రూ.500 కరెన్సీ నోటుపై కొద్దిరోజులుగా చిత్ర విచిత్రమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో భారతీయ రిజర్వు బ్యాంకు వీటిపై స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. రూ.500 నోటుపై స్టార్ గుర్తు ఉన్నవన్నీ నకిలీ నోట్లంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. సీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ విషయాన్ని ఎక్స్ లో వెల్లడించింది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు 2016 డిసెంబరు నుంచి మార్కెట్ లో చలామణి అవుతున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా చలామణి చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు వివిధ నోట్లను అందుబాటులోకి తెస్తోంది. వీటిపై సీరియల్ నెంబరు ముద్రిస్తారు. అయితే కొన్ని నోట్లపై స్టార్ గుర్తు ఉండటంతో అలాంటివి చెల్లవంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు. గతంలో కూడా ఈ తరహాలోనే వార్తలు వస్తే రిజర్వు బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ మళ్లీ అదే తరహా వార్తలు చలామణి అవుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు ఇతర నోట్లులానే చెల్లుతాయని, సీరియన్ నెంబరుకు, ప్రిఫిక్స్ కు మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని చెప్పింది. అసలు స్టార్ గుర్తు అంటే అర్థం ఏమిటో వివరించింది. రీప్లేస్ చేసి తిరిగి ముద్రించిన నోట్లు అని అర్థం వస్తుంది. వీటిని సులువుగా గుర్తించడానికి స్టార్ గుర్తును వాడుతున్నారు.
రూ.500 నోటుపై సామాజిక మాధ్యమాల్లో వాస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవం : ఆర్బీఐ
by Telugu Lo Computer at July 27, 2024
Labels:
business
,
national
,
ఆర్బీఐ
,
ఎక్స్ లో వెల్లడి
,
రూ.500 నోటుపై సామాజిక మాధ్యమాల్లో వాస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవం
,
స్టార్ గుర్తు ఉన్న నోట్లు 2016 డిసెంబరు నుంచి మార్కెట్ లో చలామణి
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment