Ad Code

త్వరలో మార్కెట్లోకి రానున్న శాంసంగ్‌ ఎంట్రీ లెవల్ ఫోన్‌ గెలాక్సీ ఏ06 ?


శాంసంగ్‌ ఎంట్రీ లెవల్ ఫోన్‌ను గెలాక్సీ ఏ06’ను  మార్కెట్లోకి తీసుకురానుంది. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన గెలాక్సీ ఏ05కి కొనసాగింపుగా వస్తోంది. ఎం సిరీస్‌లో భాగంగా తాజాగా ‘ఎం35’ 5జీని శాంసంగ్‌ తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ ఉండనుంది. 120 Hz రీఫ్రెష్‌ రేటు, 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం. వెనక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌ 15 వాట్స్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్లె ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇందులో 6జీబీ ర్యామ్ ఉండనుంది. 3 కలర్ ఆప్షన్‌లో గెలాక్సీ ఏ06 ఫోన్ వస్తుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.18 వేలు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే గెలాక్సీ ఏ06 లాంచ్ కానుంది. 

Post a Comment

0 Comments

Close Menu