Posts

Showing posts with the label corruption

మెక్సికోలో పెరుగుతున్న నేరాల రేట్లు, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు

Image
మె క్సికోలో పెరుగుతున్న నేరాల రేట్లు, అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇవ్వడానికి మెక్సికో అంతటా వేలాది మంది ప్రజలు గుమిగూడారు. శనివారం దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు నిరసన తెలిపారు. ఈ నిరసన మార్చ్‌లో వివిధ వయసుల వారు పాల్గొన్నారు, వీరిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వృద్ధ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇటీవల హత్యకు గురైన మిచోకాన్ మేయర్ కార్లోస్ మాంజో మరణంపై దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా నిరసనలో మాంజో మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. మీడియా నివేదికల ప్రకారం అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ నివసించే మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ చుట్టూ నిరసనకారులు బారికేడ్లను ఛేదించడంతో పోలీసులు మోహరించారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల సమూహం దాడిలో 100 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, వారిలో 40 మంది ఆసుపత్రి పాలయ్యారని మెక్సికో నగర ప్రజా భద్రతా కార్యదర్శి పాబ్లో వాజ్క్వెజ్ ఒక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 మంది పౌరులు కూడా గాయపడ్డారని చెప్పారు. అలాగే ఈ నిరసనలకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశారని, మరో 20 మందిని పరిపాల...