May 2026

కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి ప్రాంతంలో ఆగి ఉన్న కంటైనర్ ని ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోను ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అమెరికాలో కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాలలో అత్యంత ప్రతిభ కనబర్చే వారికి అందించే ప్రతిష్ఠాత్మక 'మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్' అవార్డును తెలుగు అమ్మాయి అనన్య గోలి కైవసం చేసుకుంది. ఈ పురస్కారాల్లో భాగంగా ఆమెకు 'స్టేట్ హానరబుల్ మెన్షన్' లభించడం విశేషం. ఇంతటి అరుదైన గౌరవాన్ని అందుకున్న అనన్య గోలి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోలి కృష్ణచైతన్య, సంపా సిన్హా దంపతుల కుమార్తె ఈమె. ప్రస్తుతం వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. అనన్య అక్కడ మిన్నెసోటాలోని ప్రసిద్ధ 'ఈడెన్ ప్రైరీ హైస్కూల్‌'లో విద్యనభ్యసిస్తోంది. చిన్న వయసులోనే సాంకేతిక రంగంపై ఉన్న ఆసక్తితో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. చిన్న వయసులోనే కంప్యూటర్ సైన్స్, కోడింగ్ వంటి సాంకేతిక విషయాలపై అనన్యకు అద్భుతమైన పట్టు ఉంది. క్లాస్ రూమ్‌లోనే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో సరికొత్త టెక్నాలజీ ప్రాజెక్టులలో చురుగ్గా పాల్గొంది. ఇక అంతేకాకుండా, తోటి విద్యార్థులను నడిపించే అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడం వల్లే అమెరికా నిపుణులు ఆమెను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో నిర్వహించిన చిట్ చాట్‌లో హరీష్ రావు తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని కేసీఆర్‌పై ఒట్టేసి చెప్పాలని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ బతికున్నంత కాలం బీఆర్ఎస్‌లోనే ఉంటానని.. నా పుట్టుక బీఆర్ఎస్‌లో, చావుకూడా బీఆర్ఎస్‌లోనని అన్నారు. మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగ భరితమైన కౌంటర్ ఇచ్చారు. తన పొలిటికల్ అస్తిత్వం, విధేయతపై వస్తున్న ఊహాగానాలకు గట్టి సమాధానమిచ్చారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా నా జీవితం అంతా కేసీఆర్ తోనే ముడిపడి ఉంది అని హరీష్ రావు స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానం కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే సాగిందని, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని ఎవరూ శంకించలేరని పేర్కొన్నారు. బతికున్నంత కాలం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతూ ప్రతిపక్షంలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని, కానీ తన విషయంలో ఆ పప్పులు ఉడకవని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం అయిన ఘటనపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందుకోసం జగన్ తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారని లోకేశ్ ఆరోపించారు. నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు జమ్ములయ్య వైఎస్సార్‌సీపీ నేతల ముఖ్య అనుచరుడని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారని మంత్రి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలే విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌లో ఆపిల్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లపై ఇప్పటికే అనేక లీకులు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త సిరీస్‌లో మెరుగైన పనితీరు, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, కొత్త డిస్‌ప్లే టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా, ఈ ఏడాది కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశముందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై ఆపిల్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అతిపెద్ద మార్పు డిస్‌ప్లే విభాగంలో కనిపించనుంది. ప్రస్తుతం ఉన్న మోడళ్లలో కనిపించే డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని కంపెనీ గణనీయంగా తగ్గించే అవకాశముంది. లీకుల ప్రకారం, ఐఫోన్ 18 ప్రోలో డైనమిక్ ఐలాండ్ ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే దాదాపు 35 శాతం వరకు చిన్నదిగా ఉండవచ్చు. దీంతో వినియోగదారులకు మరింత బిగ్ స్క్రీన్ అనుభవం లభించే అవకాశం ఉంది. గతంలో ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని సెన్సార్లను డిస్‌ప్లే కింద అమర్చే టెక్నాలజీపై కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో గత తరం మోడళ్లతో పోలిస్తే మరింత పెద్ద బ్యాటరీ అందించే అవకాశం ఉంది. లీకుల ప్రకారం, ఇందులో 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండవచ్చు. ఈ అప్‌గ్రేడ్ వల్ల వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర అధిక వినియోగ పనుల్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ విభాగంలో కూడా ఆపిల్ పలు కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రధాన కెమెరాలో వేరియబుల్ అపర్చర్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది. ఇది వివిధ లైటింగ్ పరిస్థితుల్లో మెరుగైన ఫోటోలు తీయడంలో సహాయపడుతుంది. అదనంగా, శాంసంగ్ అభివృద్ధి చేసిన కొత్త తరం మూడు-పొరల స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్‌ను ఉపయోగించే అవకాశముంది. దీంతో తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫోటో నాణ్యత లభించవచ్చు. అలాగే జూమ్ సామర్థ్యాన్ని కూడా కంపెనీ మరింత మెరుగుపరచనున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా నిర్వహించిన 'MCh రెటినా' ప్రవేశ పరీక్షలో డాక్టర్ ఆశిష్ ఎస్ ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ అద్భుతమైన విజయం ద్వారా దక్షిణ భారతదేశం నుండి ప్రతిష్టాత్మకమైన MCh రెటినా కోర్సులో ప్రవేశం పొందబోతున్న మొట్టమొదటి అభ్యర్థులలో ఒకరిగా ఆయన నిలిచారు. డాక్టర్ ఆశిష్ ఇటీవల చండీగఢ్‌లోనే తన ఎంఎస్ పూర్తి చేసి, అక్కడ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ‘డబుల్ గోల్డ్ మెడల్’ కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్, ఢిల్లీలో ‘సీనియర్ రెసిడెంట్ రెటినా’ విభాగానికి ఎంపికై సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయ వైద్య పరిశోధన రంగంలో ఆయనకు అపారమైన పట్టు ఉంది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆప్తాల్మాలజీ జర్నల్స్ అయిన బీజేఓ మరియు ఏఏఓలలో 15కు పైగా ఆయన పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వైద్య శాస్త్రంలో ఆయన చేసిన ఆవిష్కరణకు గానూ ఆయన పేరిట ఒక అధికారిక పేటెంట్ కూడా నమోదు కావడం విశేషం. డాక్టర్ ఆశిష్ నిరంతర కృషి, అంకితభావం, అకడమిక్ ప్రతిభకు ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక నిదర్శనం. ఆయన సాధించిన ఈ అమోఘమైన విజయం వారి కుటుంబానికి ఎనలేని గర్వకారణంగా నిలిచింది. ప్రముఖ విద్యావేత్త, దివంగత ప్రొఫెసర్ వెంగళరావుకి ఆయన వారసుడు. సాధించిన ఈ అసమాన ఘనత ఒక గొప్ప నిజమైన నివాళి అని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడంతో పాటు, ఆయా హౌసింగ్ సముదాయాలలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.273.79 కోట్ల నిధులను విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ టిడ్కో హౌసింగ్ సముదాయాల్లో నిలిచిపోయిన పనులకు మోక్షం లభించనుంది. కేవలం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా, లబ్ధిదారులు అక్కడ నివసించడానికి అనుకూలంగా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నిధుల విడుదలతో టిడ్కో గృహాల వద్ద మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ప్రధానంగా లబ్ధిదారుల కాలనీలలో రోడ్ల నిర్మాణం, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా మరియు తాగునీటి వసతి కల్పన వంటి పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. చాలా కాలంగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాక, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న వేలాది మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయం వల్ల నేరుగా ప్రయోజనం చేకూరనుంది. నిధుల విడుదలతో ఇళ్ల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. గృహాల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో, అతి త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అప్పగించేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. 

దేశీయ మార్కెట్లో గత సంవత్సరం జులైలో 'నథింగ్ ఫోన్ 3'ని విడుదలైంది. విడుదలైన ఏడాదిలోపే ఈ ఫోన్ ధర రూ. 37,000 వరకు తగ్గింది. ప్రారంభ ధర 12GB+256GB వేరియంట్ రూ. 79,999, అలాగే 16GB+512GB వేరియంట్ రూ. 89,999గా ఉండేవి. అమెజాన్ లో ప్రస్తుత తగ్గిన ధర (ప్రకారం 12GB+256GB: బ్లాక్ కలర్ రూ. 42,999, వైట్ కలర్ రూ. 44,999, 16GB+512GB: బ్లాక్ కలర్ రూ. 51,999, వైట్ కలర్ రూ. 54,999లకు లభిస్తున్నాయి. ఇది  6.67-అంగుళాల AMOLED ప్యానెల్, 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ (HDR) పీక్ బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. పాత నథింగ్ ఫోన్ 2తో పోలిస్తే ఇందులో CPU శక్తి 36%, GPU పనితీరు 88% మరియు AI ప్రాసెసింగ్ 60% మెరుగుపడ్డాయి. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది (50MP మెయిన్ + 50MP పెరిస్కోప్ + 50MP అల్ట్రా-వైడ్). ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 'ట్రూ లెన్స్ ఇంజిన్ 4' వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5500mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, అంటే 54 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అలాగే 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం ఆ మాట ఎప్పుడు ఆనలేదని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని కేటీఆర్ బడాయి కబుర్లు చెపుతున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ హయాంలో 12 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్‌పైన తొలి సంతకం చేసింది అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే అని ప్రస్తావించారు. రైతును రాజు చేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఏనాడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని అన్నారు.. గత యాసంగి సీజన్‌లో విద్యుత్ ఇవ్వలేదని ఏ సబ్‌స్టేషన్ దగ్గర చిన్న ధర్నా కూడా జరగలేదని.. అది తమ నిబద్దత అని చెప్పారు. నాణ్యమైన విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా తమ ప్రభుత్వం సరఫరా చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం రైతు డిస్కం పెడితే కేటీఆర్‌కు ఎందుకు అంత నొప్పి ఎందుకని ప్రశ్నించారు. రైతు ప్రయెజనాల కోసమే డిస్కం ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. మోటార్లకు మీటర్లు పెట్టమని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని.. అయినా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఒకవేళ తాము మీటర్లు పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదా అని సీఎం ఛాలెంజ్ విసిరారని అన్నారు. ముఖ్యమంత్రి సవాల్‌ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదు..? అని నిలదీశారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఆయన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ లక్షలాది మంది కార్యకర్తలు చూస్తు ఉరుకోరని హెచ్చరించారు. కేటీఆర్ రైతుల విషయంలో దుష్పచారం మానుకోవాలని హితవు పలికారు.

`దృశ్యం1', `దృశ్యం2' సినిమాల కొనసాగింపుగా మే 21న విడుదలైన దృశ్యం 3' నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా భారత్ లో రూ.105 కోట్ల గ్రాస్ రాబట్టింది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,570 షోలు వేయగా, రూ.5.05 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. పంచవ్యాప్తంగా రూ.113.75 కోట్లు వసూలు చేయగా, మొత్తం రూ.219 కోట్లకు పైగా రాబట్టింది. తాజా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన మలయళ చిత్రాల్లో ఆరోస్థానంలో నిలిచింది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈసినిమాలో మోహన్ లాల్, మీనా కీలక పాత్రల్లో నటించారు. ద్వితీయార్ధం, ముఖ్యంగా చివరి గంట కథ, కథనాలను ఆసక్తికరంగా ఉండటంతో వసూళ్లు వర్షం కురుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బలమైన గాలులకు హోర్డింగ్ ఫ్రేమ్ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్‌, స్కూటీ రైడర్‌ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రోడ్డుపై వెళ్తున్న ఒక బైకర్‌ కూలుతున్న హోర్డింగ్ ఫ్రేమ్ కింద నుంచి తల ఒంచి తృటిలో వేగంగా వెళ్లిపోయాడు. ఇంతలో ముగ్గురు ప్రయాణిస్తున్న స్కూటీ అక్కడకు చేరుకున్నది. ప్రమాదాన్ని పసిగట్టిన స్కూటీ రైడర్‌ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో దానిపై ఉన్న ముగ్గురు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావం పాకిస్తాన్‌లోని సామాన్య పౌరుల దైనందిన జీవితాలపై తీవ్రంగా పడుతోంది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు, ఆకాశాన్నంటుతోన్న జీవన వ్యయాలు చూసి రాజధాని ఇస్లామాబాద్ నివాసితులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికే భరించలేని స్థాయికి చేరుకుంది. స్థిరమైన జీతాలు వచ్చే ఉద్యోగులు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక అల్లాడిపోతున్నాయి. కీలకమైన చమురు రవాణా మార్గమైన 'హోర్ముజ్ జలసంధి' ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్నంటాయి. స్థానిక ప్రజల సమాచారం ప్రకారం.. గతంలో లీటరుకు సుమారు రూ. 250 ఉన్న పెట్రోల్ ధర ఏకంగా రూ. 450కి చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గినప్పటికీ ప్రస్తుతం లీటరుకు రూ. 400 కంటే పైనే పలుకుతోంది. డీజిల్ ధరలు కూడా ఇదే స్థాయిలో పెరగడంతో రవాణా వ్యవస్థ స్తంభించి, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరి లెక్కల ప్రకారం దేశంలో ద్రవ్యోల్బణం ఏకంగా 300 శాతం పెరిగింది. ఈ దారుణ పరిస్థితులపై ఇస్లామాబాద్‌కు చెందిన ఒక పౌరుడు స్పందిస్తూ.. “జీతాలు అలాగే ఉన్నాయి కానీ ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. ఇంధనం కొనలేక నెల రోజులుగా నా కారును పక్కన పెట్టేశాను. ఇప్పుడు కనీసం బైక్ కొనే పరిస్థితి కూడా లేదు. బతకడం దాదాపు అసాధ్యంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న సైనిక చర్యలు, క్షిపణి దాడులు అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాహ్య శక్తుల జోక్యం వల్లే ఈ ప్రాంతంలో అస్థిరత పెరుగుతోందని ఇస్లామాబాద్ నివాసితులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఇరు పక్షాలు ఘర్షణలను విరమించి, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని వారు కోరుతున్నారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత మార్కెట్ దేశానికే తలమానికంగా నిలుస్తుంది…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మెరుగైన ప్రమాణాలతో కూడిన మార్కెట్ గా ఉండబోతుంది. ఆదివారం ఉదయం కోహెడ మార్కెట్ శంకుస్థాపన నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె సురేంద్ర మోహన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి బాయి .గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మరియు ఇతర ఉన్నత అధికారులు..పాలకవర్గం సభ్యులు కలిసి పరిశీలించడం జరిగింది. అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె సురేంద్ర మోహన్ కోహెడ గుట్ట శ్రీశ్రీశ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు అధికారులు సభ ప్రాంగణాన్ని తిరిగి పరిశీలించారు. కొన్ని మార్పు చేర్పులను సూచనలను సంబంధిత అధికారులకు తెలియ చేశారు.

ఉత్తరప్రదేశ్ లో పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘజియాబాద్‌లోని ఒక పార్కులో ఆయన విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి అధికారులకు తెలిపారు. క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన చిరాగ్ అకస్మాత్తుగా ఇలా మరణించడం క్రీడాకారులను షాక్‌కు గురిచేసింది. ఆయన మరణం వెనుక ఉన్న కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపిన అధికారులు, ఆధారాల కోసం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఇది హత్య కావచ్చని భావిస్తున్న పోలీసులు, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. చిరాగ్ త్యాగి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ, పార్కులోని సీసీటీవీ దృశ్యాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విచారణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

నేడు ఆకాశంలో అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. ఒకే రోజున అటు 'బ్లూ మూన్'గా, ఇటు 'మైక్రో మూన్'గా చంద్రుడు కనిపించనున్నాడు. ఈ రెండు విభిన్న ఖగోళ విశేషాలు ఒకేసారి కలిసి రావడం దశాబ్దాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన విషయమని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా'`వెల్లడించింది. ఈ అద్భుత దృశ్యం భారతదేశంలోనూ స్పష్టంగా కనిపించనుందని తెలిపింది. సాధారణంగా ఒకే క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణమిలు వస్తే, అందులో రెండో పౌర్ణమి నాటి చంద్రుడిని 'బ్లూ మూన్' అని పిలుస్తారు. క్యాలెండర్ ప్రకారం ఇది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మే 1వ తేదీన మొదటి పౌర్ణమి రాగా, నేడు రెండో పౌర్ణమి రావడంతో దీనికి బ్లూ మూన్ అని పేరొచ్చింది. అయితే, 'బ్లూమూన్ ' ఉన్నంత మాత్రాన చంద్రుడు నీలం రంగులోకి మారిపోడు. ఎప్పటిలాగే తెల్లగా, ప్రకాశవంతంగానే కనిపించనుంది. ఈ బ్లూ మూన్‌కు 'మైక్రో మూన్' విశేషం కూడా తోడవ్వడమే నేటి ప్రత్యేకత. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో భూమికి అత్యంత దూరంలో ఉండే బిందువు (అపోజీ) వద్దకు వచ్చినప్పుడు పౌర్ణమి సంభవిస్తే దానిని మైక్రోమూన్ అంటారు. దీనివల్ల చంద్రుడు సాధారణ పౌర్ణమి నాటి పరిమాణం కంటే దాదాపు 14 శాతం చిన్నదిగా, 30 శాతం తక్కువ కాంతితో కనిపిస్తాడు. దేశంలో నేడు సాయంత్రం వేళల్లో ఈ అరుదైన మైక్రో బ్లూ మూన్‌ను ప్రజలు వీక్షించవచ్చు. అయితే, కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం వల్ల ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటే మాత్రం ఆటంకం కలగవచ్చు. 

తృణమూల్ లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీపై దాడి చోటు చేసుకుని 24 గంటలు కూడా గడవక ముందే తృణమూల్ సీనియర్ నాయకుడు, శ్రీరామ్ పూర్ లోక్ సభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీపై తాజాగా హుగ్లీ జిల్లాలో దాడి జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడి, పార్టీ నాయకులు, కార్యకర్తల అరెస్టులకు నిరసనగా చేపట్టిన ప్రదర్శన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిరసనల్లో భాగంగా నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి వ్యతిరేక నినాదాలు చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకన్నారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట జరిగింది. మొదట ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య జరిగింది. ఇది ఘర్షణకు దారితీసింది. తమ పార్టీ నాయకులను విడుదల చేయాలంటూ హుగ్లీ జిల్లా పరిధిలోని చండితాల పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందించడానికి వెళ్తోన్న సమయంలో బీజేపీ నాయకులు ఆయనపై దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. చోర్.. చోర్ అంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ కు సమీపించినప్పుడు కల్యాణ్ బెనర్జీ, ఆయన అనుచరులు, టీఎంసీ కార్యకర్తలను కొందరు బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఆయనను చుట్టుముట్టారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పిడిగుద్దులు గుద్దారు. కిందికి తోసివేశారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు తక్షణమే జోక్యం చేసుకున్నారు. వారిని విడిపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకులు తనపై రాళ్లు విసిరినట్లు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారిపై ఘాటు విమర్శలు చేశారు. స్వయంగా సువేందు అధికారి ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తోన్నాడని, అతనొక నిరంకుశుడని మండిపడ్డారు. 

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నాయకురాలు రబ్రీ దేవి తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వంలోని ఒక మంత్రికి కేటాయించిన ఆ ఇంటిని వదిలి, మరో ఇంటికి మారేందుకు ఆమె ససేమిరా ఒప్పుకోవడం లేదు. రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న '10, సర్క్యులర్ రోడ్' బంగ్లాను మత్స్యశాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్‌కు కేటాయిస్తూ భవన నిర్మాణ శాఖ మే 27న ఉత్తర్వుల్లో జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ అయినప్పుడు ఆమె నగరంలో లేరు. ఆమె విమానాశ్రయానికి చేరుకోగానే.. జర్నలిస్టులు ఈ విషయంపై మీడియా ప్రశ్నించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్రాట్ చౌదరి సీఎం అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రభుత్వం నన్ను బలవంతంగానైనా ఖాళీ చేయించమనండి. నేను మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేయనంటూ ఆమె సమాధానమిచ్చారు. దశాబ్ద కాలంగా ఆమె ఉంటున్న ఈ బంగ్లాను, గతంలో జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెకు మాజీ సీఎం హోదాలో కేటాయించిన సంగతి తెలిసిందే. శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న రబ్రీ దేవిని ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం గతేడాది నవంబర్‌లోనే మొదటిసారి కోరింది. అప్పట్లో నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భవన నిర్మాణ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో... 10, సర్క్యులర్ రోడ్ బంగ్లాను అప్పటి ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, సీనియర్ బీజేపీ నాయకుడైన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్‌లో కొనసాగుతున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి హోదాను కోల్పోయారు. రబ్రీ దేవి ఆ బంగ్లాను వదిలిపెట్టేందుకు నిరాకరించారు. తాజా వివాదంపై భవన నిర్మాణ శాఖ మంత్రి, సీనియర్ జేడీయూ నాయకురాలు లేశి సింగ్ మాట్లాడుతూ... శాసనమండలి ప్రతిపక్ష నేతకు '39, హార్డింజ్ రోడ్' బంగ్లాను కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని చెప్పారు. కాబట్టి, రబ్రీ దేవి ఆ ఇంటికి మారడం మంచిదన్నారు. ఆమె గత ఉత్తర్వులను పాటించారా? అనే విషయంతో మాకు సంబంధం లేదు. కానీ, ప్రభుత్వ ప్రముఖులకు తగిన బంగ్లాలు కేటాయించడంలో ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ఎవరూ కూడా నిర్దిష్ట బంగ్లాపై తమకు హక్కు ఉందని పట్టుబట్టలేరు. మాజీ సీఎంగా రబ్రీ దేవి ఈ విషయాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆశిస్తున్నామంటూ సింగ్ పేర్కొన్నారు. 1997లో తన భర్త తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రబ్రీ దేవి ప్రస్తుతం ఆయనతో కలిసే ఈ బంగ్లాలో ఉంటున్నారు. 

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలోని బైరాగఢ్-సచ్ పాస్ మార్గంలో కాలాబన్ సమీపంలో పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక అద్దె ట్యాక్సీ అదుపుతప్పి ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వాహన డ్రైవర్‌తో పాటు ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది గల్లంతయ్యారు. బాధితుల్లో కర్ణాటకలోని బెంగళూరు, అలాగే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెండు వేర్వేరు కుటుంబాల సభ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో కుటుంబం కలిసి వేసవి సెలవులను గడిపేందుకు హిమాచల్‌లోని ప్రముఖ హిల్ స్టేషన్ దల్హౌసీకి వచ్చారు. అక్కడ మంచు పర్వతాల అందాలను వీక్షించేందుకు ఒక ట్యాక్సీని అద్దెకు తీసుకుని, శుక్రవారం సచ్ పాస్ మార్గంలో ప్రయాణమయ్యారు. అయితే, రాత్రి అవుతున్నా వారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ట్యాక్సీ యజమాని వాహనానికి ఉన్న జీపీఎస్ సిగ్నల్‌ను ట్రాక్ చేశాడు. కాలాబన్ పరిసర ప్రాంతంలో వాహనం కదలకుండా ఒకే చోట నిలిచి ఉన్నట్లు జీపీఎస్ చూపించడంతో, అతడు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా రోడ్డు పక్కన ఉన్న లోతైన లోయలోకి ట్యాక్సీ పడిపోయినట్లు నిర్ధారణ అయింది. ప్రమాదం జరిగిన కాలాబన్ ప్రాంతం అత్యంత మారుమూల కొండ ప్రాంతం కావడం, అక్కడ ఎలాంటి మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ లభించకపోవడంతో సహాయక చర్యలకు మరియు సమాచార మార్పిడికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం లోయలో పడిన వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇటాలియన్ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటి 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా 'Collezione 100' బైక్ సిరీస్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ఇటలీలోని ముగెల్లో సర్క్యూట్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ వేదికగా డుకాటి ఈ ప్రత్యేక లైనప్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక కలెక్షన్‌లో మొత్తం 10 రకాల స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లు ఉండగా, ప్రతి మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడం విశేషం. ఈ శతాబ్ది కలెక్షన్‌లోని అన్ని మోటార్‌సైకిళ్లను ప్రత్యేకమైన సెంటెనరీ డిజైన్ అంశాలతో డుకాటి అద్భుతంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా బైక్‌లకు ప్రత్యేకమైన సెంటెనరీ బ్రాంజ్ బ్రేక్ కాలిపర్స్, బ్రాంజ్ ఫినిష్‌తో కూడిన ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ను అమర్చారు. వాహనదారులకు మరింత ప్రీమియం అనుభూతిని ఇవ్వడానికి స్టీరింగ్ హెడ్ , బిల్లెట్ ట్రిపుల్ క్లాంప్‌పై ప్రత్యేక నంబర్డ్ ప్లేట్‌ను ఉంచారు. అలాగే 'Ducati 100' లోగోతో అలంకరించిన విలాసవంతమైన అల్కాంటారా, లెదర్ సీట్లు, బైక్ స్టార్ట్ చేయగానే కనిపించే ప్రత్యేక టీఎఫ్‌టీ స్టార్ట్-అప్ యానిమేషన్ వంటి ఎలిమెంట్లు ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయి. ఈ సరికొత్త కలెక్షన్‌లో భాగంగా విడుదల చేసిన బైక్‌లలో డెజర్ట్ఎక్స్ 100, స్క్రాంబ్లర్ 100 మోడళ్లు మినహా మిగిలిన అన్ని వీ2 (V2) మోడళ్లకు డుకాటి ప్రత్యేక డ్రై క్లచ్ సెటప్‌ను అందించింది. ఈ సరికొత్త టెక్నాలజీ రైడింగ్ అనుభవాన్ని మునుపటి కంటే మరింత స్పోర్టీగా మార్చడమే కాకుండా, బైక్‌కు ఒక ప్రత్యేకమైన రేసింగ్ క్యారెక్టర్‌ను జోడిస్తుంది. వేగంగా ప్రయాణించడాన్ని ఇష్టపడే బైక్ రైడర్లకు ఈ ఫీచర్ ఒక సరికొత్త థ్రిల్‌ను ఇస్తుంది. ఈ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా 'Collezione 100' సిరీస్‌లోని బైక్‌ను సొంతం చేసుకునే కొనుగోలుదారులకు డుకాటి సంస్థ కొన్ని అరుదైన, విలువైన అదనపు బహుమతులను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా బైక్ భద్రత కోసం రియర్ ప్యాడాక్ స్టాండ్, ప్రత్యేకమైన మోటార్‌సైకిల్ కవర్‌తో పాటు ఆ బైక్ ఒరిజినాలిటీని ధృవీకరించే ప్రామాణికత పత్రాన్ని ఇస్తున్నారు. వీటితో పాటు ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ ఆర్టిస్ట్ ఉగో నెస్పోలో స్వయంగా సంతకం చేసిన, ప్రత్యేక నంబర్ కలిగిన రెండు అరుదైన ఆర్ట్ ప్రింట్లను కూడా ఈ గిఫ్ట్ ప్యాక్‌లో అందించడం విశేషం. ఈ వందవ సంవత్సరాల వేడుకల కలెక్షన్‌లో భాగంగా డుకాటి సంస్థ పానిగాలే వీ4 ఎస్ 100, పానిగాలే వీ2 ఎస్ 100, స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్ 100, మాన్‌స్టర్ 100 మోడళ్లను విడుదల చేసింది. వీటితో పాటు ఎక్స్‌డయావెల్ వీ4 100, డయావెల్ వీ4 ఆర్‌ఎస్ 100, మల్టీస్ట్రాడా వీ4 ఆర్‌ఎస్ 100, స్క్రాంబ్లర్ 100, హైపర్‌మోటార్డ్ వీ2 ఎస్‌పీ 100, డెజర్ట్ఎక్స్ 100 వంటి శక్తివంతమైన మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది.

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌-ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో ట్రేడింగ్‌ సమయాలను పొడిగిస్తున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 3 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో సాధారణ ట్రేడింగ్‌ ముగింపు సమయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3:40 గంటలకు మారనుంది. ప్రీ-ఓపెన్‌ సెషన్‌, మార్కెట్‌ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. క్యాష్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్న 'క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌'తో డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ సమయాలను సమలేఖనం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. కొత్త విధానంలో క్యాష్‌ మార్కెట్‌లో మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 గంటల వరకు క్లోజింగ్‌ ఆక్షన్‌ నిర్వహించి, ఆ రోజు అధికారిక ముగింపు ధరను నిర్ణయించనున్నారు. క్లోజింగ్‌ ఆక్షన్‌ సమయంలో ఏర్పడే ధరల మార్పులను దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌అండ్‌ఓ ట్రేడర్లు తమ పొజిషన్లను హెడ్జ్‌ చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి లేదా ఎగ్జిట్‌ కావడానికి అదనంగా 10 నిమిషాల సమయం లభిస్తుంది. దీంతో క్యాష్‌, డెరివేటివ్స్‌ మార్కెట్ల మధ్య ముగింపు సమయాల్లో ఉండే వ్యత్యాసం తగ్గి, ధరల ఆవిష్కరణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ట్రేడ్‌ మాడిఫికేషన్‌ సౌకర్యం సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగుతుంది ఎఫ్‌అండ్‌ఓ క్లోజింగ్‌ ధరల లెక్కింపునకు ఉపయోగించే VWAP విండోను 3:10-3:40 గంటల మధ్య ట్రేడింగ్‌కు అనుగుణంగా సవరించనున్నారు. గత కొంతకాలంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ పలు సంస్కరణలను అమలు చేస్తోంది. 2025 చివర్లో ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో ప్రీ-ఓపెన్‌ సెషన్‌ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు క్లోజింగ్‌ ఆక్షన్‌ వ్యవస్థకు అనుగుణంగా ట్రేడింగ్‌ సమయాన్ని కూడా పొడిగిస్తోంది. మార్కెట్‌ పారదర్శకత, మెరుగైన ధరల నిర్ణయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొంటున్నారు.

