April 2026

దేశీయ మార్కెట్లో మోటో జీ 87 5జీ విడుదల చేసింది. మోటోరోలా తన ప్రసిద్ధ 'జీ' సిరీస్‌ను మరింత బలోపేతం చేస్తూ, సరసమైన ధరలోనే అత్యాధునిక సాంకేతికతను వినియోగదారులకు పరిచయం చేసింది. స్టైలిష్ డిజైన్, మెరుగైన కెమెరా సామర్థ్యాలు , వేగవంతమైన పనితీరు కలయికగా వచ్చిన ఈ ఫోన్, మిడ్-రేంజ్ విభాగంలో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది. ఇందులో 6.5-అంగుళాల Full-HD+ LCD డిస్‌ప్లేను అమర్చారు, ఇది దృశ్యాలను ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా 120Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు లేదా సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసేటప్పుడు వినియోగదారులకు ఎంతో స్మూత్ అనుభవం లభిస్తుంది. స్లిమ్ బాడీ , చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉండే ఈ ఫోన్, ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. దీనిలో MediaTek Dimensity 7025 చిప్‌సెట్‌ను వాడారు, ఇది వేగవంతమైన 5G కనెక్టివిటీని , మల్టీ-టాస్కింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. 8GB ర్యామ్ , 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్, భారీ యాప్‌లను కూడా ఎలాంటి ఆటంకం లేకుండా రన్ చేయగలదు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఇది లేటెస్ట్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తూ వినియోగదారులకు క్లీన్ , సురక్షితమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాను ఓఐఎస్ సపోర్ట్‌తో అందించింది, దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా షేక్ అవ్వకుండా నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు. దీనికి తోడుగా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ల్యాండ్‌స్కేప్ ఫోటోలకు ఎంతో ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 5000mAh భారీ బ్యాటరీని అమర్చారు, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిరంతరాయంగా పనిచేస్తుంది. 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఫోన్‌ను చాలా త్వరగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్‌ జట్టు తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో, టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిల్హెట్‌ వేదికగా ఇవాళ జరిగిన రెండో టీ20లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. హర్షిత సమరవిక్రమ (49), కెప్టెన్‌ చమారీ ఆటపట్టు (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఇమేషా దులాని 27, నిలాక్షి డిసిల్వ 22 (నాటౌట్‌), హాసిని పెరీరా 9 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫరిహా త్రిస్న, సుల్తానా ఖాతూన్‌, నహిద అక్తెర్‌, రితూ మోనీ తలో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమయ్యారు. షర్మిన్‌ అక్తెర్‌ (44 నాటౌట్‌) బంగ్లాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఓపెనర్లు దిలారా అక్తెర్‌ 23, జుయారియా ఫిర్దోస్‌ 29 పరుగులు చేసినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్‌ నిగార్‌ సల్తానా 7, షోర్నా అక్తెర్‌ 12, శోభన మోస్త్రి డకౌటయ్యారు. రితూ మోనీ 9 పరుగులతో అజేయంగా నిలిచింది. లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీయగా, మిథాలీ అయోధ్య మినహా మిగతా బౌలర్లంతా వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో టీ20 మే 2న సిల్హెట్‌ వేదికగా జరుగనుంది.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోన్న పార్కిన్సన్స్ వ్యాధి వల్ల చేతులు కంపించడం, కదలికలు మందగించడం, శరీర నియంత్రణ తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటివరకు ఇది ప్రధానంగా మెదడు సమస్యగా భావించబడింది. అయితే తాజా పరిశోధనలు చూస్తే, ఈ వ్యాధి ప్రారంభానికి పేగులో ఉన్న సూక్ష్మజీవాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సూచిస్తున్నాయి. మన పేగులో కోట్లాది సూక్ష్మజీవాలు ఉంటాయి. వీటిని మైక్రోబయోమ్ అంటారు. ఇవి జీర్ణక్రియతో పాటు శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. కొత్త అధ్యయనాల ప్రకారం, ఈ సూక్ష్మజీవాల సమతుల్యత మారిపోతే, అది నరాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు ఇది ఒక సంకేతంగా కనిపించవచ్చు. పరిశోధనలో ముఖ్యంగా GBA1 అనే జన్యు మార్పుపై దృష్టి పెట్టారు. ఈ జన్యు వేరియంట్ ఉన్నవారికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జన్యు మార్పు ఉన్న వ్యక్తుల పేగులో సూక్ష్మజీవాల నిర్మాణంలో గణనీయమైన మార్పులు కనిపించాయి. అంటే, ఈ మార్పులు ముందుగానే రోగం వచ్చే ప్రమాదాన్ని సూచించే అవకాశం ఉందని అర్థం. ఈ అధ్యయనాన్ని యూరప్‌లోని కొన్ని దేశాల్లో నిర్వహించారు. ఇందులో పార్కిన్సన్స్ ఉన్నవారు, GBA1 జన్యు వేరియంట్ ఉన్నవారు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నవారి డేటాను పోల్చారు. ఫలితాల్లో ఆశ్చర్యకరమైన తేడాలు బయటపడ్డాయి. రెండు గ్రూపుల మధ్య అనేక సూక్ష్మజీవాల రకాలు భిన్నంగా ఉన్నాయని గుర్తించారు. పేగులోని మైక్రోబయోమ్‌లో పెద్ద స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయని తేలింది. ఈ పరిశోధనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మార్పులు బయట లక్షణాలు కనిపించే ముందు నుంచే ప్రారంభమవుతాయని గుర్తించారు. అంటే, వ్యాధి మొదలయ్యే దశలోనే గుర్తించే అవకాశం ఉంది. ఇది వైద్య రంగానికి పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. ఇలా ముందుగానే గుర్తిస్తే, సరైన చికిత్సలు మరియు జీవనశైలి మార్పులతో వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చు. భవిష్యత్తులో పేగు ఆరోగ్యాన్ని పరిశీలించడం ద్వారా పార్కిన్సన్స్‌ను ముందే గుర్తించే అవకాశాలు పెరుగుతాయి.

మే 5 నుంచి 7 వరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం వియత్నాం అధ్యక్షుడు టో లామ్ భారత్‌కు రానున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌ రక్షణ, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాలలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా చర్చించుకునే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా మే 6న రాష్ట్రపతి భవన్‌ను టోలామ్‌ సందర్శించనున్నారని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే బీహార్‌లోని బోధ్‌ గయ, ముంబయిని సందర్శించనున్నారని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాను తక్షణమే 15 శాతం పెంచాలని ఆయిల్‌ సంస్థలను తెలంగాణ సివిల్‌ సప్లయ్‌ ఆదేశించింది. బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు పెట్టకూడదని, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. డీజిల్ సరఫరా 190 శాతం పెరిగిందని, 21,295 కిలో లీటర్లు పంపిణి చేసినట్లు తెలిపారు. పెట్రోల్ సరఫరా 118 పెంచామని ఆయన తెలిపారు. మొత్తం ఫ్యూయల్ సరఫరా 158 శాతం పెరిగిందని, బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దాడులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్ర వాహనాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ 'అనోమలీ'ని, దాని ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ ప్రాపర్టీలతో సహా రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కంపెనీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించనుంది. అంతేకాకుండా, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్థ తన వృద్ధిని సాధించే బ్రాండ్‌లను నిర్మించి, విస్తరించాలనే దాని నిబద్ధతను కూడా ఇది బలపరుస్తుంది. అనోమలి బ్రాండ్‌ను 2021లో ప్రముఖ నటి, వ్యాపారవేత్త ప్రియాంక చోప్రా ప్రారంభించారు. ఇది అందుబాటు ధరలో లభించే ఒక పాపులర్ హెయిర్‌కేర్ బ్రాండ్. ప్రారంభం నుంచే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ బ్రాండ్ కొద్ది కాలంలోనే బలమైన అంతర్జాతీయ ఉనికిని ఏర్పరచుకుంది. ఈ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్ తమ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలో ఉన్న పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో పెద్ద రిటైల్ నెట్‌వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా టీరా వంటి ఓమ్నీచానల్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు విభిన్న బ్రాండ్లను అందిస్తోంది. ఇప్పుడు అనామలీ కూడా ఈ వ్యవస్థలో చేరడంతో, బ్రాండ్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది. రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ కొనుగోలు గురించి మాట్లాడుతూ అనోమలి తమ బ్యూటీ పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన భాగమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టి జుట్టు, చర్మ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రియాంక చోప్రా బ్రాండ్‌ క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని ఆమె వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురిసినప్పటికీ, పగటి గరిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రం రాబోయే వారం రోజుల్లో పెద్దగా మార్పు ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి వ్యవస్థను ప్రభుత్వం విస్తరించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలకు ప్రజావాణి విస్తరణకు ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో, ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సర్కార్‌.. అన్ని ఫిర్యాదులు ప్రజావాణి పోర్టల్‌లో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది.​ ఫిర్యాదుదారులకు యూనిక్ రిఫరెన్స్ నంబర్‌తో రసీదు ఇవ్వనున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గరిష్టంగా 30 రోజులు గడువును ప్రభుత్వం నిర్ణయించింది. గడువు లోపల పరిష్కారం కాకపోతే పైస్థాయికి ఎస్కలేషన్ ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్థితి ట్రాకింగ్ సౌకర్యం, యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజలతో పారదర్శకత, బాధ్యత పెంచే చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.. ప్రతి విభాగంలో ప్రత్యేక ప్రజావాణి విభాగాల ఏర్పాటు చేయనుంది. అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, ప్రజల అభ్యర్థనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చారు. ఈ సర్వేలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. ఒక వీడియో సందేశం ద్వారా మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను ప్రసారం చేయడానికి బీజేపీ కొంతమంది మీడియా ప్రతినిధులకు భారీగా డబ్బులు చెల్లించిందని సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, టీఎంసీ ఒంటరిగానే 226 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మోహరించిన కేంద్ర బలగాలపై కూడా ఆమె మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్ష ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు "బీజేపీ ఏజెంట్లుగా" పనిచేశాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ, ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు కష్టపడిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఫలితాల రోజున అసలు నిజం బయటపడుతుందని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో 15 ఏళ్ల విద్యార్థిని హంస శ్రీ బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

అరటి పువ్వు ఆరోగ్యపరంగా ఒక అద్భుత నిధి. దీనిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు ఏ,సీ,ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు కూడా ఇందులో మెండుగా లభిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది ఒక వరమని చెప్పుకోవచ్చు. అరటి పువ్వు PCOD, మెనోర్రాగియా (అధిక రక్తస్రావం), పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది సహజంగా హార్మోన్లను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించి, హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా శరీరానికి తగినంత శక్తిని అందించి అలసటను తగ్గిస్తుంది. అరటి పువ్వులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఫ్లావనాయిడ్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతూ గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అరటి పువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్‌ల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇందులోని మెగ్నీషియం మరియు విటమిన్ బీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచడానికి తోడ్పడుతుంది. 

కాంగ్రెస్‌ పార్టీ  సీనియర్‌ నాయకుడు పవన్‌ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు తెలిపింది. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ  భార్య రిణికి భూయాన్ శర్మకు పలు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశీ ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. దాంతో రిణికి భూయాన్‌.. పవన్‌ ఖేరాపై పరువు నష్టం కేసు వేసింది. దాంతో పవన్ ఖేరా ముందస్తు బెయిల్ కోసం గువాహటి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హైకోర్టు ఖేరా పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఖేరా పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ కోసం పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. నిర్బంధ విచారణతో అవమానించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇది పరువు నష్టానికి సంబంధించిన అంశమని గుర్తుచేశారు. ఈ కేసులో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాను చట్టాలకు అతీతం అన్న రీతిలో స్పందించారని, ఆయన రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వల్లే పవన్ ఖేరా అరెస్టుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వవన్ ఖేరాపై నమోదైన కేసుకు సంబంధించి పలు సెక్షన్ల కింద బెయిల్ పొందే అవకాశం ఉందని, మరికొన్ని సెక్షన్ల కింద అసలు అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని సింఘ్వి వాదించారు. అస్సాం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి భార్య పాస్ పోర్టులకు సంబంధించిన నకిలీ కాపీలను పవన్ ఖేరా చూపించారని ఆరోపించారు. ఆయన చూపించిన కాపీలన్నీ అవాస్తవమే అన్నారు. పరారీలో ఉండి వీడియోలు విడుదల చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

తమ వద్ద కొత్త ఆయుధం ఉన్నదని, దాన్ని ప్రయోగిస్తే అమెరికాకు హార్ట్ అటాక్ ఖాయమని ఇరాన్ తాజాగా పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆ ఆయుధం ఏంటన్న కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలు పహారా కాస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఓ అండర్‌వాటర్ సూపర్ వెపన్‌ను రంగప్రవేశం చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. శత్రు దేశాల యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లకు దడపుట్టించే రీతిలో ఓ ఆయుధాన్ని తయారు చేసినట్లు ఇరాన్ పేర్కొన్నది. అయితే డిఫెన్స్ నిపుణుల ప్రకారం హూట్ సూపర్ టార్పిడో గురించి బహుశా ఇరాన్ మాట్లాడుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ ఆ టార్పిడో గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైన కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటామని, బహుశా వాళ్లకు హార్ట్‌ అటాక్ రాదని అనుకుంటున్నానన్నారు. హూట్ రాకెట్ టార్పిడో గురించి బహుశా ఇరాన్ చెప్పి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2006లోనే ఈ టార్పిడోను ఇరాన్ పరీక్షించింది. ఆ టార్పిడోను ప్రయోగిస్తే, శుత్రవులు దాన్ని ఆపలేరు. అంత వేగంగా బుల్లెట్‌లా అది ప్రయాణిస్తుంది. పర్షియన్ భాషలో హూట్ అంటే తిమింగళం. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అతి వేగవంతమైన అండర్‌వాటర్ వెపన్ అది. రష్యా తర్వాత ఆ వెపన్ కలిగి ఉన్న రెండో దేశం ఇరాన్ కావడం గమనార్హం. రష్యాకు చెందిన వీఏ-111 ష్కివల్ వర్షన్‌ను 1990లోనే ప్రవేశపెట్టారు. సూపర్ టార్పిడోలు .. అండర్‌వాటర్ గైడెడ్ మిస్సైల్స్ లాంటివి. సుమారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. కానీ హూట్ దాదాపు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఇరాన్ చెబుతోంది. హూట్ టార్పిడో ద్వారా సుమారు 200 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్న పేలుడు పదార్ధాలను వార్‌హెడ్ మోసుకెళ్లగలదు. అయితే స్పీడ్‌గా వెళ్లే ఆ టార్పిడో.. అంత భారీ మొత్తంలోని పేలుడు పదార్ధాన్ని.. అత్యంత వేగంగా పేల్చుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి హూట్ టార్పిడోలను రియల్‌టైంలో పరీక్షించలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే సూపర్ టార్పిడోలను కచ్చితమైన మార్గంలో షూట్ చేయడం కష్టమే అని అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ లాంటి యుద్ధనౌకలకు భారీ బెల్టులు ఉంటాయని, అవి భారీ టార్పిడోల నుంచి తట్టుకునే రీతిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ హూట్ టార్పిడోను ఇరాన్ వాడాలనుకుంటే, అప్పుడు టార్గెట్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే పేల్చాల్సి ఉంటుంది. అంటే అమెరికా యుద్ధ నౌకలను పేల్చాలంటే, అప్పుడు ఇరానీ సబ్‌మెరైన్లు కానీ, వెసల్స్ కానీ, స్పీడ్‌బోట్లు కానీ దగ్గరగా రావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద మాత్రమే అమెరికా నౌకలను హూట్ టార్పిడోతో ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అమెరికా నౌకలు మాత్రం హోర్మజ్‌కు దూరంగా నిలిచి ఉన్నాయి. ఒకవేళ హూట్ టార్పిడోతో అటాక్ చేసినా.. లక్షల్లో ఒకటి మాత్రమే తగులుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

2025-26 చివరి త్రైమాసికంలో అదానీ పవర్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 4,271 కోట్లను అధిగమించింది. ఆదాయంలో వృద్ధి, తగ్గిన పన్ను వ్యయాలు ఇందుకు దోహదపడ్డాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేవలం రూ. 2,599 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,535 కోట్ల నుంచి రూ. 15,989 కోట్లకు ఎగబతికింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 12,971 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024-25లో రూ. 12,750 కోట్ల లాభం అందుకుంది. 2026 మార్చి31కల్లా మహన్‌(1,600 మెగావాట్లు), రాయ్‌పూర్‌(1,600 మెగావాట్లు), రాయ్‌గఢ్‌(1,600 మెగావాట్లు) రెండో దశల పనులు 86-47 శాతం మధ్య పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది. సొంత అనుబంధ కంపెనీ కోబ్రా పవర్‌ 1320 మెగావాట్ల రెండో దశ ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో పూర్తికాగలదని పేర్కొంది. 2031-32కల్లా 23.7 గిగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది క్యూ4లో మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డు నుంచి 25ఏళ్లపాటు 1,600 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు ఎల్‌వోఏను అందుకుంది.

దేశీయ మార్కెట్‌లో  ప్రీమియం ఆండ్రాయిడ్ టాబ్లెట్ సెగ్మెంట్ లో వన్‌ప్లస్ ప్యాడ్ 4ను ఆవిష్కరించింది. ఈ డివైస్, శక్తివంతమైన పెర్ఫార్మన్స్ , లాంగ్ టైం బ్యాటరీ కెపాసిటీ, స్మార్ట్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులోని Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ మల్టీటాస్కింగ్‌ను వేగవంతం చేస్తూ వినియోగదారులకు ల్యాప్‌టాప్ స్థాయి అనుభవాన్ని అందిస్తుంది.భారీ బ్యాటరీ లాంగ్ టైం వినియోగానికి అందిస్తూ వర్క్ , ఎంటర్టైన్మెంట్ రెండింటికీ సరిపడేలా రూపొందించారు . AI ఆధారిత టూల్స్, మల్టీ-విండో సపోర్ట్, క్రాస్-డివైస్ వంటి ఫీచర్లు , హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, ఇమర్సివ్ ఆడియో సిస్టమ్‌తో ఈ టాబ్లెట్ విద్యార్థులు, ప్రొఫెషనల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ గా ఉంటుంది . వన్‌ప్లస్ ప్యాడ్ 4 భారతీయ టాబ్లెట్ సెగ్మెంట్ లో బెస్ట్ గా నిలుస్తోంది. 13.2 ఇంచ్ 3.4K ట్రూ కలర్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 540Hz టచ్ సాంప్లింగ్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్, 12-bit కలర్ డెప్త్ వంటి ఫీచర్లతో అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ CPU , GPU పెర్ఫార్మన్స్ ను గణనీయంగా పెంచుతూ మల్టీటాస్కింగ్ , గేమింగ్‌ను మరింత స్పీడ్ గా అందిస్తుంది . 13,380mAh భారీ బ్యాటరీ 54 రోజులు స్టాండ్ బై  టైమ్, 20 గంటలు వీడియో ప్లేబ్యాక్, 7 గంటలు గేమింగ్‌ను అందిస్తుంది. హీట్ కంట్రోల్ కోసం వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది . OxygenOS 16 ఆధారిత AI టూల్స్ అయిన AI Recorder, AI Painter, AI Writer, AI Translation, AI Speak లాంటివి వినియోగదారుల సౌలబ్యాన్ని అందిస్తాయి . Google Gemini AI అసిస్టెంట్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ గా ఉంటుంది. PC-లెవల్ మల్టీటాస్కింగ్, మల్టీ-విండో సపోర్ట్, ఫైల్ మేనేజ్‌మెంట్,16,000 ప్రెషర్ లెవల్స్, అల్ట్రా-లో లేటెన్సీ OnePlus Stylo Pro , 78-కీ లేఅవుట్, AI కీ, NFC ఫైల్ ట్రాన్స్‌ఫర్ OnePlus Smart Keyboard ఉన్నాయి. సేఫ్టీ కోసం క్రయో-వేలాసిటీ కూలింగ్ సిస్టం, AI క్లియర్ కాల్, సెక్యూర్ కనెక్టివిటీ టెక్నాలజీలు అందించబడ్డాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi 5G సపోర్ట్, వేగవంతమైన డౌన్‌లోడ్స్ , అప్లోడ్స్, క్రాస్-డివైస్ సింక్ iOS, Mac, Android, Windows అందుబాటులో ఉన్నాయి. స్టోరేజ్ వేరియంట్స్‌లో 12GB + 512GB , 8GB + 256GB ఉన్నాయి. 8GB + 256GB వేరియంట్ రూ. 59,999,   12GB + 512GB వేరియంట్ రూ. 64,999/- ధరలో లభిస్తున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి ₹5,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ టాబ్లెట్ సేల్స్ మే 5, 2026 నుండి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లలో ప్రారంభం కానున్నాయి . లిమిటెడ్ టైం ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు ₹5,499 విలువైన OnePlus Stylo Proను కొనుగోలుతో ఉచితంగా పొందే అవకాశం ఉంది.

చట్టసభలు చేసిన చట్టాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందని, కానీ సొంతంగా చట్టాలు చేయడం లేదా చట్టాలు చేయాలని శాసన వ్యవస్థను ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. విద్వేష ప్రసంగాల నియంత్రణకు ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నేర నియంత్రణ చట్టాలు సరిపోతాయని కోర్టు అభిప్రాయపడింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని నియంత్రించేందుకు మరిన్ని కొత్త మార్గదర్శకాలు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది.  విద్వేష ప్రసంగాలపై పోలీసులు చర్యలు తీసుకునే విషయంలో నెలకొన్న కొన్ని సందేహాలను సుప్రీంకోర్టు నివృత్తి చేసింది. విద్వేష ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసులు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 156(3) (ప్రస్తుత బీఎన్‌ఎ్‌సఎ్‌స సెక్షన్‌ 175 (3)) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులకు పూర్తి అధికారం ఉందని వివరించింది. విద్వేష ప్రసంగాల విషయంలో పోలీసులు ఫిర్యాదులను స్వీకరించకపోతే బాధితులకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను కూడా న్యాయస్థానం గుర్తుచేసింది. స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుంటే, బాధితులు పైస్థాయి అధికారులను ఆశ్రయించే అవకాశం చట్టంలో ఉంది. ఫిర్యాదులపై పోలీసులు స్పందించని పక్షంలో అనుసరించాల్సిన విధానాలను సీఆర్‌పీసీ , కొత్తగా వచ్చిన బీఎన్‌ఎ్‌సఎ్‌స చట్టాల్లో స్పష్టంగా పొందుపరిచారని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాల నియంత్రణ అనేది ఇప్పటికే ఉన్న చట్టబద్ధమైన నిబంధనల అమలుపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసు యంత్రాంగం తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే కొత్త మార్గదర్శకాలతో పనిలేదని, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడమే ప్రధానమని న్యాయస్థానం తన తీర్పులో నొక్కి చెప్పింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని నియంత్రించేందుకు మరిన్ని కొత్త మార్గదర్శకాలు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తన పరిధులను స్పష్టం చేసింది. చట్టసభలు చేసిన చట్టాలను సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుందని, కానీ సొంతంగా చట్టాలు చేయడం లేదా చట్టాలు చేయాలని శాసన వ్యవస్థను ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ధర్మాసనం గుర్తుచేసింది. విద్వేష ప్రసంగాల నియంత్రణకు ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నేర నియంత్రణ చట్టాలు సరిపోతాయని కోర్టు అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్టు చేయవద్దంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జూన్ 24వ తేదీ వరకు పొడిగించింది. తమపై నమోదైన కేసులను సవాలు చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై వచ్చే నెల 6వ తేదీలోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కోర్టు తాజా ఆదేశాలతో నిందితులకు అరెస్టు భయం నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది.

