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్లను నిలిపివేసింది. కానీ డబుల్ డెక్కర్ బస్సులకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు హెచ్‌ఎండీఏ ఈ బస్సులను కొనుగోలు చేయడం మంచిదే అయినా. ప్రజా రవాణా రంగ...