ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసుకు సంబంధించి సంజయ్, పొన్నవోలు మీడియా సమావేశం పెట్టడంపై ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మీడియా సమావేశం పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిల్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలుకు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 9కి వాయిదా పడింది.
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
by Telugu Lo Computer at July 31, 2024
Labels:
Andhra Pradesh
,
పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు
,
మీడియా సమావేశం పెట్టడంపై
,
సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
,
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment