Posts

Showing posts with the label 'Zinc Phosphide

ముంబై పుచ్చకాయ తిని మృతి చెందిన కేసు : ఫోరెన్సిక్ రిపోర్ట్ లో పుచ్చకాయలో ఎలుకల మందు

Image
ముం బైలోని భేండీ బజార్ ప్రాంతంలో జరిగిన దొకాడియా కుటుంబం విషాదాంతం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎట్టకేలకు ఛేదించింది. అంతా అనుకున్నట్లు వారి ప్రాణాలు తీసింది పుచ్చకాయ కాదు, అత్యంత ప్రమాదకరమైన 'జింక్ ఫాస్ఫైడ్' అనే ఎలుకల మందని నివేదికలో తేలింది. ఏప్రిల్ 27న జరిగిన ఈ విషాద ఘటన పోలీసులకు పెను సవాలుగా మారింది. ఆహారంలో విషం ఉందా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో కలినాలోని ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు వేచి చూశారు. బాధితులు వాంతులు చేసుకోవడం వల్ల వారి శరీరంలో విషం మోతాదు చాలా తక్కువగా ఉంది. ఆ చిన్నపాటి ఆనవాళ్లను పట్టుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు ఏకంగా 54 రౌండ్ల పాటు, 11 రోజుల సుదీర్ఘ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. చివరకు మృతుల కాలేయం, మూత్రపిండాలు మరియు కడుపులోని నమూనాలలో జింక్ ఫాస్ఫైడ్ ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారించారు. ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ ప్రకారం జింక్ ఫాస్ఫైడ్ శరీరంలోకి వెళ్లగానే 'ఫాస్ఫైన్' అనే విషవాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగానే రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మనిషి ఊపిరాడక విలవిలలాడుతాడు. ఈ...