Posts

Showing posts with the label and Cooking Gas Prices Set to Rise?

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ?

Image
దే శవ్యాప్తంగా వాహనదారులకు, వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇరాన్‌పై అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం నేపథ్యంలో భారతీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచే దిశగా కసరత్తు చేస్తున్నాయి. జాతీయ కథనాల ప్రకారం, వచ్చే వారంలోనే ధరల పెంపు జరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 వరకు పెరుగవచ్చని, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపుపై సంయమనంతో ఉన్న ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు వారాంతంలో ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.