వాట్సాప్ సందేశాలు, ఫోటోలు, వీడియోలను భద్రపరుచుకోవడానికి గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి సేవలను వాడుతుంటాము. అయితే, గూగుల్ ఉచితంగా ఇచ్చే 15 జీబీ పరిమితి త్వరగానే నిండిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వుంటారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మెటా సంస్థ ఇప్పుడు సొంతంగా ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, వాట్సాప్ తన వినియోగదారులకు ప్రాథమికంగా 2 జీబీ వరకు ఉచిత స్టోరేజ్‌ను అందించే అవకాశం ఉంది. ఒకవేళ డేటా అంతకంటే ఎక్కువగా ఉంటే, తక్కువ ధరకే అదనపు స్టోరేజ్‌ను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించనున్నారు. నెలకు సుమారు 80 నుంచి 94 రూపాయల లోపు ధరలోనే దాదాపు 50 జీబీ వరకు డేటాను దాచుకునే ప్లాన్లను కంపెనీ పరిశీలిస్తోంది. దీనివల్ల గూగుల్ డ్రైవ్ నిండిపోయినా చాట్ బ్యాకప్ ఆగిపోదు. కేవలం స్టోరేజ్ మాత్రమే కాకుండా, భద్రత విషయంలోనూ వాట్సాప్ రాజీ పడటం లేదు. కొత్త క్లౌడ్ వ్యవస్థలో వినియోగదారులు తమ బ్యాకప్‌ను 'పాస్ కీ' ఫీచర్ ద్వారా భద్రపరుచుకోవచ్చు. అంటే ఇకపై పెద్ద పెద్ద పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ లేదా స్క్రీన్ లాక్ సహాయంతోనే సులభంగా డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు. ఇది హ్యాకర్ల నుంచి మీ వ్యక్తిగత సమాచారానికి పటిష్టమైన రక్షణ కల్పిస్తుంది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, పాత పద్ధతిని పూర్తిగా తొలగించడం లేదు. వినియోగదారులు తమకు నచ్చితే గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌ను కొనసాగించవచ్చు లేదా వాట్సాప్ అందిస్తున్న కొత్త క్లౌడ్ స్టోరేజ్‌కు మారిపోవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. 

భారతీయ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఆల్-టైమ్ లో రికార్డు దిగువ స్థాయిని తాకింది. రూపాయి డాలర్‌కు 95.23 వద్ద ఆల్-టైమ్ లో (ఇంట్రాడే) పడిపోయింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితి భారతదేశ ఆయిల్ దిగుమతి బిల్లును పెంచి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌ను మరింత దిగజార్చవచ్చు. ఆర్థిక నిపుణులు రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు, అయితే ఆర్బీఐ సపోర్ట్‌తో కొంత స్థిరీకరణ ఆశించవచ్చు. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు, బ్రెంట్ క్రూడ్ ధరను బ్యారెల్‌కు $115 పైనకు తీసుకెళ్లాయి. భారతదేశం తన అవసరాలలో ఎక్కువ భాగం ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉండటం వల్ల డాలర్ డిమాండ్ పెరిగి, రూపాయి విలువ తగ్గింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠినమైన (హాకిష్) వైఖరి వల్ల డాలర్ బలపడింది. వడ్డీ రేట్లు ఎక్కువసేపు ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలు డాలర్‌ను బలోపేతం చేశాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, జియోపాలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ ఫ్రిక్షన్స్ వంటివి కూడా రూపాయి మీద ఒత్తిడి పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి సుమారు 9-10% వరకు డిప్రిసియేట్ అయ్యింది, ఇది గత 10-14 సంవత్సరాలలో అత్యధికం. ఆయిల్, ఇతర వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. రూపాయి బలహీనత విదేశీ పెట్టుబడిదారులను ప్రభావితం చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కొన్ని ఫారెక్స్ చర్యలు తీసుకుంది, కానీ ఒత్తిడి కొనసాగుతోంది.

చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్స్‌లో గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన మురుగన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా నవజాత శిశువులు, చిన్న పిల్లలను అపహరించి అక్రమంగా విక్రయించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్‌లో గత ఏడాది వరకు ఇటుకల బట్టిలో పని చేసిన మురుగన్, కేవలం ఒక్క ఏడాదిలోనే చైల్డ్ ట్రాఫికింగ్‌లో కింగ్‌పిన్‌గా ఎదిగాడు. గత ఏడాది చైతన్యపురి కేసులో మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది. మూడు నెలల పాటు జైల్లో ఉన్న అతడు జూలైలో విడుదలయ్యాడు. ఆపై దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అతడి భార్య కృష్ణవేణి మరో గ్యాంగ్‌ను నడుపుతున్నట్టు గుజరాత్ పోలీసులు గుర్తించారు. ఈ మురుగన్ గ్యాంగ్ ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారులను విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం మురుగన్ గ్యాంగ్ సభ్యులు గుజరాత్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారి విచారణలో హైదరాబాద్‌కు సంబంధాలు బయటపడ్డాయి. మురుగన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్న గుజరాత్ పోలీసులు ఫెర్టిలిటీ సెంటర్లపై విచారణ చేపట్టారు.

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా పంజాబ్‌-హర్యానా హైకోర్టు మాజీ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్‌ నియమితులయ్యారు. అయిదేళ్ల కాలపరిమితి కోసం ఆయన్ను నియమించారు. లేదా 67 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీఎల్టీ ప్రెసిడెంట్‌గా జస్టిస్ రామలింగం సుధాకర్ పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. 2021, నవంబర్ ఒకటో తేదీ నుంచి రామలింగం ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఎన్సీఎల్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జస్టిస్ గ్రేవాల్ 1964, మార్చి 10వ తేదీన జన్మించారు. పంజాబ్‌లోని లుథియానా జిల్లాకు చెందిన వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. 1992లో ఆయన పంజాబ్‌-హర్యానా హైకోర్టులో లీగల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పంజాబ్ ప్రభుత్వ లా ఆఫీసుల్లో ఆయన అనేక హోదాల్లో పనిచేశారు. 1995 నుంచి 97 వరకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్‌గా, 97 నుంచి 2002 వరకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా, 2002 నుంచి 2005 వరకు సీనియర్ డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా చేశారు. అనేక కేంద్ర ప్రభుత్వ కేసుల్లో ఆయన వాదించారు. 2014 సెప్టెంబర్ 25వ తేదీన పంజాబ్‌-హర్యానా హైకోర్టు అదనపు జడ్జీగా ఆయనకు పదోన్నతి దక్కింది. ఆ తర్వాత ఆయన రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లారు. 2016 మే నెలలో ఆయన పర్మనెంట్ జడ్జీ అయ్యారు. 2026, మార్చి 10వ తేదీన జడ్జీగా ఆయన రిటైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్  అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు. ఈసారి రాష్ట్రంలో మొత్తం ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. గత ఏడాది 81.14 శాతంగా ఉన్న పాస్ శాతం, ఈసారి 85.25 శాతానికి చేరింది. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఇది మంచి సూచికగా భావిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు మరోసారి ప్రతిభ చాటుతూ బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 కాగా, బాలురది 82.68 శాతంగా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో కూడా పురోగతి కనిపించింది. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న పాస్ రేట్, ఈసారి 78.39 శాతానికి పెరగడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఫలితాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి తక్షణమే మార్కులు చూసే సౌకర్యం కల్పించారు. అదనంగా డిజిటల్ సేవలను విస్తరించే భాగంగా "మనమిత్ర" వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపితే వివరాలు పొందవచ్చు. అలాగే LEAP మొబైల్ యాప్, DigiLocker ద్వారా కూడా మార్కులు తెలుసుకునే అవకాశం ఉంది. ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థుల కోసం SMS విధానాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఫోన్‌లో SSC హాల్ టికెట్ నంబర్ టైప్ చేసి 55352 లేదా 56300 నంబర్లకు పంపితే మార్కుల వివరాలు అందుతాయి.

మ్యాక్ ఓఎస్ వినియోగదారులు మే 8 లోపు చాట్ జీపీటీ డెస్క్‌టాప్, కోడెక్స్, అట్లాస్ వంటి అన్ని అప్లికేషన్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత పాత వెర్షన్లు పనిచేయవని కంపెనీ వెల్లడించింది. ఈ ఆకస్మిక నిర్ణయానికి ప్రధాన కారణం ఒక భద్రతా లోపం. యాక్సియోస్ జావాస్క్రిప్ట్ లైబ్రరీలో హ్యాకర్లు చొరబడినట్లు గుర్తించారు. ఒక హ్యాకర్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఈ లైబ్రరీలోకి ప్రవేశించి, అందులోని కొన్ని వెర్షన్లలో ప్రమాదకరమైన 'ట్రోజన్' వైరస్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల కంప్యూటర్లను రిమోట్ ద్వారా నియంత్రించే ప్రమాదం ఉంటుంది. అయితే, వినియోగదారుల డేటా లేదా సంస్థ రహస్య కోడ్ ఏదీ దొంగిలించబడలేదని ఓపెన్ ఏఐ భరోసా ఇచ్చింది. అయినప్పటికీ, భవిష్యత్తులో ఎటువంటి ముప్పు రాకుండా ఉండటానికే ఈ చర్యలు చేపట్టింది. మ్యాక్ డివైజ్ ల్లోని ప్రతి యాప్ విశ్వసనీయతను తనిఖీ చేయడానికి ఒక కోడ్ సైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఆ యాప్ అసలైన డెవలపర్ నుంచి వచ్చిందని నిర్ధారిస్తుంది. ప్రస్తుత భద్రతా కారణాల వల్ల ఓపెన్ ఏఐ తన సర్టిఫికేట్‌ను మార్చాలని నిర్ణయించుకుంది. పాత సర్టిఫికేట్ కలిగిన యాప్‌లను క్రమంగా నిరోధించడం వల్ల, వినియోగదారులు కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం అనివార్యమైంది. ఈ మార్పు కేవలం మ్యాక్ కంప్యూటర్లను ఉపయోగించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ లేదా విండోస్ పరికరాల్లో చాట్‌జీపీటీ వాడుతుంటే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం మ్యాక్ డెస్క్‌టాప్ యాప్‌లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. వినియోగదారులు వెంటనే ఓపెన్ ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని కోసం పాస్‌వర్డ్‌లు మార్చాల్సిన లేదా ఏపీఐ కీలను రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అప్లికేషన్ అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. 2026 మే 8 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఎటువంటి అంతరాయం లేకుండా సేవలను పొందవచ్చు.

అమెరికాలోని న్యూయార్క్‌ మాన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలో అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల చెర నుంచి విముక్తి పొందిన సుమారు రూ. 117 కోట్లు విలువైన 657 అపురూప కళాఖండాలను భారత కాన్సులేట్ ప్రతినిధి రాజలక్ష్మి కదమ్‌కు అధికారికంగా అప్పగించారు. వీటిలో కొన్ని అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన శిల్పాలు ఉన్నాయి. అవలోకితేశ్వరుని కంచు విగ్రహం విలువ సుమారు 2 మిలియన్ డాలర్లు. 1982లో రాయ్‌పూర్‌లోని మ్యూజియం నుండి దొంగిలించిన ఈ విగ్రహాన్ని, 2025లో న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ సేకరణ నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెడ్ ఐరన్‌స్టోన్ బుద్ధ విగ్రహం విలువ సుమారు 7.5 మిలియన్ డాలర్లు. ఇది కపూర్ నెట్‌వర్క్ ద్వారా అక్రమంగా అమెరికాకు చేరింది. నాట్య గణేశుడి విగ్రహం 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయం నుండి దొంగిలించిన ఈ శిల్పాన్ని, నకిలీ పత్రాలతో 2012లో వేలం వేశారు. అంతర్జాతీయ స్మగ్లర్ సుభాష్ కపూర్, దోషిగా తేలిన నాన్సీ వీనర్లకు సంబంధించిన నెట్‌వర్క్‌లపై జరిపిన సుదీర్ఘ దర్యాప్తులో ఈ వస్తువులు వెలుగుచూశాయి. 2012 నుండి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్, పురావస్తు అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్తంగా ఈ ముఠాలను వెంబడిస్తున్నాయి. “భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల పరిధి చాలా పెద్దది. దొంగిలించిన మన సంపదను తిరిగి తీసుకురావడానికి ఇంకా నిరంతర కృషి అవసరం,” అని జిల్లా అటార్నీ ఆల్విన్ ఎల్ బ్రాగ్ జూనియర్ పేర్కొన్నారు. మాన్హాటన్ ATU విభాగం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలకు చెందిన 5,900కు పైగా వస్తువులను తిరిగి అప్పగించింది. వీటి మొత్తం విలువ 485 మిలియన్ డాలర్ల పైమాటే. భారతదేశంలో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న సుభాష్ కపూర్‌ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ భారీ ఆపరేషన్ భారత్ – అమెరికా దేశాల మధ్య సమన్వయం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. మన ప్రాచీన కళా సంపదను కాపాడుకోవడంలో అంతర్జాతీయ సహకారం ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఉబైద్ ముస్తాఖ్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే వర్సిటీలో పనిచేస్తున్న తోటి మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. బాధితురాలికి సంబంధించిన ఫోటోలను, వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ అతను పైశాచిక ఆనందం పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులపై బాధితురాలు తొలుత విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని ఆశ్రయించినప్పటికీ, వారు దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆవేదనకు గురైన సదరు మహిళా ప్రొఫెసర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. తన గౌరవానికి భంగం కలిగిస్తూ, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న ఉబైద్ ముస్తాఖ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు నిందితుడైన ఉబైద్ ముస్తాఖ్‌పై కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్‌తో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం చేశారు. ఉన్నత చదువులు చదివి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం పట్ల తోటి అధ్యాపకులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులో భారీ వర్షాల కారణంగా ఒక పాత గోడ కూలి  ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో టూరిస్టులు మరియు స్థానికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. భారీ వర్షాల వల్ల నగరంలో పలు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పాత నిర్మాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కృత్రిమ మేధ ప్రపంచ ఐటీ సేవల పరిశ్రమను పునర్నిర్మిస్తూ, పలు కంపెనీలలో ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణకు కారణమవుతున్నప్పటికీ తాము మాత్రం ఆ మార్గాన్ని అనుసరించబోమని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టంచేశారు. మనీకంట్రోల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పరేఖ్ .. సాఫ్ట్‌వేర్‌ను నిర్మించే, అందించే విధానంలో ఆటోమేషన్, ఏఐ సాధనాలు మరింత కీలకంగా మారుతున్నప్పటికీ, తమ కంపెనీ గతేడాది ఎలాంటి ఉద్యోగాల కోతలు చేపట్టలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి చర్యలు తీసుకునే ఆలోచన లేదని అన్నారు. ఐటీ పరిశ్రమలో కొనసాగుతున్న ఏఐ మార్పు తక్షణమే ఉద్యోగాలను తగ్గించేది కాదని పరేఖ్ తేల్చేశారు. ఏఐ పని పరిధిని విస్తరింపజేస్తోంది గానీ, కుదించడం లేదన్నారు. ఉద్యోగాల స్వభావం మారుతున్నప్పటికీ, ప్రతిభావంతులకు డిమాండ్ కొనసాగుతుందన్నారు. అనేక ఐటీ సంస్థలు భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్న తరుణంలో ఇన్ఫోసిస్ సీఈవో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇకపైనా ఉద్యోగాలను తగ్గించకుండా తన నియామకాల వేగాన్ని కొనసాగించాలని ఇన్ఫోసిస్ యోచిస్తోంది. గత ఏడాది మాదిరిగానే, ఈ ఏడాది కూడా 20వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. సిబ్బంది సంఖ్యను తగ్గించడం కంటే, నైపుణ్యాలను తిరిగి నేర్పించడంపైనే దృష్టి సారించామని పరేఖ్ అన్నారు. ఇంజనీర్లకు సాంప్రదాయ కోడింగ్ పద్ధతులు, ఏఐ-ఆధారిత సాధనాలు రెండింటితోనూ పనిచేసేలా శిక్షణ ఇస్తున్నారు.     