పారిస్ సెయింట్-జర్మన్ (పీఎస్జీ) ఛాంపియన్స్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్‌పై ఘన విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్‌లో ఊహించని విధంగా హింస చెలరేగింది. విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అభిమానులు దేశవ్యాప్తంగా అల్లర్లకు దిగడంతో ఫ్రాన్స్ రణరంగంగా మారింది. ఫుట్‌బాల్ అభిమానులకు, పోలీసులకు మధ్య జరిగిన ఈ తీవ్ర హింసాత్మక ఘర్షణల అనంతరం భద్రతా దళాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు 400 మందికి పైగా అల్లరిమూకలను అరెస్ట్ చేశాయి. రాజధాని పారిస్‌ నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఈ గొడవల కారణంగా నగరంలోని బస్సు, రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పెనాల్టీ షూటౌట్లో పీఎస్జీ విజయం సాధించిన వెంటనే వేలాది మంది అభిమానులు పారిస్‌లోని ప్రసిద్ధ 'చాంప్స్-ఎలిసీస్' వీధిలోకి దూసుకువచ్చారు. మొదట్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్న ఈ గుంపు.. చూస్తుండగానే హింసకు దిగింది. రోడ్డుపై ఉన్న ఎలక్ట్రానిక్ బైక్‌లకు నిప్పు పెట్టడమే కాకుండా, దుకాణాల అద్దాలను పగలగొట్టి లూటీలకు పాల్పడ్డారు. ఉద్రిక్తతలను అణచడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ అల్లర్లలో ఆరు వాహనాలు, రెండు దుకాణాలు, ఒక బస్ షెల్టర్ పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. అంతకుముందు పీఎస్జీ హోమ్ గ్రౌండ్ బయట బిగ్ స్క్రీన్‌లపై మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలోనూ అభిమానులు పోలీసులపై దాడికి దిగారు. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 416 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అందులో కేవలం పారిస్ నగరం నుంచే 280 మందిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ హింసను అంతర్గత వ్యవహారాల మంత్రి తీవ్రంగా ఖండించారు. అల్లరిమూకలను అదుపు చేసే క్రమంలో ఏడుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ దేశీయ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ప్రతిపక్ష నాయకురాలు మెరైన్ లీ పెన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. "కేవలం ఫ్రాన్స్‌లో మాత్రమే ఒక ఫుట్‌బాల్ క్లబ్ విజయం అల్లర్లకు దారితీస్తుంది. ప్రజలు తమ జట్టు గెలిచిన రాత్రి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లల్లో దాక్కోవాల్సిన దుస్థితి ఇక్కడ మాత్రమే ఉంది" అంటూ మండిపడ్డారు.

ఎబోలా వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. వైరస్ అవుట్ బ్రేక్ అయినట్టు అధికారికంగా నిర్ధారించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దాని పొరుగున ఉన్న ఉగాండాలో ఎబోలా వైరస్ ప్రబలింది. కాంగోలో 1,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 246 మంది దీని బారిన పడి మరణించారు. ఉగాండాలో తొమ్మిది కేసులు, ఒక మరణం నమోదైంది. ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఈ రెండు దేశాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుత వ్యాప్తికి కారణం బుండిబుగ్యో వైరస్. అరుదైన ఎబోలా రకానికి చెందిన సూక్ష్మ క్రిమి ఇది. దీన్ని అరికట్టడానికి ఎటువంటి చికిత్సలు లేదా టీకాలు ఇప్పటివరకు అందుబాటులో లేవు. కాంగో, ఉగాండాలకు ఎబోలా వైరస్ కొత్తేమీ కాదు. ఇప్పటివరకు 20 సార్లు ఈ వైరస్ ఆయా దేశాల్లో అవుట్ బ్రేక్ అయింది. ఎబోలాలో అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకమైన బుండిబ్యుగో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గేబ్రేయెసస్ ప్రస్తుతం కాంగోలో పర్యటిస్తోన్నారు. ప్రత్యేకించి ఎబోలా వ్యాప్తికి కేంద్రబిందువు అయిన తూర్పు కాంగో ఇటూరి ప్రావిన్స్ లోని బునియాకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన చికిత్సా కేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. కాంగో ప్రధాని జుడిత్ సుమిన్వాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, కొత్త సహాయ నిధులు అందినప్పటికీ, వైరస్ వ్యాప్తి.. అంచనాల కంటే వేగంగా సంభవిస్తోందని తేల్చారు. ఎబోలాను దాని కేంద్రస్థానం అంటే మొదట ఎక్కడ వ్యాప్తి చెందిందో అక్కడే దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోన్నామని ఆయన అన్నారు. సరిహద్దుల మూసివేత, ప్రయాణ నిషేధాలు ఎబోలా వ్యాప్తిని నిరోధించడంలో పెద్దగా ప్రభావం చూపట్లేదని టెడ్రోస్ స్పష్టం చేశారు. ఎబోలా బారిన పడి మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయడంలో అత్యంత జాగ్రత్త అవసరమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఎటువంటి చిన్న పొరపాటు చోటు చేసుకున్నా వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఎబోలాపై పోరాటంలో కాంగో ఒంటరి కాదని, ఈ దేశ ప్రజల వెంట తాము ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. 

