July 2024

భారీ వర్షాల నేపధ్యంలో వయనాడ్  లో భారీ వైపరీత్యం ముంచుకొస్తుందని కేరళ రాష్ట్రాన్ని జులై 23నే హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంట్‌లో పేర్కొనడంపై కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పందించారు. ఇది పరస్పర నిందారోపణలకు సమయం కాదని స్పష్టం చేశారు. తాము ముందే హెచ్చరించినా కేరళ తగిన విధంగా స్పందించి అప్రమత్తం కాలేదని అమిత్‌ షా పార్లమెంట్‌లో పేర్కొనడాన్ని ఉద్దేశించి విజయన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొండచరియలు విరిగిపడే ముందు ఐఎండీ కేవలం జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ మాత్రమే జారీ చేసిందని విజయన్‌ గుర్తుచేశారు. ఐఎండీ అంచనాలకు మించి వయనాద్‌లో 500మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాస్తవంగా అంతకుమించే వర్షాలు కురిశాయని సీఎం తెలిపారు. ఇది ఐఎండీ ముందస్తు హెచ్చరికల కంటే చాలా అధికమని చెప్పారు. వైపరీత్యానికి ముందు ఈ ప్రాంతం ఎన్నడూ రెడ్‌ అలర్ట్‌లో లేదని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఉదయం ఆరు గంటలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారని తెలిపారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్‌ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.'కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించాం. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశాం. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి.. కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేరళకు పంపింది. కానీ, కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సకాలంలో ప్రజలను తరలించలేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల రాకతో పినరయి విజయన్‌ ప్రభుత్వం అప్రమత్తమై ఉండి ఉంటే.. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవించేవి కావు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది' అని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఈ సందర్భంగా అమిత్‌ షా పార్లమెంట్‌కు తెలిపారు.

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ ఐదేండ్ల కాలం అత్యంత కీలకమని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రాజ్యసభలో బుధవారం 2024-25 ఆర్ధిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌పై ఆమె మాట్లాడారు. 2014 నుంచి సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా విశ్వాస్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఆ దిశగానే ఈ బడ్జెట్‌ను కూడా రూపొందించామని చెప్పారు. బడ్జెట్‌పై విస్తృత చర్చ జరిగిందని, 83 మంది సభ్యులు బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాలుపంచుకున్నారని తెలిపారు. ఈ బడ్జెట్‌ గతంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు కొనసాగింపేనని చెప్పారు. వృద్ధి, ఉపాధి కల్పన, సంక్షేమం, మూలధన వ్యయం, పెట్టుబడులే ప్రాధాన్యాలుగా బడ్జెట్‌లో ఆయా రంగాలకు పెద్దపీట వేశామని వెల్లడించారు. ఆర్ధిక స్ధిరీకరణనూ పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతం దిగువకు తీసుకొస్తామని 2021లో సభలో తాను హామీ ఇచ్చానని ఆ దిశగానే ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం అంతర్జాతీయ వృద్ధిలో భారత్‌ వాటా 16 శాతంగా ఉందని, అది మరింత పెరగనుందని ఆమె భరోసా ఇచ్చారు. తయారీ రంగం వృద్ధికి బడ్జెట్‌లో పలు ఊతమిచ్చే చర్యలు చేపట్టామని చెప్పారు. దేశం నుంచి మొబైల్‌ ఫోన్ల తయారీ భారీగా పెరిగిందని తెలిపారు.

టాటా నెక్సాన్‌ను పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో కంపెనీ విడుదల చేసింది. ఈ కారు పెట్రోల్ మాన్యువల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 8 లక్షలు. అయితే ఈ కారు ఆన్ రోడ్ ధర రూ.9.15 లక్షలు అవుతుంది.  రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ ఈ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, బ్యాంక్ నుంచి రూ. 8.15 లక్షల రుణం లభిస్తుంది. ఈ లోన్‌పై బ్యాంక్ మీకు 9 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఐదు సంవత్సరాల కాలానికి రుణం ఇస్తుంది. దీని తర్వాత కారుని ఇంటికి తీసుకురావచ్చు. తదుపరి 60 నెలల వరకు మీరు దాదాపు రూ. 16,918 EMI చెల్లించాలి. రూ. 2 లక్షల వరకు వడ్డీని చెల్లిస్తారు.కంపెనీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో టాటా నెక్సాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో మీరు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటి ఎంపికను పొందుతారు. అంతేకాకుండా, ఇది సురక్షితమైన కారుగా కూడా పరిగణించబడుతుంది. కంపెనీ ప్రకారం, టాటా నెక్సాన్ లీటరుకు 17.18 నుంచి 24.08 కిమీల మైలేజీని అందిస్తుంది. టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల నుంచి మొదలై రూ. 15.80 లక్షల వరకు ఉంటుంది. ఇది కాకుండా, ప్రజలు చాలా ఇష్టపడే ఈ కారులో కంపెనీ అనేక ఆధునిక ఫీచర్లను కూడా అందించింది. టాటా నెక్సాన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాహనాలకు ప్రత్యక్ష పోటీని ఇస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం  తాజాగా 96మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57మంది డీఎస్పీలు హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంటకాగి, ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసిన వారి జాబితాను ఇందులో పొందుపరిచినట్లు సమాచారం. మొత్తంగా 96మందిని స్థానచలనం చేయగా.. వీరిలో కొందరు వివాద రహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. మిగతా 57మందిని మాత్రం హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. బదిలీ అయినవారిలో సీఐడీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌, మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో ఉన్న స్కిల్‌ కేసుకు సంబంధించి సంజయ్‌, పొన్నవోలు మీడియా సమావేశం పెట్టడంపై ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ యునైటెడ్‌ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మీడియా సమావేశం పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిల్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌, పొన్నవోలుకు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 9కి వాయిదా పడింది.

మహారాష్ట్రలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడితో సరికొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ బుధవారం వెల్లడించింది. ఛత్రపతి శంభాజీ నగర్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టయోటా ఒక ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలో ప్రధాన కార్యాలయంతో పాటు ఇప్పటికే బెంగళూరు సమీపంలోని బిదాడిలో రెండు తయారీ యూనిట్లను కలిగి ఉంది. టయోటాకు సంబంధించిన ఎగుమతులు విలువ పరంగా సుమారు రూ.32 వేల కోట్లుగా ఉన్నాయి. టయోటా ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లలో 3.42 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఇటీవల దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది. వీరిలో ఏడుగురిని కొత్తగా నియమిస్తూ ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటికి బదీలీ చేస్తూ శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్రమంలో కొత్త గవర్నర్‌ తెలంగాణ వచ్చారు.

అసెంబ్లీ లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన గందరగోళం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో నేను ఎవ్వరి పేర్లు ప్రస్తావించలేదని చెప్పారు. తాజాగా మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో నా గెలుపునకు తనే బాధ్యత తీసుకుంటానని చెప్పి, నా టికెట్ ప్రకటించగానే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లారని ధ్వజమెత్తారు. తమ్ముడిని ఒంటరి చేసి అక్క బీఆర్ఎస్ లోకి వెళ్లి పోయిందన్నారు. సభలో నేను పొలిటికల్ గా అనుభవాలు మాత్రమే చెప్పాను. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని భట్టి క్లియర్ గా చెప్పారని, అంతకంటే ఏం మాట్లాడగలం అన్నారు. 2014లో సబితకు టికెట్ ఇవ్వలేదు. 2018లో ఉత్తమ్ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. సునిత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే తన పై రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఈ సభ చాలా డెమోక్రటిక్ గా ఉందని.. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. చర్చకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షానికి ఇంత సమయం కేటాయించారా..? అని ప్రశ్నించారు. సభలో సస్పెన్స్ ఉండొద్దు అనేది మా ఆలోచన అని అయితే అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావచ్చని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. రాగల మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో గాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆగస్టు 3న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ఆంధ్రప్రదేశ్ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్‌లు ఈ పర్యటనకు వెళ్లారు. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది. నవీ ముంబై నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో సిడ్కో పాత్ర చాలా కీలకమైనది. మంత్రి నారాయణ బృందం నవీ ముంబైలో రోడ్ నెట్ వర్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై అధ్యయనం చేసింది. నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రభావిత నోటిఫైడ్ ఏరియాలో బృందం పర్యటించింది. ఆ తర్వాత సిడ్కో అధికారులతో సమావేశమైంది. అక్కడి హౌసింగ్ స్కీమ్స్, ఆర్థిక ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలు గురించి సిడ్కో అధికారులు వివరించారు. నవీ ముంబై అభివృద్ధిపై సిడ్కో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు రేపు వయనాడ్ ప్రాంతంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బుధవారమే వీరిద్దరు వయనాడ్ వెళ్లాల్సి ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం ఫలితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కుదరదని అధికారులు తెలియజేయడంతో పర్యటన వాయిదా పడింది. వీరిద్దరు ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ మరియు సెయింట్ జోసెఫ్ యుపి స్కూల్, మెప్పాడిలోని రిలీఫ్ క్యాంపులను సందర్శిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ, మెప్పాడిని కూడా సందర్శిస్తారని తెలియజేశారు. 

ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 6-2తో నెదర్లాండ్స్‌కు చెందిన క్వింటీ రోఫెన్‌ను దీపిక ఓడించింది. క్వింటిపై దీపిక 2-0తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. దీపిక తొలి సెట్‌లో 29 పాయింట్లు సాధించగా.. నెదర్లాండ్స్‌కు చెందిన ఆమె ప్రత్యర్థి 28 పాయింట్లు చేసింది. తొలి సెట్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన దీపిక 27-29 స్కోరుతో క్వింటి చేతిలో రెండో సెట్‌ను కోల్పోయింది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య మ్యాచ్ 2-2తో సాగింది. అయితే, దీపిక మూడో సెట్‌లో పుంజుకుని 4-2తో ఆధిక్యంలో నిలిచింది. అప్పటికి.. దీపిక 25 పాయింట్లు సాధించగా, క్వింటీ 17 పాయింట్లు చేసింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ క్రీడాకారిణి మొదటి షాట్‌ను బయట ఆడడంతో ఆమెకు పాయింట్ రాలేదు. దీంతో తర్వాతి సెట్‌లో దీపిక ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సులువైన విజయాన్ని నమోదు చేసింది. దీపిక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది. అందులో దీపిక ప్రత్యర్థి జర్మనీకి చెందిన మిచెల్ క్రోపెన్ తో తలపడనుంది. 

ప్రైవేటు కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు తమ బెసిక్‌ సాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం.. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)కి జమ చేస్తారు. ఇది మొత్తంగా 24 శాతం ఉంటేదీనిలో సగం అనగా 12 శాతాన్ని ఉద్యోగి వేతనం నుంచి కట్‌ చేస్తే మిగతా మొత్తాన్ని కంపెనీ భరిస్తుంది. కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఈ మొత్తాన్ని ఉద్యోగి వేతనం నుంచే కట్‌ చేసి పీఎఫ్‌కు జమ చేస్తారు. యాజమాన్యం చెల్లించే 12 శాతంలో రెండు భాగాలుంటాయి. దీనిలో 8.33 శాతం ఎంప్లాయిస్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఈపీఎస్‌కు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్‌ స్కీమ్‌కు జమ చేస్తారు. ఇది సదరు వ్యక్తి ఉద్యోగ విరమణ పొందాక నెలనెలా పెన్షన్‌ పొండానికి, మధ్యలో ఏవైనా అత్యవసర పరిస్థితి వస్తే వాడుకోవడానికి ఉపయోగపడతాయి. కనీస పెన్షన్‌కు సంబంధించి 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌-1995 పరిదిలోని పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1000గా నిర్ణయించింది. అయితే ఈ మొత్తాన్ని 7500 రూపాయలకు పెంచాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అంటున్నారు. అందుకు కారణం కనీస పెన్షన్‌ను 7500 రూపాయలకు పెంచాలంటూ పెన్షనర్ల బాడీ ఈపీఎస్‌-95 జాతీయ ఉద్యమ కమిటీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. కనీస పెన్షన్‌ పెంపుపై ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెన్షనర్లు.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారి అభ్యర్థనను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే నేడు జాతీయ ఉద్యమ కమిటీ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి రెండూ రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించే పథకాలే. వీటిని ఈపీఎఫ్, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం నిర్వహిస్తారు. ఈపీఎఫ్‌కయితే ఉద్యోగులు, యాజమాన్యాలు తమ వంతు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈపీఎస్‌ విషయానికి వస్తే.. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ లేకుండానే ఈపీఎస్ పెన్షన్ ఇస్తుంది. ఇక ప్రస్తుతం పెన్షనర్లు నెలకు సగటున రూ.1450 పెన్షన్‌ పొందుతున్నారు. వీరిలో 3.6 మిలియన్ల మంది పెన్షనర్లు నెలకు రూ.1000 కన్నా తక్కువ పెన్షన్‌ అందుకుంటున్నారని కమిటీ తెలిపింది.

ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగవలసిన మంత్రివర్గ సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండడంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. పింఛన్ల పంపిణీని పండుగ వాతావరణంలోఅన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా మంత్రులు కూడా పంపిణీలో పాల్గొననున్న దృష్ట్యా ఈ మంత్రి వర్గ సమావేశాన్ని వారం చివరల్లో నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇళ్ల పంపిణీ తదితర హామీలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో చర్చించాల్సిన అంశాలను, ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలైనా సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిపై  సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కేటీఆర్, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 'మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సున్నితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరికి జరిగిన అవమానం. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం. ఈ ముఖ్యమంత్రి అన్‌ఫిట్ ముఖ్యమంత్రి. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు. కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులిద్ది.' అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 'మా మహిళా నేతలిద్దరూ కష్టపడి, ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ మాదిరిగా పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కాదు. సీఎం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు భట్టి విక్రమార్కా! పదేళ్లు అధికారంలో ఉన్నా ఏరోజైనా ఆడబిడ్డలను అవమానించామా? ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడామని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం. ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం. ముఖ్యమంత్రి సిగ్గు, బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో. ఇకనైనా ముఖ్యమంత్రి సమయం ఎంతో వివరించకుంటే ఊరుకునేది లేదు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్.' అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్‌ తరుణ్‌ తనతో పదేళ్లకుపైగా సహ జీవనం చేశాడని, కానీ ఇప్పుడు వదిలేసి, హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాని వివాహం చేసుకోబోతున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌కు ఈ విషయమై నోటీసులు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ అంశ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్నా రాజ్‌ తరుణ్‌ కానీ, మాల్వీ కానీ ఒక్కసారి కూడా అధికారికంగా స్పందించింది లేదు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి తొలిసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా కలిసి నటించిన 'తిరగబడరా సామి' మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వీరిద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. లావణ్య వివాదం గురించి మాట్లాడుతూ ఆరోపణలు చేసేవాళ్ళు బయట అలాగే మాట్లాడతారన్నాడు. తాను లీగల్ గానే ప్రొసీడ్ అవుతానని, ఆల్రెడీ ప్రొసీడ్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇక తాను వేరే వాళ్లకు డ్యామేజీ చేయకూడదనే వేరే వాళ్ళ పేర్లు బయట పెట్టలేదన్నాడు. తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని, తన తరపున లాయర్ హాజరయ్యారని రాజ్‌ తరుణ్‌ తెలిపాడు. ఇక మాల్వీ మల్హోత్ర గురించి కూడా రాజ్‌ తరుణ్‌ మాట్లాడాడు. మాల్వీ గొప్ప నటి అని తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రమన్నాడు. ఈ వివాదాలు పక్కనపెట్టేసి ఆమెను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా అని రాజ్‌ తరుణ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. పుణెలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి పలు సౌకర్యాలు కల్పించాలని అధికారులను డిమాండ్ చేయడం, కారుపై ఎర్రబుగ్గ లైటు, రాష్ట్ర ప్రభుత్వ నేమ్‌ప్లేట్ వాడటం వంటి చర్యలకు పాల్పడటంతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే యూపీఎస్‌సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన యూపీఎస్సీ ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటే షోకాస్ నోటీసు ఇచ్చింది. జూలై 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని యూపీఎస్‌సీ కోరగా, గడువు ఆగస్టు 4 వరకూ పొడిగించాలని ఆమె తిరిగి కోరారు. ఇందుకు యూపీఎస్‌సీ తిరస్కరిస్తూ జూలై 30 వరకూ అదనపు సమయం కల్పించింది. కానీ గడువులోగా ఆమె సమాధానం ఇవ్వలేదని, దీంతో ఆమె ప్రొవెన్షియల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ, భవిష్యత్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. నకిలీ పత్రాలతో పూజా ఖేడ్కర్ పరీక్షలు క్లియర్ చేయడం, తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామ వంటి పత్రాలను మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సార్లు పరీక్షలు రాసినట్టు యూపీఎస్‌సీ గుర్తించింది. ఐపీసీలోని సెక్షన్ 420, 464, 465, 471, 89-91, 66డి కింద కేసులు నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రైతు బజార్లలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.150కీ, బియ్యం రూ.48 నుంచి రూ.46కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.47కీ తగ్గించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రైతు బజార్లలో ఉన్న ప్రత్యేక కౌంటర్లలో గురువారం నుంచి తగ్గింపు ధరల్లో విక్రయిస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం- ఈ నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి అన్నారు.

పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్ లో ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలుపొందింది. గ్రూప్ -ఎం నుంచి సింధూ ప్రిక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. తొలి గేమ్ లో క్రిస్టినా ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. రెండో గేం ఆరంభంలో మాత్రమ క్రిస్టినా నుంచి సింధుకు ప్రతి ఘటన ఎదురైంది. దీంతో రెండో గేమ్ లో ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా గేమ్ ను పూర్తి చేసింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.

జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం జిఎస్‌టిని తగ్గించాలని ఆ లేఖలో కోరారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై పన్ను విధించడం అంటే.. ఒక వ్యక్తి కష్టం, అనారోగ్యంపై పన్ను విధించినట్లేనని తెలిపారు. అదే విధంగా వైద్య బీమా ప్రీమియం రంగంపై 18% జిఎస్‌టి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్నారు. జీవిత, వైద్య బీమా ప్రీమియంపై జీఎస్టీ చెల్లించడం సీనియర్ సిటిజన్లకు పెద్ద సవాలుతో కూడుకున్నదని తెలిపారు. ఈ అంశంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తనకు మెమోరాండం సమర్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని పునపరిశీలించాలని నిర్మలా సీతారామన్‌కు గతంలో పలు మార్లు అభ్యర్థనలు వచ్చాయి. వ్యక్తిగత ఆరోగ్య పాలసీలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది జూన్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సామాజిక భద్రతకు కొలమానంగా ఈ పాలసీలను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించడంలో మీరు చేసే తగ్గింపు సహాయపడుతుందని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల సంఘం తెలిపింది. పెరిగిన పన్నుల రీత్యా గత 5 సంవత్సరాలలో ఆరోగ్య బీమా ప్రీమియం దాదాపు రెండింతలు పెరిగిందని.. దీంతో పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నా మళ్లీ రెన్యువల్ చేసుకోవడం లేదని.. రెన్యువల్ చేసుకున్న వారు 65 నుంచి 75 శాతం వరకే ఉంటుందని పేర్కొంది. బీమా ప్రీమియంలను తరచుగా పెంచడం, ఎక్కువ జీఎస్‌టీ రేటు కారణంగా చాలా మంది పాలసీదారులు ప్రీమియం చెల్లించలేకపోతున్నారని సంఘం పేర్కొంది. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్  ఎమ్మెల్యే కేటీఆర్ రెండున్నర గంటల పాటు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించారు. రేవంత్ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. ఆ ఒక్క మాటతో సభ దద్దరిల్లింది. లీడర్ ఆఫ్ ది హౌజ్‌ని పట్టుకుని ఏకవచనంతో పిలవడం తప్పు అని స్పీకర్ మందలించడంతో కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. “నేను రెండు మాస్టర్స్ చేసాను. గుంటూరులో చదివాను. ఆ తర్వాత న్యూయార్క్‌లో చదివాను. పోటీ పరీక్షలు రాసాను. ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ఇది నా చదువు. మరి రేవంత్ గారు ఏం చదువుకున్నారో నాకైతే తెల్వదు. నేను రేవంత్ ఒకప్పుడు మంచి మిత్రులం. అసెంబ్లీలోనే కాదు బయట కూడా బాగానే ఉండేవాళ్లం. గత పదేళ్లలో మా స్నేహం చెడిన మాట వాస్తవం. ఏదేమైనప్పటికీ ఆయన ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారంటే అదృష్టవంతుడు. అలాంటప్పుడు ఆయన మూసీ నదిని లండన్ బ్రిడ్జ్‌గా, మహేశ్వరాన్ని న్యూయార్క్‌గా చేస్తానని ప్రకటించాడు. అలా చేస్తే మాకంటే ఎక్కువ ఎవ్వరూ సంతోషించరు“ అన్నారు.

గోంగూరలో విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కెరోటిన్ అధికంగా ఉంటాయి. మన శరీరానికి కావలసిన విటమిన్ సి 53 శాతం ఈ గోంగూర లో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. గోంగూర పూలను దంచి దాని నుండి రసం తీసి వడకట్టుకొని దానిలో ఒక అరకప్పు వరకు పాలు పోసుకొని ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గోంగూర ఆకుల పేస్ట్ ను తలకి అప్లై చేసుకొని కొంత సమయం తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. గోంగూరలో పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి. దీనిని తినడం వలన హై బీపీని నియంత్రించవచ్చు. గోంగూరను వారంలో మూడు నాలుగు సార్లు తిన్నట్లయితే హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారు కూడా గోంగూరను తీసుకోవటం వలన ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు గోంగూరను తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. గోంగూరలో ఉన్నటువంటి క్లోరోఫిల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అదుపులో ఉంచుతుంది. గోంగూర పులిహోర లాగా చేసుకుని కూడా  తినవచ్చు. అలాగే ఈ గోంగూర నుండి తీసినటువంటి జిగురును నీటిలో కలుపుకొని తాగితే విరోచనాలు కూడా తగ్గుతాయి. మహిళలకు పీరియడ్స్ టైం లో కాళ్లు లాగటం, నడుము నొప్పి లాంటి సమస్యలతో ఎంతో ఇబ్బంది పడతారు.అలాగే ఎంతో నీరసంగా కూడా ఉంటారు. ఈ తరుణంలో గోంగూర ను తీసుకోవటం వలన శరీరానికి కావలసిన శక్తి అనేది వస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచటం లో, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేయడంలో గోంగూర ముఖ్య పాత్ర వహిస్తుంది. గోంగూరలో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన ఎముకలు అనేవి ఎంతో దృఢంగా తయారవుతాయి. 

భారత్‌ వినియోగదారుల కోసం 'స్నాప్‌డ్రాగన్‌ ఫర్‌ ఇండియా' ఈవెంట్‌ను క్వాల్‌కామ్‌ కంపెనీ మంగళవారం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ఎంట్రీ లెవల్‌ 5జీ హ్యాండ్‌సెట్ల కోసం ప్రత్యేకంగా ‘స్నాప్‌డ్రాగన్‌ 4ఎస్‌ జన్‌ 2’ ప్రాసెసర్‌ను క్వాల్‌కామ్‌ తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్‌ కారణంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు దిగొస్తాయని తెలిపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందించాలన్న ఉద్దేశంతో కొత్త చిప్‌సెట్‌ను తీసుకొచ్చినట్లు క్వాల్‌కామ్‌ చెప్పింది. స్నాప్‌డ్రాగన్‌ 4ఎస్‌ జన్‌ 2తో తొలి డివైజ్‌ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం ఉన్నట్లు క్వాల్‌కామ్‌ పేర్కొంది. షావోమి సహా మరికొన్ని మొబైల్‌ తయారీ సంస్థలు ఈ ప్రాసెసర్‌ను వినియోగించనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.10 వేలపైనే ఉన్నాయి. ఏ కంపెనీ మొబైల్స్ చూసుకున్నా ధరలు బాగానే ఉన్నాయి.

ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు కస్టమైజ్డ్ ఏఐ చాట్ బాట్ లను అభివృద్ధి చేయడానికి, డిజైన్ చేయడానికి వీలుగా ఏఐ స్టూడియో అనే కొత్త టూల్ ను విడుదల చేయనుందట !. ఈ కొత్త ఏఐ టూల్ తో ఇన్ స్టా యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు తమకు నచ్చిన ఏఐ క్యారెక్టర్లను సృష్టించుకోవచ్చు. వాటిని ఇంటరాక్టివ్ గా తమ పేజ్ లో ఉపయోగించుకోవచ్చట. ఏఐ క్యారెక్టర్లను ఉపయోగించి మెటా ప్లాట్ ఫామ్స్ లో క్రియేటర్లు చాలా చేయవచ్చట. వారి సొంత కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను సృష్టించడంతో పాటు, ఆ ఏఐ క్యారెక్టర్లతో ఇంటరాక్టివ్ సెషన్స్ ను నిర్వహించవచ్చట. ఫాలోవర్ల సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వవచ్చట. ఏఐ మెటా స్టూడియో ద్వారా మీ ప్రతినిధిగా ఇన్ స్టాలో ఈ ఏఐ క్యారెక్టర్లను అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నారు. మెటా యాజమాన్యంలోని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వినియోగదారులు తమ కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను పంచుకోవచ్చట. అయితే ఈ ఈ టూల్ ను మెటా లామా 3.1 ను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది ఎక్కువగా ఉచిత కృత్రిమ మేధస్సు మోడళ్ల ను అందిస్తుంది. గత వారం లాంచ్ అయిన మెటా లామా 3.1 ను వివిధ భాషల్లో యాక్సెస్ చేయవచ్చు. ఇది ఓపెన్ఎఐ వంటి పోటీదారులు విడుదల చేసిన పెయిడ్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

దేశంలోని టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత అంబానీని ఎదిరించే విధంగా బీఎస్ఎన్ఎల్ తయారవుతుంది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభించడంతో దేశంలోని ప్రముఖ ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వంటి సంస్థల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇటీవల రేట్లు కూడా పెరగగా, చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు అడుగులు వేశారు. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న జియో టారిఫ్ రేట్లని మళ్లీ తగ్గించింది. అయితే ప్రస్తుత టెలికాం రంగంలో జియో, బీఎస్ఎన్ఎల్ మధ్య గట్టిపోటీ నడుస్తుంది. జియో, బీఎస్ఎన్ఎల్‌లలో నెలవారీ లేదా 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ వస్తుండగా, అందులో జియో నుంచి రూ. 348, బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 108, రూ. 107 ప్లాన్లు ఉన్నాయి. రిలయన్స్ జియో రూ. 349 ప్రీ పెయిడ్ ప్లాన్ చూస్తే ఆ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ప్రతి రోజూ 2 జీబీ 5జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ తీసుకోవడం ద్వారా జియో సినిమా యాప్ నకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా మనం పొందవచ్చు. ఇక వీటితో పాటు యాడ్ ఆన్ ప్లాన్ లని కూడా అందిస్తుంది. ఇవి అన్ లిమిటెడ్ ప్లాన్లు. రూ. 151, రూ. 101, రూ. 51 ట్యారిఫ్ తో ఈ ప్లాన్లు ఉన్నాయి. రూ. 151 రీచార్జ్ తో 9జీబీ, రూ. 101 రీచార్జ్ తో 6జీబీ, రూ. 51 రీచార్జ్ తో 3జీబీ 4జీ డేటా లభిస్తుంది. మొదటి సారి రీచార్జ్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు రూ. 108 ప్లాన్ (మొదటి రీఛార్జ్ కూపన్) పొందవచ్చు. వీరికి 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతి రోజూ 1జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్ రిపీట్ చేస్తే ఈ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దీనిలో 200 నిమిషాల వాయిస్ కాల్స్, 3 జీబీ 4జీ డేటా లభిస్తుంది.బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 ప్లాన్‌. ఈ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్యాక్‌ తో రీఛార్జీ చేసుకుంటే 300 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. తరచూ రీఛార్జీలు చేసుకునే వినియోగదారులకు ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఇది వినియోగదారులకు ఏడాదిపాటు నిరంతరాయ లాభాలను గడిస్తుంది.

పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిది. పచ్చి కొబ్బరిలో అనేక రకాలైన పోషక విలువలు దాగి ఉంటాయి. చర్మానికి, జుట్టుకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి కొబ్బరితో ఆరోగ్యమే కాకుండా అందం కూడా మీ సొంతం అవుతుంది. పచ్చి కొబ్బరిని అప్పుడప్పుడూ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. కేరళలో పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరితో తయారు చేసే వాటిల్లో కొబ్బరి లడ్డూలు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, పంచదార, పాలు, యాలకుల పొడి, డ్రై ఫ్రైట్స్ లడ్డూలు తయారీకి కావాలి.  ముందుగా ఒక కడాయిలో పచ్చి కొబ్బరి తురుము వేసి చిన్న మంటపై ఓ పది నిమిషాలు వేయించండి. అయితే ఈ తురుము అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలి. పొడి పొడిగా ఈ తురుము అవ్వాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసి మరి కాసేపు కలుపుకోవాలి. నెయ్యిలో తురుము వేగిన తర్వాత.. కాచి చల్లార్చిన పాలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో పంచదారను కూడా వేసి.. ఇది పూర్తిగా కరిగే వరకు ఓ పది నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆ నెక్ట్స్ యాలకుల పొడి వేసి మారికాసేపు కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో కావాలంటే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేయాలని. ఈ లడ్డూలు చుట్టేటప్పుడు వీటిపై పచ్చి కొబ్బరి తురుము చల్లి గార్నిష్ చేస్తే.. చూడటానికి కూడా ఆకర్షణగా ఉంటాయి. వీటికి గాలి తగలకుండా నిల్వ ఉంచితే మూడు రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దంపుడు బియ్యం అని కూడా పిలువబడే బ్రౌన్ రైస్ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని తక్కువగా ప్రాసెస్ చేయబడటం వల్ల బ్రౌన్ రైస్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బ్రౌన్ రైస్ అనేది ఒక పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక. ఇది మీ ఆహారంలో చేర్చడానికి మంచి మార్గం. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు ఇంకా ఫైబర్‌ను అందిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. అంతేగాక చర్మానికి చాలా మంచిది. ఈ బ్రౌన్ రైస్ లోని విటమిన్ B , E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇంకా అలాగే మొటిమలను నివారించడానికి సహాయపడతాయి. బ్రౌన్ రైస్ ను అన్నం, పులుసు, సలాడ్ లు వంటి వివిధ వంటకాలలో ఉపయోగించవచ్చు. ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాల తయారీకి కూడా ఈ రైస్ ని ఉపయోగించవచ్చు. అలాగే పాప్‌కార్న్ లాగా కూడా తినవచ్చు. ఇందులోని ఫైబర్ కొన్ని రకాల క్యాన్సర్, ముఖ్యంగా కొలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ లోని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. బ్రౌన్ రైస్ లోని విటమిన్ బి,ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది.ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రౌన్ రైస్ లోని ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. తద్వారా తక్కువ తినడానికి సహాయపడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపయిన కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను త్వరగా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నియామక ప్రక్రియపై కోర్టుల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నాయి. వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆ తర్వాత పీఎంటీ, పీఈటీ పరీక్షలు జరగాలి.. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియన పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశ ఉంది. 

న్యూఢిల్లీ లోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బెస్‌మెంట్‌లో భారీ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతి చెందిన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకు వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 30 సివిల్స్ కోచింగ్ సెంటర్ల బెస్‌మెంట్‌ను సీల్ చేశామని తెలిపారు. అలాగే 200 కోచింగ్ సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ షెల్లీ ఓబెరియ్‌తో కలసి మంత్రి అతిషి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అధికారులు, విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. డ్రైనేజ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అందువల్ల వరద నీరు బయటకు వెళ్ల మార్గం లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సైతం తన ప్రాథమిక నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని మంత్రి అతిషి వివరించారు. డ్రైనేజిలపై కోచింగ్ సెంటర్ల అక్రమ నిర్మాణం కారణంగా.. వరద నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీంతో ఆ ప్రాంతంలో డ్రైనేజీ మూసుకు పోయిందన్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలను నియంత్రించడంతో విఫలమైన జూనియర్ ఇంజినీర్‌ను ఉద్యోగ విధుల నుంచి శాశ్వతంగా తొలగించామని చెప్పారు. అలాగే అసిస్టెంట్ ఇంజినీర్‌పై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. గత మూడురోజులుగా వివిధ కోచింగ్ సెంటర్లలలో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ ద్వారా కూల్చివేస్తున్నట్లు వివరించారు. మరో ఆరు రోజుల్లో ఈ సంఘటనపై మేజిస్టేరియల్ నివేదిక అందనుందన్నారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అతిషి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు అదనపు కార్యదర్శి సారథ్యంలో ఉన్న స్థాయి కమిటీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని.. అయితే ఆ నివేదిక వచ్చే లోపే తమ ప్రభుత్వం కార్యచరణ చేపడుతుందని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ షెల్లీ ఒబేరాయ్ మాట్లాడుతూ ఆందోళన బాట పట్టిన సివిల్స్ విద్యార్థుల డిమాండ్లను తాము వింటామన్నారు. అందుకోసం త్వరలో వారితో సమావేశం కానున్నామని ప్రకటించారు. అనంతరం కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకు వస్తామని మేయర్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం భారీ వర్షాల కారణంగా.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరద నీరు ప్రవేశించింది. ఈ నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మైక్రోసాఫ్ట్‌ 365 సర్వీస్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అనేక మంది సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. జులై 30 సాయంత్రం సమయంలో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు తమ సోషల్‌ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. జులై 19 న కూడా ఈ సమస్య తలెత్తింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా విమాన సర్వీసులు రద్దు మరియు ఆలస్యంగా ప్రయాణించాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించిన కొన్ని రోజుల అనంతరం మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన చేసింది. ఇదే తరహా సాంకేతిక సమస్య భవిష్యత్‌లోనూ ఎదురుకావచ్చని హెచ్చరించింది. ఇందుకు యూరోపియన్‌ కమిషన్‌ రూపొందించిన కొన్ని నిబంధనలు కారణమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. ఈ సమస్యపై X వేదికగా azure Support స్పందించింది. వినియోగదారుల సహనానికి ధన్యవాదాలు తెలిపింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, వీలైనంత వేగంగా చక్కదిద్దుతామని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌ ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యపై తమకు అవగాహన ఉందని, పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు 365 స్టాటస్‌ అకౌంట్‌ కూడా వెల్లడించింది. Downdetector లో అవుట్‌లుక్‌ సహా ఇతర అప్లికేషన్‌లకు సంబంధించిన సమస్యలపై అనేక మంది యూజర్లు ఫిర్యాదు నేపథ్యంలో సంస్థ ఈ అంతరాయన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో ఈనెల 19న తలెత్తిన అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా కంప్యూటర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఈ సమస్యను బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ ఎర్రర్‌గా పేరొన్నారు. Crowdstrike లో అప్‌డేట్‌ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అదే రోజు మైక్రోసాఫ్ట్‌ ఈ సమస్యను పరిష్కరించింది. మైక్రోసాఫ్ట్‌లో ఇటీవల తలెత్తిన అంతరాయం కారణంగా సుమారుగా రోజంతా అనేక సంస్థలు తమ కార్యకాలాపాలను నిర్వహించలేకపోయాయి. అనేక విమానాల రద్దు సహా ఆలస్యంగా ప్రయాణాలను ప్రారంభించాయి. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యపై అనేక మంది సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. క్రౌడ్‌ స్ట్రైక్‌ సంస్థ మాత్రం దీనిపై వివరణ ఇచ్చింది. విండోస్‌లో కేవలం సాంకేతిక అంతరాయం మాత్రమే తలెత్తిందని.. ఎటువంటి భద్రతా మరియు సైబర్‌ అటాక్‌ కాదని స్పష్టంచేసింది. మైక్రోసాఫ్ట్‌ గతవారం మరో కీలక ప్రకటన చేసింది. భవిష్యత్‌లో మరోసారి క్రౌడ్‌స్ట్రైక్‌ తరహా అంతరాయం తలెత్తే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రాకుండా నిరోధించే అవకాశం లేదని మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. థర్డ్ పార్టీ విక్రేతలకు కూడా OS కెర్నల్‌ వెర్షన్‌ పూర్తి యాక్సెస్‌ను పొందేలా కొత్త నిబంధనను యూరోపియన్‌ కమిషన్‌ తీసుకొచ్చింది. అంటే మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లకు ఉండే స్థాయిలోనే క్రౌడ్‌ స్ట్రైక్‌ వంటి థర్డ్‌ పార్టీ సంస్థల ఇంజినీర్లకు పూర్తి యాక్సెస్‌ ఉంటుంది. దీంతో భవిష్యత్‌లోనూ సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతలోనే రెండు వారాల్లోనే రెండోసారి సాంకేతిక సమస్య తలెత్తింది.

కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 93కు చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీతో సహా ప్రకృతి వైపరీత్యాల బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మోప్పాడి సమీపంలోని పలు కొండ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. అనేక మంది గాయపడగా, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయారు. రెస్యూ ప్రయత్నాల్లో భాగంగా సెకండ్-ఇన్-కమాండ్ కింద ఒక మెడికల్ అధికారి, ఇద్దరు జేసీఓలు, 40 మంది జవాన్లను మోహరించినట్టు డిఫెన్స్ పీఆర్ఓ తెలిపారు. కాగా, 300 మంది సిబ్బందితో భారత ఆర్మీ బలగాలను వెంటనే రంగంలోకి దింపినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్‌లో తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అదనపు ఆర్మీ బలగాలు, నేవీ సిబ్బంది, వాయిసేన హెలికాప్టర్లను సమీకరించామని చెప్పారు. భారీ ఇంజనీరింగ్ సామాగ్రి, డాగ్ టీమ్‌లు, నిత్యావసరాలను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా త్రివేండ్రం, బెంగళూరు, ఢిల్లీ నుంచి పంపిస్తున్నట్టు వివరించారు. వయనాడ్ విలయం నుంచి కేరళను ఆదుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సాయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. కేరళ బ్యాంక్ ఇప్పటికే సీ ఎండీఆర్ఎఫ్ కోసం రూ.50 లక్షలు కంట్రిబ్యూట్ చేసిందని, సిక్కిం ముఖ్యమంత్రి రూ.2 కోట్లు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రూ.5 కోట్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో రెండ్రోజుల సంతాప దినాలు ప్రకటించామని, పబ్లిక్ ఈవెంట్లు, ఉత్సవాలు నిషేధించామని తెలిపారు. సంతాప దినాల్లో జాతీయ పతకాన్ని 'హాఫ్-మాస్ట్' చేయాలని ప్రజలను కోరారు.

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఏడు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువనున్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఔట్‌ ఫ్లో 2.05లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం సాయంత్రం ఆరింటికి 883.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా 207.04 టీఎంసీలుగా ఉంది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. 2-0 గోల్స్‌ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. దీంతో పూల్‌-బిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పెనాల్టీ కార్నర్‌, పెనాల్టీ స్ట్రోక్‌లను గోల్స్‌గా మలచి.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌.. న్యూజిలాండ్‌ను 2-1తో ఓడించిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌ను అర్జెంటీనాతో 1-1తో డ్రాగా ముగించింది. తదుపరి మ్యాచులు బెల్జియం, ఆస్ట్రేలియాతో ఆడనుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో 'లవ్ జిహాద్' బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై దోషులకు యావజ్జీవం శిక్ష పడే అవకాశం ఉంటుంది. బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది. సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడన వారికి పదేళ్ల జైలు, రూ.50,00 జరిమానా ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది.

వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు భారత పర్యటనలో ఉంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక చర్చలపై చర్చించనున్నారు. మరోవైపు.. భారతదేశం వియత్నాంను తన యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలక స్తంభంగా.. ఇండో-పసిఫిక్ దృష్టిలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తుంది. వియత్నాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్హ్‌తో పాటు పలువురు మంత్రులు, ఉప మంత్రులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనలో ఉన్నారు. వియత్నాం ప్రధానమంత్రి పర్యటన ప్రతిపాదిత కార్యక్రమం ప్రకారం.. ఆగష్టు 1న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో సందర్శిస్తున్న నాయకుడిగా అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత అతను మహాత్మా గాంధీకి నివాళులర్పించడానికి రాజ్‌ఘాట్‌కు వెళ్తారు. ఆ తర్వాత.. ప్రధాని మోడీని కలువనున్నారు. అనంతరం వారిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. తన మూడు రోజుల భారత పర్యటనలో.. ఫామ్ మిన్ చిన్హ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్‌లను కూడా కలుస్తారు. 

రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతే అని కేసీఆర్ ను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించనట్టే. దేశంలో అర్ధరాత్రి వరకు సభ నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 83 ఏండ్ల ఖర్గే, ఆరోగ్యం బాగాలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారు. అలాంటిది కేసీఆర్ కు ఏమైంది, సభకు ఎందుకు హాజరవ్వడం లేదు అని ప్రశ్నించిన కోమటిరెడ్డి సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లే అని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ రెండవసారి మళ్ళీ ప్రభుత్వ ఏర్పటు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మీద హరీష్ రావుకి, కేటీఆర్ కి నమ్మకం లేదు. రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్ళాము అధికారం లోకి వచ్చాము. సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్, హరీష్ ఎన్నికల్లో రేవంత్ ని ఎందుకు ఓడించలేదు అని అన్నారు. మేము దింపిన బుల్లెట్ కేసీఆర్ కి దిగింది… సీఎం సీటు పోయింది. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీ లో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడు. త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు మా పార్టీలోకి వస్తున్నారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ లో కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళ డయల్ 100 నంబర్‌కు కాల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్‌లో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఈ బస్‌లో కృష్ణ, సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ వెంటనే డయల్ 100 నంబర్‌కు కాల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు బస్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదం నింపాయి. భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల కొండచరియలు విరిగిపడటం, బురద కొట్టుకురావడంతో 80 మంది జల సమాధి అయ్యారు. ఇప్పటివరకూ 80 మంది మృతదేహాలు దొరికినట్లు కేరళ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వి.వేణు ప్రకటించారు. 116 మంది తీవ్ర గాయాలపాలై వయనాడ్ జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందల మంది వరదల్లో గల్లంతయ్యారు. ఈ జల ప్రళయం కేరళను అల్లకల్లోలం చేసింది. జులై 30న అర్థరాత్రి సమయంలో వయనాడ్ జిల్లాలో ఊళ్లకు ఊళ్లు కొండచరియలు, బురద, వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈ విషాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వయనాడ్ జిల్లా ఇలా శోకసంద్రంలో మునిగిపోవడం చూసి నెటిజన్లు హృదయవిదారక స్థితిలో స్పందిస్తున్నారు. కేరళలోనే వయనాడ్ జిల్లా అత్యంత సుందరమైన ప్రదేశం. సందర్శకులు వయనాడ్ అందాలను వీక్షించేందుకు భారీగా వెళుతుంటారు. అలాంటి ప్రాంతాలైన వయనాడ్లోని ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు ప్రస్తుతం విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి. మళప్పురంలోని చలియార్ నదిలో 11 మంది మృతదేహాలు కొట్టుకొచ్చాయి. కాళ్లు లేని స్థితిలో, చేతులు లేని స్థితిలో, మరికొందరి మృతదేహాలైతే తల లేకుండా మొండెం మాత్రమే నదిలోకి కొట్టుకొచ్చిందంటే ప్రకృతి ఉగ్రరూపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నదిలోకి కొట్టుకొచ్చిన ఈ 11 మంది మృతదేహాల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం శోచనీయం. వయనాడ్ జిల్లా మాత్రమే కాదు భారీ వర్షాలు కేరళ రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేశాయి. కేరళలోని 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ  రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్ జిల్లాలో వరదలకు బలైపోయిన బాధితులకు సంతాప సూచికగా జులై 30, 31.. ఈ రెండు రోజులను కేరళ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. కేరళకు వెళ్లే పలు రైళ్లు వరదల కారణంగా తాత్కాలికంగా రద్దు చేశారు. 17 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్, మళ్లపురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ ఈ 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ముండక్కై అనే గ్రామం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఇళ్లు కూలిపోయాయి. భారీ చెట్లు నేలకొరిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా కొండ చరియలు సృష్టించిన భయానక పరిస్థితులే కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అర్థరాత్రి అందరూ నిద్రిస్తుండగా, 2 నుంచి 4 గంటల మధ్యలో వయనాడ్ జిల్లాపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. మెప్పాడిలో 250 మంది వరదల్లో చిక్కుకుపోయారు. వర్షం పడుతూనే ఉండటంతో సహాయక బృందాలకు ఇబ్బందిగా మారింది. 200 మంది సైనికులు సహాయక చర్యల్లో భాగమయ్యారు.

కేరళ లోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయం సంభవించి అనేక మంది సజీవసమాధి కావడం, పదుల సంఖ్యలో గాయపడటంపై తమిళనాడు సర్కార్ కేరళకు ఆపన్న హస్తం అందించింది. అగ్నిమాపక, సహాయక సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో కూడిన మూడు టీమ్‌లను కేరళకు పంపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. రెస్క్యూ పనుల పర్యవేక్షణ కోసం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు జి.సమీరన్, జానీ టామ్ వర్ఘేసేలను తక్షణం కేరళ బయలుదేరి వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. సహాయక చర్యల కోసం సీఎం సహాయక నిధి నుంచి రూ.5 కోట్ల రూపాయలను కేరళకు అందించనున్నట్టు కూడా స్టాలిన్ ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో స్టాలిన్ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి వీలైనంత సహాయాన్ని అందించగలమని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఐఏఎస్ అధికారులను వయనాడ్ వెళ్లాల్సిందిగా సీఎం ఆదేశించినట్టు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 20 మంది అగ్నిమాపక సిబ్బంది, 20 మందితో కూడిన ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్, పది మంది డాక్టర్లు, నర్సులు, సపోర్ట్ స్టాఫ్‌ను తక్షణమే కేరళ వెళ్లాల్సిందింగా సీఎం ఆదేశించినట్టు తెలిపింది.

ఈ సంవత్సరం అదనంగా 12 ఎయిర్‌పోర్టులను ప్రారంభించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఉడాన్ పథకంలో భాగంగా నిర్మితమవుతున్నాయి. ఇవి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమవుతాయని తెలిసింది. ఈ ఎయిర్‌పోర్టులు వస్తే ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 85 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటి ద్వారా 579 రూట్లకు కనెక్టివిటీ ఉంది. ఈ ఎయిర్‌పోర్టుల్లో 13 హెలిపాడ్స్, 2 వాటర్ ఎయిరోడ్రోమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ 2016 నుంచి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై సోమవారం రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహోల్. ఉడాన్ పథకాన్ని కొనసాగిస్తున్నామనీ, ఎప్పటికప్పుడు బిడ్డింగ్ ప్రక్రియ జరుపుతూ.. కొత్త ఎయిర్‌పోర్టులూ, రూట్లు వచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. చాలా ఎయిర్‌పోర్టులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చే 12 ఎయిర్‌పోర్టులు ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, మధ్యప్రదేశ్‌లోని రేవా, దాతియా, మహారాష్ట్రలోని అమరావతి, సోలాపూర్, డామన్ డయ్యూలోని డామన్, హర్యానాలోని అంబాలా, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, శహరాన్‌పూర్, తమిళనాడులోని వెల్లూర్, నైవేలీ, అండమాన్ నికోబార్ లోని శివపూర్, కార్ నికోబార్‌లో రానున్నాయి. ఇండియాలో ఎయిర్‌పోర్టులను తీర్చి దిద్దేందుకు తొలి దశలో రూ.4,500 కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.1,000 కోట్లు కేటాయించారు.

ఆపిల్ ఐఫోన్ యూజర్లకు కొత్త ఐఓఎస్ 18.1 బీటాను డెవలపర్‌ల కోసం రిలీజ్ చేసింది. కొన్ని ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. దీన్ని స్టాండ్‌అవుట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ గా పిలుస్తారు. ఇందులో ఫోన్ కాల్‌లను రికార్డ్ చేసే చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ చాలా మంది వినియోగదారులకు గేమ్ ఛేంజర్ కావచ్చు. ముఖ్యమైన సంభాషణలను సులభంగా క్యాప్చర్ చేయగలదు. మీ వర్క్ మీటింగ్స్, ఇంటర్వ్యూలు లేదా పర్సనల్ కాల్‌ల కోసం అయినా ఈ కొత్త ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఐఫోన్ ఎంచుకున్న ఏదైనా టెక్స్ట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.మీరు ఆన్సర్ చేసినా లేదా కాల్ చేసినప్పుడు.. మీ ఐఫోన్ రికార్డింగ్‌ని ఎనేబుల్ చేయొచ్చు. మీరు స్క్రీన్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న రికార్డ్ బటన్‌ను నొక్కండి. మీరు రికార్డింగ్‌ని ప్రారంభించిన వెంటనే కాల్‌లో పాల్గొనే వారందరికీ కాల్ రికార్డ్ అవుతుందనే వాయిస్ మెసేజ్ వినబడుతుంది. మీ ఐఫోన్‌లో కాల్ రికార్డ్ ఆడియో సంభాషణను టెక్స్ట్ రూపంలో కూడా అందిస్తుంది. ఈ ట్రాన్స్‌క్రిప్షన్ రియల్ టైమ్‌లోనూ జరుగుతుంది. ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ఇంగ్లీష్ (వివిధ ప్రాంతాలు), స్పానిష్ (అమెరికా, మెక్సికో, స్పెయిన్), ఫ్రెంచ్ (ఫ్రాన్స్), జర్మన్ (జర్మనీ), జపనీస్ (జపాన్), మాండరిన్ చైనీస్ (మెయిన్‌ల్యాండ్ చైనా, తైవాన్), కాంటోనీస్ (మెయిన్‌ల్యాండ్)తో సహా మల్టీ భాషలకు సపోర్టు ఇస్తుంది. చైనా (హాంకాంగ్), పోర్చుగీస్ (బ్రెజిల్) ఈ వైడ్ రేంజ్ లాంగ్వేజీకి సపోర్టు అందిస్తుంది. ప్రపంచంలోని అనేక మంది వినియోగదారులు ఈ ఫీచర్ నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మొత్తం రికార్డింగ్‌ను వినాల్సిన అవసరం ఉండదు. మీ కాల్ సంభాషణలోని ముఖ్యమైన అంశాలను త్వరగా గుర్తించవచ్చు. ఆపిల్ మీ కాల్స్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని రీకాల్ చేయడాన్ని ఈ కొత్త ఫీచర్ సులభతరం చేస్తుంది. ఫోన్ కాల్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్‌తో పాటు ఫోన్ యాప్ అనేక ఇతర అప్‌డేట్‌లను అందిస్తుంది. కాల్ హిస్టరీ కోసం కొత్త సెర్చ్ ఇంటర్‌ఫేస్ గత కాల్‌లను యాప్ ఫోన్ నంబర్‌లకు ఆటోఫిల్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. మీరు ఫోన్ నంబర్ పూర్తిగా టైప్ చేయకుండానే ఫుల్ లిస్టు కనిపిస్తుంది. అదనంగా, కాల్ సమయంలో సిమ్ కార్డ్‌లను ఈజీగా స్విచ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. మల్టీ సిమ్‌లను ఉపయోగించే యూజర్లకు ఈ ఆప్షన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఆడియో, ట్రాన్స్‌క్రిప్షన్ సామర్థ్యాలను నోట్స్ యాప్‌కు కూడా విస్తరించాలని ఆపిల్ యోచిస్తోంది. మీరు ఆడియోను రికార్డ్ చేయవచ్చు. ఐఫోన్ 12 తదుపరి మోడళ్ల నుంచి ప్రారంభించి నోట్స్ యాప్‌లో నేరుగా లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్ పొందవచ్చు. ఈ అప్‌డేట్‌లు కాల్స్, నోట్స్ మరింత సమర్థవంతంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మొత్తంమీద, ఐఓఎస్ 18.1లోని కాల్ రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ అందిస్తుంది.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గత కొన్ని రోజులుగా భారీ పతనం తర్వాత బుల్ ర్యాలీలో చేరాయి. దీంతో షేర్ ధర మళ్లీ రూ.200 మార్కును దాటింది. నేడు ఇంట్రాడేలో స్టాక్ 3 శాతం లాభపడి రూ.205.70 స్థాయిలకు చేరింది. గడచిన నాలుగేళ్లలో స్టాక్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 2100 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.308 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.143.70గా ఉంది. స్టాక్ ధర జనవరి 4, 2008లో అత్యధికంగా రూ.2510.35 వద్ద ఉంది. అక్కడి నుంచి అనిల్ అంబానీ స్టాక్ 99 శాతం పడిపోయి మార్చి 27, 2020లో రూ.9.20కి పడిపోయింది.ఇక మూడేళ్లల కాలాన్ని పరిశీలిస్తే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 167% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. జూలై 30, 2021న అనిల్ అంబానీకి చెందిన కంపెనీ షేర్లు రూ.76.45 రేటు నుంచి జూలై 30, 2024న కంపెనీ షేర్లు రూ.205.70 పెరిగాయి. 2024లో కంపెనీ షేర్ల ధర జూన్ 5న కనిష్ఠమైన రూ.143.70కి దిగజారింది. అక్కడి నుంచి తిరిగి బుల్స్ జోరులో చేరిన రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్లు దాదాపు 40 శాతానికి పైగా ఎగబాకాయి. అలాగే 6 నెలల కాలంలో స్టాక్ దాదాపు 12 శాతం పడిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం 3.01 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర ఒక్కోటి రూ.202 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.7,984గా ఉంది.

ఆగస్టు 1న దేశీయ మార్కెట్‌లో పోకో M6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌, బడ్స్‌ X1 విడుదల కానున్నాయి. ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించిన టీజర్‌ను పోకో సంస్థ ఇటీవల విడుదల చేసింది. టిప్‌స్టర్‌ యోగేష్‌ తన X ప్లాట్‌ఫాం ద్వారా పోకో M6 ప్లస్‌, బడ్స్‌ X1 రిటైల్‌ బాక్స్‌ ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫోటోల ఆధారంగా పోకో ఫోన్‌ కెమెరా మాడ్యూల్‌ రెడ్‌మి 13 5G తరహాలోనే ఉంది. లీక్‌ అయిన ఫోటోలో పోకో M6 ప్లస్‌ ఫోన్‌ బ్లూ కలర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు బ్లాక్‌, పర్పుల్‌ రంగుల్లోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. పోకో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో 3X జూమ్‌ సామర్థ్యంతో 108MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. మరియు ఇతర కెమెరాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5030mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 AE చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. OS వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర, సేల్ వివరాలు ఆగస్టు 1న విడుదల సమయంలో తెలియనున్నాయి.పోకో బడ్స్‌ X1 విషయానికి వస్తే లీక్‌ అయిన వివరాల ఆధారంగా ఈ బడ్స్‌ తెలుపు రంగులో ఉన్నాయి. మరియు మాగ్నటిక్‌ ఛార్జింగ్‌ కేస్‌ లోపలి భాగం పసుపు రంగుల్లో ఉంది. దీంతోపాటు బ్యాటరీ ఛార్జింగ్‌ స్థితి తెలుసుకొనేందుకు LED లైట్‌ స్ట్రిప్‌ను కలిగి ఉంది. ఈ పోకో ఇయర్‌బడ్స్‌ను షియోమీ ఇయర్‌బడ్స్‌ యాప్‌ ద్వారా నియంత్రించవచ్చు.ఈ పోకో బడ్స్‌ X1 ఇయర్‌బడ్స్‌ ఇన్ ఇయర్‌ డిజైన్‌ సిలికాన్‌ టిప్స్‌, 12.4 డైనమిక్‌ టైటానియం డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. దీంతోపాటు 40dB వరకు హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో క్వాడ్ మైక్‌లను కలిగి ఉంటుంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌  పైన పనిచేస్తుంది.

హైద్రాబాద్ లోని హయత్‌నగర్‌ లెక్చరర్స్‌ కాలనీకి చెందిన యువతి, తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి సోమవారం సాయంత్రం సాగర్‌ రింగ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే ఉన్న బార్‌లో ఇద్దరూ మద్యం సేవించి హోటల్‌ రూమ్‌కి వెళ్లారు. అప్పటికే బాధితురాలు మత్తులో ఉంది. స్పృహ వచ్చేసరికి తన స్నేహితుడితోపాటు, మరో వ్యక్తి రూమ్‌లో ఉండటంతో కేకలు వేసింది. హోటల్‌ సిబ్బంది అక్కడికి వెళ్లే సరికి ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలికి రక్తస్రావం కావడంతో వారు ఇచ్చిన గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హోటల్‌ సిబ్బంది బాధితురాలని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు  విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 50 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటివరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు. ముండకైలో అర్ధరాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా కచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్‌మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. వయనాడ్ జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొండర్‌నాడ్ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక చిన్నారి ఈ ప్రమాదంలో మరణించింది. ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్‌ అనే మహిళను (50)ను గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ మహిళను ఆమె భర్తే అక్కడ బంధించి ఉంటాడనే అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం గోవా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తన మాజీ భర్తే తనను అడవిలోకి తీసుకువెళ్లి, ఇనుప గొలుసులతో చెట్టుకు బంధించాడని, 40 రోజులుగా ఆహారం తీసుకోలేదని కాగితంపై రాసి చూపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ రాసిన నోట్‌ ఆధారంగా ఆమె మాజీ భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ మహిళ బాగా నీరసంగా ఉండడంతో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పారు. పరిస్థితి మెరుగయ్యాక వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేస్తామన్నారు. ఆమె దగ్గర లభించిన మెడికల్‌ రిపోర్ట్స్‌ ప్రకారం ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఆమె భర్త, ఇతర బంధువుల సమాచారం తెలుసుకోవడానికి పోలీసు బృందాలు తమిళనాడుకు వెళ్లాయని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు సోమవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.

పాఠశాల విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించి వారిలో ఆహ్లాదం నింపడంతో పాటు, వారిలో ప్రాక్టికల్ పాఠాలు నేర్పేందుకు ఉద్దేశించిన నో స్కూల్ బ్యాగ్ డేస్‌ను అమలు చేసేందుకు కేంద్ర విద్యాశాఖ సమాయత్తమైంది. మొదట ఈ విధానాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అమలు చేయనున్నారు. ఈ జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రతి ఏటా పది రోజుల చొప్పున నో స్కూల్ బ్యాగ్ డేను అమలు చేయనున్నారు. జాతీయ విద్యావిధానం అమలులోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన సందర్భంగా ఎన్‌సిఆర్‌టి అనుబంధ విభాగం రూపొందించిన మార్గదర్శకాలను ఇటీవలే కేంద్రం నోటిఫై చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి విద్యార్థి నో స్కూల్ బ్యాగ్ డేస్‌ల్లో కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్, మెటల్ వర్క్, వంటి ఒక వృత్తి విద్య కోర్సును నేర్చుకుంటారు. వీటి వల్ల ఆయా రాష్ట్రాల్లో స్థానిక వృత్తులకు సంబంధించినవి నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక కమ్యూనిటీలు నిర్ణయించడం జరుగుతుది. అవసరాన్ని బట్టి ఇండోర్, అవుట్ డోర్ కార్యకలాపాలను కూడా నిర్ణయించవచ్చు. నో స్కూల్ బ్యాగ్ డేస్‌లను విద్యా సంవత్సరంలో ఎన్ని స్లాట్లుగా అయినా విభజన చేసుకోవచ్చు. రెండు మూడు స్లాట్లు విభజించుకుంటే సరిగా ఉంటుంది. అవకాశాన్ని బట్టి తేదీలను పాఠశాల యాజమాన్యం నిర్ణయించుకోవచ్చు. ఈ పది రోజులు మాత్రం విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. నో స్కూల్ బ్యాగ్ డే ఉన్న పదిరోజులు విద్యార్థులు కూరగాయల మార్కెట్ (రైతు బజార్లు) ను సందర్శించి సర్వే చేయడం, దాతృత్వ పర్యటనలు, పెంపుడు జంతువుల కేంద్రాలను సందర్శించడం, డూడ్లింగ్, పతంగుల తయారీ, ఎగురవేయడం, పుస్తక ప్రదర్శన వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, మర్రిచెట్టు కింద కూర్చోవడం, బయోగ్యాస్‌ ప్లాంట్‌ను సందర్శన, సోలార్‌ విద్యుత్తు పార్కును సందర్శించడం వంటి అవుట్ డోర్ కార్యక్రమాలను చేపట్టవచ్చు. జాతీయ విద్యా విధానానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మరికొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా చేపట్టింది. అందులో భాగంగానే 25 భారతీయ భాషల్లో టీవీ ఛానళ్లను కేంద్రం ప్రారంభించింది. ఇక, ఇందులో కెరీర్ గైడెన్స్, ఉపాధ్యాయులకు బ్రెయిలీ, ఆడియో బుక్స్ ద్వారా ప్రామాణిక శిక్షణ పద్ధతులు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ లాబీ లో కేటీఆర్ ను గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇకపై బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని కూడా తెలిపారు.

ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనం సెల్లార్ లోకి వరదలతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనలో అరెస్టయిన నిందితుల సంఖ్య 7కు చేరింది. కోచింగ్ సెంటర్ ఓనర్, కోఆర్డినేటర్ ను ఇదివరకే అరెస్టు చేశారు. వరద నీరు బిల్డింగ్ బేస్ మెంట్లోకి వెళ్లేలా నిర్లక్ష్యంగా కారును నడిపిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. అతని వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులను పోలీసులు సోమవారం ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు. వారిలో ఐదుగురిని (నలుగురు కోఓనర్లు, ఒక డ్రైవర్) కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు జూనియర్ ఇంజినీర్ ను ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) తొలగించింది. అసిస్టెంట్ ఇంజినీర్ ను సస్పెండ్ చేసింది. కాగా, వాన నీరు వెళ్లకుండా ఉన్న ఆక్రమణలపై ఎంసీడీ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించింది. ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని తెలిపింది. 13 అక్రమ కోచింగ్ సెంటర్లను సీల్ చేశామన్నారు. కాగా, వరద వల్ల చనిపోయిన డెల్విన్, శ్రేయ, సోని మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రావూస్ స్టడీ సర్కిల్ దుర్ఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖ సోమవారం ఒక కమిటీని నియమించింది. కమిటీలో హౌసింగ్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సీపీ, ఫైర్ అడ్వైజర్, జాయింట్ సెక్రటరీ ఉన్నారు. ప్రమాదానికి కారణాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ 30 రోజుల్లోపు నివేదిక ఇవ్వనుంది. కాగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సివిల్స్ అభ్యర్థులు కోచింగ్ సెంటర్ వద్ద ధర్నా కొనసాగించారు. కాగా, ఆప్ ఆఫీసు ముందు బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

3