ఉత్తరప్రదేశ్‌ లోని సుల్తాన్‌పూర్ జిల్లా దరియాపూర్ గ్రామంలో ఏప్రిల్ 25న ఒక పెళ్లి ఊరేగింపులో మోగించిన డీజే సౌండ్ కారణంగా తన కోళ్ల ఫారంలోని 140 కోళ్లు మృతి చెందాయని యజమాని సాబీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ శబ్దాల వల్ల కోళ్లు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డీజే ఆపరేటర్ కవి యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీజే సౌండ్ అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పక్షులు మరియు జంతువులలో అధిక తీవ్రత కలిగిన ధ్వని తరంగాలు ఒత్తిడిని మరియు గుండెపోటును కలిగిస్తాయని, దీనివల్ల కోళ్లు మరణించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును వాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిచ్చి రీల్స్ చేస్తున్న నకిలీ కానిస్టేబుల్ చరణ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు రకాల పోలీస్ యూనిఫాంలతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత కొద్దిరోజులుగా నిందితుడు చరణ్ తాను సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విధుల్లో ఉన్నట్లు నమ్మిస్తూ ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 'మీరు రేవంత్ రెడ్డిని కలవాలా? అయితే నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి.. నేనే మీకు మీటింగ్‌ ఏర్పాటు చేస్తా' అంటూ అతివిశ్వాసంతో మాట్లాడాడు. అలాగే ఐపీఎల్ సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తానంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేసి హంగామా చేశాడు. ఈ రీల్స్ వైరల్ అవ్వడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. వారు ఆరా తీయగా అతడు అసలు పోలీసే కాదని తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్ మ్యాప్‌లో చూపిస్తూ నేపాల్ ఎయిర్‌లైన్స్ చేసిన ఒక ఘోరమైన తప్పిదం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వివాదాస్పద 'నెట్‌వర్క్ మ్యాప్' సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. తప్పు తెలుసుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగివచ్చి, భారత్‌ను క్షమాపణలు కోరింది. నేపాల్‌కు చెందిన అధికారిక విమానయాన సంస్థ 'నేపాల్ ఎయిర్‌లైన్స్' సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ నెట్‌వర్క్ మ్యాప్‌లో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా చూపించారు. ఈ మ్యాప్‌ను గమనించిన భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన సంస్థ, తీవ్ర వ్యతిరేకత రావడంతో బుధవారం నాడే ఆ వివాదాస్పద పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆఘమేఘాల మీద తొలగించింది. ఈ ఘోర తప్పిదంపై గురువారం నాడు నేపాల్ ఎయిర్‌లైన్స్ అధికారికంగా 'ఎక్స్' వేదికగా స్పందించింది. 'మా సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్న నెట్‌వర్క్ మ్యాప్‌లో దొర్లిన తప్పుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి.. మ్యాప్‌లో ఉన్న భౌగోళిక దోషాలు నేపాల్ దేశపు అధికారిక వైఖరిని లేదా నేపాల్ ఎయిర్‌లైన్స్ అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవు' అని స్పష్టం చేసింది.

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఆశ చూపించి సుమారు రూ.6.5 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన మహిళను హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం సీఐ ఎస్.రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడకు చెందిన బడ్డం జ్యోతి (48) గత తొమ్మిదేళ్లుగా వనస్థలిపురం కమలానగర్‌లో నివాసం ఉంటోంది. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి, పెట్టుబడులపై 10 శాతం వరకు వడ్డీ ఇస్తానని పలువురిని ఆకర్షించింది. అదే సమయంలో పరిచయస్తులతో చిట్టీలు కూడా నడిపించింది. మొదట్లో చెప్పినట్లుగానే లాభాలు, వడ్డీలు చెల్లించడంతో బాధితులు ఆమెను పూర్తిగా నమ్మారు. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 2020 నుంచి వనస్థలిపురం పరిధిలో సుమారు 10మంది బాధితుల నుంచి రూ.6.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. విచారణలో మరికొందరి నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు వసూలు చేసినట్లు జ్యోతి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ జోన్ డీసీపీ డా.బి.అనురాధ, వనస్థలిపురం ఏసీపీ పి.కాశీరెడ్డి పర్యవేక్షణలో నిందితురాలిని కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

తెలంగాణాలో సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి శ్రీమతి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు సచివాలయంలోని మంత్రి ఛాంబర్‍లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబుతో కలసి సరస్వతి అంత్య పుష్కరాల పోస్టర్, అధికారిక టీజర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఈ సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు, 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలకు 30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ అంత్య పుష్కరాలకు 30 లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతి ఆది పుష్కరాలు (మే 15, 2025 నుండి మే 26, 2025), సమ్మక సారలమ్మ జాతర నిర్వహణకు అవకాశం వచ్చిందని, వాటిని అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు. ఇప్పుడు సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు కూడా పనులను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ సరస్వతీ పుష్కరాలలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. 10 రోజుల ముందే పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ. 198 కోట్లను కేటాయించినందుకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాళేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోహన్ శర్మ, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భర్తతో కలిసి జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న మహిళను మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఓ దంపతులు కొంతకాలంగా ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం వీరు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ బోగీలో ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ మహిళను మాటల్లో దించి, నమ్మించాడు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒకే రైలులో భర్త ప్రయాణిస్తున్నప్పటికీ ఈ దారుణం జరగడం గమనార్హం. ఈ ఘటన అనంతరం బాధితురాలు రెంటచింతల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే బాధిత మహిళతో ఆమె వీడియో కాల్ ద్వారా మాట్లాడి పరామర్శించారు. బాధితురాలికి మనోధైర్యం కల్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామని, ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై జరిగిన అమానుష ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. 

శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమీ సిల్వా సహా బోర్డు సభ్యులంతా తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా లేఖలను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, క్రీడల శాఖ మంత్రి సునీల్ కుమార గమాగేలకు పంపినట్లు తెలుస్తోంది. జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో షమీ సిల్వాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇటీవల భారత్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకోలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శనే అనూహ్య రాజీనామాలకు కారణమని తెలుస్తోంది. 65 ఏళ్ల షమీ సిల్వా 2019 నుంచి శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021, 2023, 2025 సంవత్సరాల్లో ఆయన ఏకగ్రీ వమయ్యారు. 2025లో జై షా తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ సిల్వా బాధ్యతలు చేపట్టారు. అయితే షమీ సిల్వా హయాంలో శ్రీలంక క్రికెట్ బోర్డు వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో జట్టు దారుణంగా విఫలం కావడంతో అప్పటి క్రీడల మంత్రి బోర్డును రద్దు చేశారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధం కావడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీని ఫలితంగా శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. శ్రీలంక 1973 క్రీడా చట్టం ప్రకారం క్రీడా సమాఖ్యలను రద్దు చేసే అధికారం మంత్రికి ఉన్నప్పటికీ, ఎన్నికైన సంస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ అంగీకరించదు. ప్రస్తుత పరిణామాలపై ఐసీసీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో పదో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌29న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్​లు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయగా.. 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాల్లో 95.15శాతం ఉత్తీర్ణత నమోదైంది.

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 77,496 వద్ద స్థిరపడగా నిఫ్టీ 181 పాయింట్ల వృద్ధి నమోదు చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అకస్మాత్తుగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను కాస్త దెబ్బతీసింది. ఐటీసీ, మారుతీ సుజుకీ వంటి భారీ షేర్లు ఆదుకోవడంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లకుండా బయటపడ్డాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఆగిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. దీనికి తోడు మే 1 నుంచి యూఏఈ దేశం ఒపెక్ కూటమి నుంచి తప్పుకుంటామని ప్రకటించడంతో సరఫరా సమస్యలు మొదలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మూడు శాతం పెరిగి బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరింది. ఈ పరిణామం వల్ల మార్కెట్ ఉత్సాహం చివరి గంటలో ఆవిరై పోయి సూచీలు కిందకు వచ్చాయి. నేటి ట్రేడింగ్‌లో ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, రియల్టీ రంగాలు మంచి లాభాలను సాధించి మార్కెట్‌ను నిలబెట్టాయి. ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముందంజలో ఉండగా ఏషియన్ పెయింట్స్ వంటివి నష్టపోయాయి. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 94.86 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతానికి 24,200 వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కోల్ కతలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కంచుకోట భవానీపూర్ నుంచి ఆమె ఈ దఫా కూడా బరిలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సువేందు అధికారిని ఆమె ఎదుర్కొంటోన్నారు. కోల్ కతలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మమత బెనర్జీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోన్నామని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం బెంగాల్‌లో బీజేపీ ఓడిపోతోందని తేల్చి చెప్పారు. మూడొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. సీఆర్‌పీఎఫ్, కేంద్ర పరిశీలకులు ప్రజలను, మహిళలు, పిల్లలను కూడా కొడుతున్నారని, పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారని విమర్శించారు. పోలింగ్ కు ఒకరోజు ముందు రాత్రి నుంచి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారని, తమ పార్టీ సానుభూతిపరులు చాలా మందిని కస్టడీలోకి తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కోర్టు ధిక్కారంగా అభివర్ణించారు. ఇలాంటి నిర్బంధ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ చూడలేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బూత్‌లో కూడా రాష్ట్ర పోలీసులు లేరని, కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలే అంతటా ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సరిహద్దులను కాపాడకుండా కేంద్ర బలగాలు ఒక రాజకీయ పార్టీకి భద్రత కల్పిస్తున్నాయని దీదీ విమర్శించారు. తాను 1984 నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, పోలింగ్ సమయంలో ఇటువంటి భయానక వాతావరణం ఎప్పుడూ చూడలేదని అన్నారు.

దేశీయ మార్కెట్లో ఒప్పో ఎఫ్33 5జీ అమ్మకాలు ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో ప్రో వేరియంట్‌తో కలిసి విడుదలైన తర్వాత ఇప్పుడు సేల్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.57 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇందులో ఉంది, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 31,999 రూపాయలు. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర 34,999 రూపాయలు. 8జీబీ + 256జీబీ మోడల్ ధర 37,999 రూపాయలు. ఇది ఒప్పో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఫారెస్ట్ గ్రీన్, పర్ల్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. కస్టమర్లకు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. ప్రమాదాలు, వాటర్ డ్యామేజ్ కోసం 180 రోజుల వరకు ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ 6 నెలల వరకు ఉంది. 12 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్‌తో కన్జ్యూమర్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఒప్పో ఎఫ్33 5జీ లో 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1080 x 2372 పిక్సెల్స్. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంది. స్క్రీన్‌కు ఏజీసీ డీటీ-స్టార్ డీ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16 పై నడుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సర్ కూడా ఉంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 1080పీ వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏఐ ఇమేజింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 7000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. మిలిటరీ గ్రేడ్ ఐఎమ్‌ఎల్-ఎస్‌టిడి-810హెచ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. 360 డిగ్రీ ఆర్మర్ బాడీ డిజైన్‌తో వస్తుంది. 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉంది. జియో సర్టిఫైడ్ 5జీ++ కనెక్టివిటీ కూడా అందిస్తుంది. ఫోన్ పరిమాణం 158.2 x 78.0 x 8.0 మిల్లీమీటర్లు. బరువు 189 గ్రాములు. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ, శక్తివంతమైన ఫీచర్లతో మధ్యస్థాయి ధరలో మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. 

జపాన్‌లో తగ్గుతున్న జనాభా సంఖ్యను పెంచడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. 'మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్' పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత పెళ్లిళ్లు, పిల్లల్ని కనడం పట్ల పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో జపాన్‌లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది. జపాన్‌లోని తీవ్రమైన జనాభా క్షీణతను అరికట్టడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు యువతకు 'డేటింగ్ యాప్ సబ్సిడీలు' అందిస్తున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ పథకాల ఉద్దేశ్యం. 20 -39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి యువతీ యువకులకు ఈ సదుపాయం కల్పిస్తోంది. గుర్తింపు పొందిన 'టాపిల్' వంటి మ్యాచ్ మేకింగ్ యాప్స్ వాడకానికి అయ్యే ఖర్చులో 20,000 యెన్ల వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 మధ్య జరిగే ఖర్చులకు ఇది వర్తిస్తుంది. భద్రత ,విశ్వసనీయత ప్రమాణాలు పాటించే నిర్దేశిత యాప్‌లను వాడేవారికి మాత్రమే ఈ నగదు అందుతుంది. కేవలం కోచి మాత్రమే కాకుండా జపాన్‌లోని ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి వినూత్న చర్యల్ని చేపట్టాయి. మియాజాకి ప్రిఫెక్చర్‌లో 10,000 యెన్ల వరకు సబ్సిడీని ఇప్పటికే అందిస్తున్నారు. జపాన్‌ రాజధానిలో టోక్యోలో పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగులకు వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తద్వారా యువతకు తమ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 9,08,574 తగ్గింది. గతేడాది సుమారు 16 లక్షల మంది మరణించగా, పుట్టిన వారు కేవలం 6,86,061 మంది మాత్రమే. అంటే జననాల కంటే మరణాలు రెట్టింపుగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, 39 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌లైన్ డేటింగ్ ద్వారానే తమ భాగస్వామిని కలుసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్ 'ఆంత్రోపిక్' ఒక అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్‌ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలంటే కోడింగ్‌లో నైపుణ్యం సాధించి ఉండాలి. కానీ, ఈ కొత్త పోస్టుకు అసలు కోడింగ్ నైపుణ్యాలే అవసరం లేదు. అయినప్పటికీ, ఏడాదికి ఏకంగా 4,00,000 డాలర్లు వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ కేంద్రంగా పనిచేయాల్సిన ఈ రోల్‌ ప్రధానంగా కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి వీవీఐపీ సమావేశాల నుంచి భారీ స్థాయి టెక్ ఈవెంట్‌లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం వంటివి చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఆంత్రోపిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి సాంకేతిక అంశాలను వివరించాలి. ఈ ఉద్యోగంలో నెలకు సుమారు 10-12 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఈ భారీ జీతంపై ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఏఐ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఏదైనా ఒకటి సమృద్ధిగా లభించినప్పుడు దానికి భిన్నమైనది, అరుదుగా మారుతుంది' అని ఆయన విశ్లేషించారు. మెషీన్ జనరేటెడ్ టెక్స్ట్ పెరిగిపోతున్న తరుణంలో మనుషుల మధ్య జరిగే లైవ్ కమ్యూనికేషన్‌కు ఉన్న డిమాండ్‌ను ఈ ఉద్యోగం ప్రతిబింబిస్తోంది. ఈ భారీ ప్యాకేజీని దక్కించుకోవాలంటే అభ్యర్థుల నేపథ్యం, నైపుణ్యాల వివరణ చాలా ముఖ్యం. 'మీరు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?' అనే అంశంపై 200 నుంచి 400 పదాలలోపు ఒక స్పష్టమైన వ్యాసాన్ని సమర్పించాలి. దీన్ని విశ్లేషించి కంపెనీ యాజమాన్యం అభ్యర్థులను మెయిల్‌ ద్వారా సంప్రదిస్తుంది.

ఉద్యోగుల బకాయిలను నెలకు రూ. 700 కోట్లు విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. కాగా, ఇప్పుడు ఏప్రిల్ నెల చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్‌ బకాయిల కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌ వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్‌ ఉద్యోగుల జీపీఎఫ్‌ బకాయిలను క్లియర్‌ చేసింది. ఆర్దిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ ఈ మేరకు నిధులను విడుదల చేసారు. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ 700 కోట్ల విడుదలకు హామీ ఇచ్చింది. ఈ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతీ నెలా ఉద్యోగ సంఘాల కు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసింది. కాగా, ఉద్యోగుల ఆర్దిక అవసరాల ను గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఆర్దిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ 1000 కోట్ల విడుదల అయ్యాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కు సంబంధించి ఈ నిధులు విడుదల చేసారు. అక్టోబర్ 2025 వరకు పెండింగ్ లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేసారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగు లు కోర్టుకు వెళ్లారు. వీరి పిటీషన్ల పైన విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు గడువు ఖరారు చేసింది. దీంతో.. ప్రభుత్వం చెల్లింపులు ప్రారంభించింది. ఇదే సమయంలో ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన బకాయిల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కోర్టు నిర్దేశించిన గడువులో గా రిటైరైన ఉద్యోగుల బకాయిలను విడుదల చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తోంది.

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు అన్నారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలుతెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారన్నారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా? ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలన్నారు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయంటూ కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారని, మద్దతు ధర రూ. 5,875 ఉంటే ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని నిలదీశారు. కనీస మద్దతు ధర రూ.3371 ఉంటే ప్రైవేటు వ్యక్తులకు రూ.2500కే అమ్ముకుని రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న రైతులపై వివక్ష ఎందుకంటూ ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అని అడిగారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హరీష్‌రావు హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించేందుకు గత ఏడాదికంటే ఈసారి కేంద్రాల సంఖ్యను పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపాదించిన 8,525 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 6,500కు పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఐకేపీ ఆధ్వర్యంలో 2,623 కేంద్రాలు, సొసైటీల ద్వారా 3,278 కేంద్రాలు, ఇతర సహకార సంస్థల ద్వారా 353 కేంద్రాలు పని చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో దాదాపు 43,000 మంది శిక్షణ పొందిన సిబ్బంది కొనుగోళ్లలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు మంగళవారం నాటికి సుమారు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు పూర్తయింది. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యంలో దొడ్డు, సన్న రకాలుగా విభజించి సేకరణ కొనసాగుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేందుకు 6,500 లారీలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఆటోమేటెడ్ డ్రైయర్లు, క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. అదనంగా సుమారు 20 కోట్ల గన్నీ బ్యాగులు ముందుగానే నిల్వ ఉంచారు, తద్వారా కొనుగోళ్లు ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.2031 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా ఇప్పటికే దాదాపు రూ.323 కోట్లు రైతులకు చెల్లించారు. వెంటవెంటనే చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధాన్యంతో పాటు ఇతర పంటల కొనుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఈసారి 43.20 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి అంచనాలున్నాయి. ఇప్పటివరకు 3.46 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. దాదాపు రూ.830.69 కోట్ల విలువైన కొనుగోళ్లతో 64,779 మంది రైతులు లబ్ది పొందారు. 1.25 లక్షల మెట్రిక్ టన్నుల శనగ పంట దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 30,220 మెట్రిక్ టన్నుల కొనుగోలు జరపగా 15,933 మంది రైతులు లబ్ది పొందారు. పొద్దుతిరుగుడు పంట 19,808 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేయగా ఇప్పటివరకు 2,512 మంది రైతుల నుంచి 3,492 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయింది. అన్ని జిల్లాల్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా కొనసాగుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర అందించటంతోపాటు సౌకర్యవంతమైన సేవలు, తక్షణ చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

రష్యా చమురు స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ వరుసగా డ్రోన్స్‌లతో దాడులకు తెగబడుతుంది. దీంతో 24కు పైగా ముడి చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్రూడాయిల్‌. హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో క్రూడాయిల్‌ సరఫరాకు ఆటంకం తలెత్తి తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గంగా రష్యాపై కొన్ని దేశాలు దృష్టిసారించాయి. అయితే ఇప్పుడు రష్యా చమురు స్థావరాలు సైతం దాడులకు గురి కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న తుయాప్సే నగరంలోని రష్యా చమురు స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో యాసిడ్ వర్షం కురవడంతో పాటు గాలిలో బెంజీన్, గ్జైలీన్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని తీర ప్రాంతంలో చేపలు, పక్షులు చనిపోయి పడి ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ గడిచిన 15రోజుల్లో రష్యా చమురు స్థావరాలే లక్షంగా మూడుసార్లకు పైగా దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. తొలిసారిగా ఏప్రిల్‌16న దాడులు జరుపగా మరోసారి ఏప్రిల్‌ 20 తేదీన దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటికే 24 చమురు నిల్వ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది. కీవ్ నగరానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుయాప్సే రిఫైనరీ రష్యా చమురు ఎగుమతులకు అత్యంత ప్రధానమైనది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సరాసరిన రోజుకు 240,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. రష్యా మొత్తం ఇంధన ఎగుమతి సామర్థ్యంలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది రష్యాలోని టాప్ 10 రిఫైనరీలలో ఒకటి. రష్యా బడ్జెట్‌లో చమురు ఎగుమతులది సింహభాగం. దీనికి తోడు హర్ముజ్‌ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచం చూపు రష్యా చమురు వైపు మళ్లుతోంది. దీనివల్ల రష్యాకు ఊహించని లాభాలు కూడా చేకూరాయి. అల్ జజీరా ప్రకారం, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆకాశాన్నంటుతున్న ప్రపంచ చమురు ధరల కారణంగా, యుద్ధం మొదలైన మొదటి రెండు వారాల్లోనే రష్యా చమురు అమ్మకాల ద్వారా అదనంగా 672 మిలియన్ యూరోలు సంపాదించిందని 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' అంచనా వేసింది. ఎగుమతి కోసం ఉద్దేశించిన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ఉక్రెయిన్ భావిస్తోన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే ఈ దాడులతో దీనివల్ల ప్రపంచ చమురు కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా ఆరోపణలు చేస్తుంది.

తెలంగాణలో గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో పదోన్నతులు కల్పించింది. సీనియర్ అసిస్టెంట్ పోస్టులపై జీపీవోలకు లైన్ క్లియర్ చేసింది. జిల్లా స్థాయిలో రొటేషన్ విధానంలో పదోన్నతులు కల్పించనున్నారు. 2026 ఫిబ్రవరి 12 నుంచి అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.397 కోట్ల మేర ప్రజాధనం వృథా అయిందనే ఆరోపణలపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2021 నుంచి 2023 మధ్య కాలంలో తమిళనాడు విద్యుత్ సంస్థ టాంజెడ్‌కో కోసం 45,800 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు జరిగింది. ఈ టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి టెండర్లు దక్కించుకున్నారని ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రత్యేకంగా 26 కంపెనీలు ఒకే ధర కోట్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఇది ముందస్తు కుట్రలో భాగమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ ప్రక్రియలో పోటీ లేకుండా పరస్పర అవగాహనతో కాంట్రాక్టులు పొందినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అరప్పోర్ ఇయక్కమ్ సంస్థ ఫిర్యాదు చేయడంతో కేసు న్యాయస్థానం దృష్టికి వెళ్లింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ సీరియస్‌గా స్పందించింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరపాలని ఆదేశించింది. ఈ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. టెండర్ల కేటాయింపు, ధరల నిర్ణయం, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై సీబీఐ లోతుగా విచారణ చేపట్టనుంది.. 

దేశీయ మార్కెట్లో రియల్‌మీ 16 ఎక్స్ 5జీ విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత వినియోగదారుల ముందుకు రానుంది. రియల్‌మీ 16 సిరీస్ ఇప్పటికే తన ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఈ కొత్త మోడల్ రాకపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ కొత్త హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ RMX5270తో రాబోతోంది. కచ్చితమైన లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ ఫోన్ ఎంట్రీ చాలా దగ్గరలోనే ఉందని సంకేతాలు అందుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా రెండు విభిన్నమైన , ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. వీటిని మార్కెట్లో ఎండ్యూరెన్స్ బ్రౌన్, గ్లోరీ వైట్  పేర్లతో విక్రయించే అవకాశం ఉందని సమాచారం. రియల్‌మీ ఎప్పుడూ తన ఫోన్ల డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి, ఈ రంగులు ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయని భావిస్తున్నారు. వినియోగదారుల అవసరాలు , బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని రియల్‌మీ ఈ ఫోన్‌ను మూడు వేర్వేరు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి తీసుకురానుంది. బేస్ వేరియంట్ 4GB RAM , 128GB స్టోరేజ్‌తో ప్రారంభం కానుండగా, మెరుగైన పనితీరు కోరుకునే వారి కోసం 6GB RAM + 128GB స్టోరేజ్ , టాప్ ఎండ్ వేరియంట్‌గా 6GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. ఈ వైవిధ్యం వల్ల బడ్జెట్ వినియోగదారుల నుండి పవర్ యూజర్స్ వరకు అందరికీ ఈ ఫోన్ చేరువయ్యే అవకాశం ఉంది.

3