చైనా స్మార్ట్ ఫోన్ వినియోగంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని మెక్ గిల్ విశ్వవిద్యాలయం నివేదిక తెలియజేస్తుంది. ఈ జాబితాలో సౌదీ అరేబియా 2వ స్థానంలో ఉండగా, మలేషియా మూడో స్థానం, బ్రెజిల్, దక్షిణ కొరియాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాన్, కెనడా, టర్కీ, ఈజిప్ట్ నేపాల్ ఉన్నాయని మెక్ గిల్ నివేదిక పేర్కొంది. మన దేశం ఈ జాబితాలో 17వ స్థానంలో నిలిచింది. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం మరింత ఎక్కువైంది. ఎంతలా అంటే కొందరైతే రోజుకు 15 నుంచి 18 గంటలు కూడా స్మార్ట్ ఫోన్ లో ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ లో ఉన్న డిజిటల్ వెల్ బీయింగ్ ఆఫ్షన్ లో చూస్తే వారు రోజుకు ఎంత సమయం ఫోన్ వినియోగించారో తెలుస్తుంది. దీంతోపాటు వారు ఏయే యాప్ ను ఎంతసేపు వాడారో కూడా తెలుస్తుంది. ఇన్ స్టా, ఫేక్ బుక్, యూబ్యూబ్ లో రీల్స్ కు అలవాటు పడి వాటిని చూస్తూ గంటలు కరిగిపోతుంటే గుర్తించలేని స్థితిలో కొంతమంది యువత ఉంటే, మరికొందరు రీల్స్ ను చూసి వారు కూడా చేయడం అభిమానుల్ని సంపాదించే పనిలో ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ ను ఎంతవరకు వాడాలో అంతే వాడకుండా దుర్వినియోగం చేస్తే దుష్ప్రభావాలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇటీవల పోర్న్ కంటెంట్ చూడటానికి, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు పెడదోవ పట్టి చెడిపోతున్నారు.
0 Comments