వనస్థలిపురంలో యువతిపై అత్యాచారం?
హైద్రాబాద్ లోని హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన యువతి, తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి సోమవారం సాయంత్రం సాగర్ రింగ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే ఉన్న బార్‌లో ఇద్దరూ మద్యం సేవించి హోటల్ రూమ్‌కి వెళ్లారు. అప్పటికే బాధితురాలు మత్తులో ఉంది. స్పృహ వచ్చేసరికి తన స్నేహితుడితోపాటు, మరో వ్యక్తి రూమ్‌లో ఉండటంతో కేకలు వేసింది. హోటల్ సిబ్బంది అక్కడికి వెళ్లే సరికి ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలికి రక్తస్రావం కావడంతో వారు ఇచ్చిన గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది బాధితురాలని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.