తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు కొండపైకి చేరుకుని ఆలయ పరిసరాల్లోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి నిత్యపూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరగా ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కళకళలాడింది.
0 Comments