Posts

Showing posts with the label Devendra Chaplot Joins Elon Musk's Company

ఎలాన్ మస్క్ కంపెనీలో చేరిన దేవేంద్ర చాప్లోట్‌ !

Image
ఎ లాన్ మస్క్ కంపెనీలో ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్‌పర్ట్‌ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్‌ చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎలాన్ మస్క్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్‌లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, ఏఐ & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో Iఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో బీటెక్  & అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు. చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్‌బుక్ AI రీసెర్చ్‌లో చేరాడు. ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్‌గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్‌లో పనిచేశాడు. 2020లో, రో...