Ad Code

మే నెలలో హెచ్ఎండి నుండి వైబ్ 2 5జి ఫోన్ లాంచ్


హెచ్ఎండి బడ్జెట్ సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ వైబ్ 2 5జి ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ మే నెలలో లాంచ్ అవుతుందని టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ కొత్త అప్డేట్ ను విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలు రిలీజ్ చేయలేదు. ఈ ఫోన్ 2026 మే నెలలో లాంచ్ అవుతుందని మాత్రమే హెచ్ఎండి ప్రకటించింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రూమార్డ్ ఫీచర్లు మరియు స్పెక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ లో వచ్చిన రూమర్స్ ప్రకారం, హెచ్ఎండి వైబ్ 2 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ యూజర్ ను ఆకర్షించే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6.75 ఇంచ్ HD+ IPS LCD ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్ 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Unisoc T7200 బడ్జెట్ 5జి ప్రోసెసర్ తో లాంఛ్ చేసే అవకాశం ఉండొచ్చని కూడా రూమర్స్ ఉన్నాయి. అయితే, కెమెరా పరంగా ఈ ఫోన్ ఆకట్టుకునేలా ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అదేమిటంటే, ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని రూమర్లు చెబుతున్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇది 5000mAh బ్యాటరీ తో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ IP52 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో కూడా వచ్చే అవకాశం ఉండొచ్చని రూమర్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu