ఈ సంవత్సరం అదనంగా 12 ఎయిర్‌పోర్టులను ప్రారంభించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఉడాన్ పథకంలో భాగంగా నిర్మితమవుతున్నాయి. ఇవి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమవుతాయని తెలిసింది. ఈ ఎయిర్‌పోర్టులు వస్తే ప్రాంతీయ కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 85 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటి ద్వారా 579 రూట్లకు కనెక్టివిటీ ఉంది. ఈ ఎయిర్‌పోర్టుల్లో 13 హెలిపాడ్స్, 2 వాటర్ ఎయిరోడ్రోమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ 2016 నుంచి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై సోమవారం రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహోల్. ఉడాన్ పథకాన్ని కొనసాగిస్తున్నామనీ, ఎప్పటికప్పుడు బిడ్డింగ్ ప్రక్రియ జరుపుతూ.. కొత్త ఎయిర్‌పోర్టులూ, రూట్లు వచ్చేలా చేస్తున్నట్లు తెలిపారు. చాలా ఎయిర్‌పోర్టులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చే 12 ఎయిర్‌పోర్టులు ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, మధ్యప్రదేశ్‌లోని రేవా, దాతియా, మహారాష్ట్రలోని అమరావతి, సోలాపూర్, డామన్ డయ్యూలోని డామన్, హర్యానాలోని అంబాలా, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, శహరాన్‌పూర్, తమిళనాడులోని వెల్లూర్, నైవేలీ, అండమాన్ నికోబార్ లోని శివపూర్, కార్ నికోబార్‌లో రానున్నాయి. ఇండియాలో ఎయిర్‌పోర్టులను తీర్చి దిద్దేందుకు తొలి దశలో రూ.4,500 కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.1,000 కోట్లు కేటాయించారు.
ఈ సంవత్సరం మరో 12 ఎయిర్‌పోర్టుల ప్రారంభం ?
by Telugu Lo Computer at July 30, 2024
Labels:
000 కోట్లు కేటాయించారు
,
500 కోట్లు కేటాయించగా
,
business
,
national
,
ఇండియాలో ఎయిర్‌పోర్టులను తీర్చి దిద్దేందుకు తొలి దశలో రూ.4
,
ఈ సంవత్సరం మరో 12 ఎయిర్‌పోర్టుల ప్రారంభం ?
,
రెండో దశలో రూ.1
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment