Tuesday, October 13, 2026

పంజాబీ ట్రక్ డ్రైవర్‌ మిత్ర బృందాన్ని వరించిన దుబాయ్‌ లాటరీ !

దుబాయ్‌లోని జెబెల్ అలీలో కుల్వంత్ సింగ్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని రెండేళ్లుగా ఐదుగురు స్నేహితులతో కలిసి ప్రతి నెలా టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆరుగురు కలిసి టికెట్ కొనుగోలు చేశారు. ఈసారి కుల్వంత్ సింగ్ యాదృచ్ఛికంగా ఓ నంబర్‌ను ఎంచుకున్నారు. అదే వారికి అదృష్టాన్ని తీసుకొచ్చింది. డ్రాలో 5 లక్షల దిర్హామ్‌ల బహుమతి గెలుచుకున్నట్లు తెలియగానే అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘ మేము  ప్రతి నెలా కలిసి టికెట్లు కొంటున్నాం. చివరికి విజయం సాధించామని తెలిసి ఎంతో సంతోషపడ్డాం’ అని కుల్వంత్ సింగ్ చెప్పారు. లాటరీలో గెలిచిన 5 లక్షల దిర్హామ్‌లను ఆరుగురు స్నేహితులు పంచుకోనున్నారు. కుల్వంత్ సింగ్‌కు మొత్తం బహుమతిలో కొంత వాటా వస్తుంది. ఆ డబ్బును ఇంటి కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నాననీ భవిష్యత్తులోనూ బిగ్ టికెట్ డ్రాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.