'విక్రమ్' చిత్రాలను విడుదల చేసిన ఇస్రో !
చం ద్రయాన్-3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ తీసిన జాబిల్లి ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అవాయిడెన్స్ కెమెరా తీసిన చంద్రుని చిత్రాలను ఇస్రో పోస్ట్ చేసింది. ఆగస్టు 19వ తేదీన తీసిన ఈ చంద్రుని చిత్రాలను ఇస్రో.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బండరాళ్లు లేదా లోతైన గుంతలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ కెమెరా సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది. ఈనెల 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై 'విక్రమ్' సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయాన్ని ముందు 23వ తేదీ సాయంత్రం 5.45నిమిషాలకు నిర్ణయించిన ఇస్, తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6.04 నిమిషాలకు మార్చింది. సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందు ల్యాండర్ మాడ్యూల్‌లో అంతర్గత తనిఖీలు చేయనున్నట్లు ఇస్రో తెలిపింది. ల్యాండింగ్ ప్రాంతంలో సూర్యోదయం వరకు వేచి చూడనున్నట్లు వెల్లడించింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 మిషన్ అంతరిక్ష అన్వేషణలో చారిత్రక మైలురాయిని చేరనుందని ఇస్రో తెలిపింది. సుమారు 30కిలోమీటర్ల ఎత్తులో శక్తితో కూడిన బ్రేకింగ్ దశలోకి ...