వేసవిలో భక్తుల రద్దీని తట్టుకునేలా టీటీడీ కసరత్తు !


తిరుమలకు వేసవి వేళ భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీలో మార్పులు చేయనున్నారు. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలు చేసిన విధానాన్ని అనుసరించాలని అమలు ముహూర్తం టీటీడీ ఖరారు చేసింది. మే 1 నుంచి వేసవి రద్దీ కారణంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీలో మార్పులు చేయనుంది.. వేసవిలో ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తూ, సాధారణ భక్తులకు సర్వదర్శనం సమయాన్ని పెంచేలా టీటీడీ యోచిస్తోంది. భక్తుల రద్దీని బట్టి క్యూలైన్లలో మార్పులు ఉంటాయి. టీటీడీ బోర్డు గత మూడేళ్ల గణాంకాలను పరిశీలించింది. మే, జూన్, జులై నెలల్లో ప్రతినెలా సుమారు 23 నుంచి 24 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు గుర్తించారు. వీఐపీ దర్శనాల కోసం రోజు 2 నుంచి 3 గంటల సమయాన్ని కేటాయించబడుతోంది. ఈ రెండు మూడు గంటల్లో సుమారు 3800 మంది మాత్రమే దర్శనం పొందుతున్నారు. అదే సమయాన్ని సామాన్య భక్తుల కోసం కేటాయిస్తే సుమారు 15 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు 22 నుంచి 23 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనిని మార్చేందుకు గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలు చేసిన విధానాన్ని అనుసరించాలని టీటీడీ భావిస్తోంది. ఈ విధానంలో అన్ని కేటగిరీలు తాత్కాలికంగా పక్కనపెట్టి ఒకేవిధమైన దర్శనాన్ని నిర్వహించడం ద్వారా నిరీక్షణ సమయాన్ని 8 నుంచి 12 గంటల మధ్యకు తగ్గించే అవకాశం ఉంటుందని అంచనా. గతంలో ఈ విధానం అమలు ద్వారా సామాన్య భక్తులకు ప్రయోజనం కలిగింది. త్వరగా దర్శనం చేసుకునే వెసులుబాటు దక్కింది. దీంతో, వేసవి రద్దీ వేళ తిరిగి ఇదే విధానం అమలు దిశగా టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ విధానం అమలు పైన టీటీడీ అధికారికంగా ప్రకటన చేయనుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains