Ad Code

జనసేన పార్టీ అధికారిక 'X' హ్యాండిల్ హ్యాక్ !


నసేన పార్టీ అధికారిక X హ్యాండిల్‌ హ్యాకింగ్‌కు గురైంది. సైబర్‌ నేరగాళ్లు అకస్మాత్తుగా ఖాతా నియంత్రణను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఖాతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉంది. నిత్యం పోలిటికల్ పోస్టులు కనిపించే జనసేన హ్యాండిల్లో హ్యాకింగ్‌కు గురైన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్ సంబంధించిన రీ ట్వీట్ చేసిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇది చూసిన పార్టీ అభిమానులు, శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సైబర్ నేరగాళ్ల పన్నాగం ఏమై ఉండొచ్చని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీ నాయకత్వం అప్రమత్తమై, సైబర్‌ క్రైమ్‌ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఖాతా పునరుద్ధరణ కోసం సాంకేతిక బృందం కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ హ్యాకింగ్‌ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu