ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీ ?


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ లోని కోహినూర్ దాబా వద్ద ఆగిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం అర్ధరాత్రి నాలుగు కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైందని నగల వ్యాపారి గుమస్తా అయిన ఆశిష్ వన్ డబల్ జీరో కు ఫోన్ చేసి తెలిపినట్లు జహీరాబాద్ డీస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారి గుమస్తా బస్సు కిందికి దిగి దాబాలో టిఫిన్ చేసి వచ్చేలోపు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నగల బ్యాగుతో ఉడాయించారని పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు ధాబాలోని సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు పోగొట్టుకున్న గుమస్తా సహా ఆభరణాల వ్యాపారులు చిరాగ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, సిఐ శివలింగం ధాబాను సందర్శించి చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు దారు చెప్పిన విషయాలు అస్పష్టంగా ఉండటం తో, దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.వ్యాపారి వికాస్ బావ ఏ ఆశిష్..గుజరాత్ కు చెందిన వికాస్ ముంబైలో బంగారం వ్యాపారం చేస్తూ స్థిరపడిపోయారు. తన సొంతగా మేనత్త కుమారుడైన ఆశిష్ ను గుమాస్తాగా ఏర్పాటు చేసుకున్నారు. తరచు ప్రైవేటు బస్సులలో బంగారు నగలను తీసుకువచ్చి హైదరాబాద్ సంగారెడ్డి పటాన్చెరు జహీరాబాద్ లాంటి ప్రాంతాలలో నగల వ్యాపారులకు రెడీమేడ్ వస్తువులను సరఫరా చేస్తారు. ముంబై నుండి 24వ తేదీన ఆశిష్ నాలుగున్నర కిలోల బంగారు అభరణాలను తీసుకొని హైదరాబాద్లోని పలు వ్యాపారవేత్తలకు అందించారు. తదుపరి ఆనందం మిగిలిన బంగారు నగలతో శుక్రవారం ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాదులో ఎక్కారు. ఈ బస్సులో ఆశిష్ తో పాటు సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు వారందరి వద్ద కూడా లగేజ్ బ్యాగులు ఉన్నాయి. కానీ ఎవరి బ్యాగులు కూడా దొంగతనం చేయకుండా కేవలం ఆశిష్ వద్ద ఉన్న నగల బ్యాగు మాత్రమే దుండగులు తీసుకువెళ్లడం చూస్తుంటే పథకం ప్రకారం జరిగిన దొంగతనమేనని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయినా ఫుటేజ్ లో ఆధారంగా బస్సులో నుండి నగల బ్యాగును ఇద్దరు దుండగులు తీసుకు వెళుతున్నప్పుడు ఆశిష్ బస్సు డోర్ వద్దనే ఉన్నారు కానీ ఎలాంటి ఆందోళన చేయడం అరుపులు చేయకపోవడం అనుమానాలకు భావిస్తుంది. కేవలం ఇన్సూరెన్స్లను క్లైమ్ చేసుకునేందుకు పతకం ప్రకారం చేసిన నాటకం గానే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నట్లు తెలుస్తుంది. 2002 సంవత్సరంలో కూడా ఇదే మాదిరిగా జహీరాబాద్ లోని ఒక ధాబా వద్ద బస్సులో నుండి నగల వ్యాపారి నగలు దొంగతనమైనట్లు కేసు నమోదు చేసి తర్వాత కేసులు వీడ్రా చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే నగల వ్యాపార దొంగలను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలను ప్రారంభించారు. బంగారు నగలకు సంబంధించిన దొంగతనం విషయంలో త్వరలోను కేసులు చేదించి నిందితులను పట్టుకోవడం జరుగుతుందని జహీరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments