Posts

Showing posts with the label deal valued at ₹3

ఇంటెలిస్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కొనుగోలు

Image
ఇం టెలిస్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ రూ. 3,050 కోట్లుగా ఉంది. దీనితో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ అగ్రశ్రేణి సంస్థగా మారుతోంది. స్మార్ట్ మీటర్ల రంగంలో ఇది భారీ పురోగతి అని చెప్పొచ్చు. ఈ కొనుగోలుతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ స్మార్ట్ మీటర్ల సామర్థ్యం పెరుగుతుంది. వీరి వద్ద ఇప్పుడు 4.7 కోట్ల మీటర్లు ఉంటాయి. ఇంటెలిస్మార్ట్ మంచి పేరున్న విద్యుత్ మీటర్ల సంస్థ. ఇది ఎన్ఐఐఎఫ్ ఈఎస్‌ఎల్ సంయుక్త సంస్థ. దేశవ్యాప్తంగా వీరు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. ఇంటెలిస్మార్ట్ ప్రస్తుతం మూడు ప్రధాన సంస్థల్లో ఒకటి. వీరు దాదాపు 2.2 కోట్ల స్మార్ట్ మీటర్లను నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో సేవలు అందిస్తున్నారు. బీహార్, అస్సాం రాష్ట్రాల్లో కూడా వీరికి మంచి పట్టు ఉంది. అధికారిక అనుమతులు రాగానే ఈ డీల్ పూర్తవుతుంది. ఏఈఎస్ఎల్  సిఇఒ కందర్ప పటేల్ దీనిపై స్పందించారు. ఈ ఒప్పందం సంస్థ సామర్థ్యాన్ని భారీగా పెంచుతుందని చెప్పారు. విద్యుత్ పంపిణీ ఆధునీకరణకు ఇది ఎంతో తోడ్పడుతుంది. సాంకేతికతతో కూడిన...