మధ్యప్రదేశ్ లోని ఛతర్ పుర్ జిల్లా మహారాజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటిపూర్ గ్రామానికి చెందిన రామ్ మిలాన్ (42) అనే రైతు తన భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నాడు. పెద్ద కూతురు పెళ్లి జూన్ 25న జరగాల్సి ఉంది. చాలా సంవత్సరాల నుంచి భార్య పక్షవాతంతో బాధపడుతోంది. అటు ఆర్థికంగా, ఇటు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. పాపాల నుంచి విముక్తి పొందేందుకు అతడు బాబాగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. తన పొలం దగ్గర జననాంగాన్ని గొడ్డలితో నరుక్కొని దాన్ని బావిలో పడేశాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అతడిని ఛతర్ పుర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో ప్రపంచ నో - టొబాకో దినోత్సవం సందర్భంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పొగాకు వల్ల జరిగే అనారోగ్య పరిస్థితులను వివరించారు. పొగాకు ఏ రూపంలో వాడినా అది క్యాన్సర్ కు దారితీస్తుందని , నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ నందన్, కిమ్స్ లోని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరాజు చెప్పారు. పోగాకు వాడకం వల్ల కుటుంబంపై తీవ్రమైన భారం పెను పరిణామాలు చోటు చేసుకుంటాయని డాక్టర్ రాజు చెప్పారు. ప్రతి ఒక్కరూ పొగాకును దూరంగా ఉంటే చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చని, డాక్టర్ తెలిపారు. పొగాకు వాడడం వల్ల అనేకమంది ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. గడచిన 25 నుంచి 30 సంవత్సరాలుగా తాను ప్రత్యక్షంగా చూసి ఈ మాట చెబుతున్నానని, డాక్టర్ శ్రీనివాసరాజు అన్నారు. ఒక సిగరెట్టు పీల్చడం వల్ల రోజులో ఆయుషు ఏడు గంటలు క్షీణిస్తుందని డాక్టర్ రాజు విశ్లేషించారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తన చావును కోరుకుంటోందని మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించింది. కాగా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం వినేశ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె పతకానికి దూరమైంది. ఆ తర్వాత రెజ్లింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఇటీవల తల్లిగా మారిన అనంతరం తిరిగి మ్యాట్‌పై అడుగు పెట్టాలనుకున్న ఈ హర్యానా అథ్లెట్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో న్యాయపోరాటం చేసిన వినేశ్‌ ఆసియా క్రీడల సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొంది. అయితే, ఇక్కడా ఆమెకు చుక్కెదురైంది. ఎన్నో ఆరోపణలు, మరెన్నో పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వినేశ్‌ అనూహ్య రీతిలో సెమీఫైనల్లో పరాజయం పాలైంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల 53 కేజీల సెమీఫైనల్‌ బౌట్‌లో వినేశ్‌ 4-6 పాయింట్‌ల తేడాతో మీనాక్షి గోయత్‌ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో 'నేను విఫలమయ్యానని భావించడం లేదు. నేను మ్యాట్‌పై కేవలం ప్రత్యర్థితో మాత్రమే పోరాడటం లేదు, మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. ప్రతి పాయింట్‌ కోసం ప్రాణం పెట్టాను. నాకు సరైన అవకాశం లభించలేదు. నాతో పోటీపడి గెలిచిన రెజ్లర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. వాళ్లు నాతో బౌట్‌లో పాల్గొనాలని కలలు కన్నారు. నేను తప్పక తిరిగి వస్తా' అని వినేశ్‌ భావోద్వేగానికి గురైంది. అదే సమయంలో.. 'నేను ఓడిపోయానని తెలిసి డబ్ల్యూఎఫ్‌ఐ అధికారులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. నా చావును కోరుకుంటున్నారు, నేను మొండిదాన్ని పర్లేదు, ఇప్పుడు వాళ్లను సెలబ్రేట్‌ చేసుకోనివ్వండి. నేను చాలా మొండిదాన్ని. నాకు పట్టుదల ఎక్కువ. ఇలాంటి చేదు అనుభవాలే నన్ను మరింత వేగంగా ముందుకు నడిపిస్తాయి. ఇవే నా ప్రయాణానికి ఇంధనాలు. నేను కచ్చితంగా తిరిగి వస్తా. నా ప్రతిభపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రదర్శనతోనే సమాధానం చెప్తా. నేను వీలైనంత త్వరగా చావాలని ఈ రెజ్లింగ్‌ సమాఖ్య కోరుకుంటోంది. ప్రస్తుతానికైతే వారి ఆలోచన ఇదే' అని వినేశ్‌ సంచలన ఆరోపణలు చేసింది. 

జూన్ 1 నుంచి మొబైల్ టారిఫ్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ అదనపు భారం నుంచి తప్పించుకోవడానికి చాలామంది కస్టమర్లు ఇప్పుడే లాంగ్ టర్మ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటూ పాత ధరలనే లాక్ చేసుకుంటున్నారు. నెలవారీ బడ్జెట్ తలకిందులు కాకుండా ఉండాలంటే 'రీఛార్జ్ స్టాకింగ్' ఉత్తమ మార్గం. రిలయన్స్ జియో వినియోగదారులు ముందే మల్టిపుల్ వోచర్లు కొనుగోలు చేసి, అవసరమైనప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లు కూడా అడ్వాన్స్ ప్యాక్‌ల ద్వారా ప్రస్తుత బెనిఫిట్స్‌ను పొడిగించుకోవచ్చు. రోజువారీ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారు 84 రోజులు లేదా వార్షిక ప్లాన్లను ఎంచుకోవడం లాభదాయకం. ఈ ప్లాన్లలో అర్హత కలిగిన ఫోన్ ఉన్నవారికి అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా లభిస్తుంది. రోజువారీ డేటా అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్యాక్ ఎంచుకోవడం ముఖ్యం. ఎక్కువ డేటా వాడేవారికి రోజుకు 2GB ఇచ్చే 84 రోజుల ప్లాన్ ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఇక అర్ధరాత్రి పూట స్ట్రీమింగ్ చేసేవారికి వోడాఫోన్ ఐడియా ఇచ్చే మిడ్‌నైట్ డేటా బెనిఫిట్స్ బాగా ఉపయోగపడతాయి.  ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబాలకు పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు సరైన ఎంపిక. ఎయిర్‌టెల్, జియో వంటి కంపెనీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన ప్లాన్లను అందిస్తున్నాయి. వీటి ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే డేటా పూల్‌ను షేర్ చేసుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వైజాగ్‌లోని లోకల్ ప్రొవైడర్లు తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ ఇస్తున్నారు. 

జాతీయ పక్షి నెమలి గాయపడి, కుంటుకుంటూ రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న వాహనం ఢీకొనడంతో అది ప్రాణాపాయ స్థితికి చేరింది. దీనిని గమనించిన జనం ఆ మూగజీవికి సాయం చేయాల్సింది పోయి, దాని ఈకలను పీక్కోవడంలో తలమునకలయ్యారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. 'మాతృ భూమి'అందించిన కథనం ప్రకారం.. రోడ్డు పక్కన గాయపడి పడి ఉన్న ఆ నెమలిని చూసి జనం అక్కడ గుమిగూడారు. ఆ నెమలి నడవలేక, ఎగరలేక తీవ్ర వేదన అనుభవిస్తుంటే, వారు కనీస మానవత్వం చూపలేదు. అటవీ శాఖ అధికారులకో లేదా వెటర్నరీ వైద్యులకో సమాచారం అందించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో అక్కడున్న కొందరు ఆ నెమలి శరీరం నుంచి బలవంతంగా ఈకలను పీకేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాకవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధలో ఉన్న జీవిని ఆదుకోవడానికి బదులుగా, ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో కరుణ, కనికరం అనేవి లేకుండా పోతున్నాయని, ఇలాంటి ఘటనలు మానవత్వం పతనమవుతున్నదనడానికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా పలువురు అంటున్నారు.

జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల గురించి  ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు. నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. గురిందర్‌వీర్ సింగ్, అనిమేశ్ కుజురు, విశాల్ టికె, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వివిధ విభాగాలలో కొత్త రికార్డులు నెలకొల్పారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ  మాట్లాడుతూ, "మిత్రులారా, దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చించబడుతున్న ఒక ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం రెండు రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ రికార్డు మూడుసార్లు బద్దలైంది. ఈ ఘనత సాధించిన ఇద్దరు అథ్లెట్లు గురిందర్‌వీర్ సింగ్, అనిమేష్ కుజుర్" అని అన్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గురిందర్ వీర్ సింగ్, అనిమేశ్ కుజురులతో ఫోన్లో మాట్లాడారు. వారి అనుభవాలను తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో నిన్న గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. యమన్ చంద్ర, సతీష్ చంద్ర, ధను మృతదేహాలను వెలికి తీసినట్లు జాలర్లు తెలిపారు. గల్లంతైన రాఘవేంద్ర, సంధ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. సరదాగా ఈతకు వెళ్లి నదిలో ఐదుగురు గల్లంతైన విషయం తెలిసిందే. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్ ముకేశ్‌ అంబానీ కిందటేడాది ఏజీఎంలో ప్రకటించిన టైమ్‌లైన్ ప్రకారం, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో జియో మార్కెట్‌లో లిస్ట్ కావాల్సి ఉంది. ఆర్‌ఐఎల్ వార్షిక నివేదికలో దీనిని బలపరుస్తూ, వాటాదారుల భాగస్వామ్యాన్ని మరింత పెంచే వ్యూహాత్మక మార్గాలను వెతుకుతున్నామని అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ (జేపీఎల్‌) లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అత్యధికంగా 66.43 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాలో 17.71 శాతం మెటా, గూగుల్ దగ్గర ఉంది. జియో వాల్యుయేషన్ దాదాపు 130 బిలియన్ డాలర్ల నుంచి 180 బిలియన్ డాలర్ల (రూ. 12.48 లక్షల కోట్ల నుంచి 17.28 లక్షల కోట్ల) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. కంపెనీ ఐపీఓ సైజ్‌ రూ.58 వేల కోట్లు ఉండొచ్చు. ఇది భారతదేశంలోనే ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఆఫర్‌గా నిలవనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫైనాన్షియల్‌గా చూస్తే కూడా జియో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ నికరలాభం 15 శాతం వృద్ధితో రూ.30,053 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.26,120 కోట్లుగా ఉంది.

పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీని ప్రజలు చావగొట్టారు. సోనార్‌పూర్‌లో అభిషేక్‌పై శనివారం దాడి జరిగింది. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఆయనపై దాడి చేశారు. చివరకు పోలీసులు, భద్రతా సిబ్బంది ఆయనకు హెల్మెట్ తొడిగి అక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చొక్కా చింపి, కాళ్లతో తన్నుతూ, కోడిగుడ్లు విసిరేస్తూ స్థానికులు దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన స్థానికులు మాట్లాడుతూ తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, మాకు రోడ్లు ఎప్పుడూ వేయలేదని, వచ్చిన డబ్బంతా దోచుకున్నాడని ఆరోపించారు. ఇప్పటికీ తాము బాధపడుతున్నామని, అందుకే కోపంగా ఉన్నామని చెప్పారు. తాము ఇక్కడే నివసిస్తున్నామని చెప్పారు. మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు రోడ్లు బాగుచేయాలని, నీటి సరఫరా మెరుగుపరచాలని కోరతూ అనేక విన్నపాలు చేసినప్పటికీ, కనీసం పట్టించుకోలేదని చెప్పారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించామని చెబుతున్నారు. తనపై జరిగిన దాడికి బీజేపీ కారణమని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. తనకు జరిగిందంతా ప్రజలు చూశారని, ఇదంతా బీజేపీ కుట్ర అని ఆయన అన్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు లేరని చెప్పారు. ఈ ఘటనకు అధికార పార్టీ కారణమని టీఎంసీ ఆరోపిస్తుండగా, స్థానికులు మాత్రం తామే దాడికి పాల్పడ్డామని, తమకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదని అన్నారు.

రాజస్థాన్‌లోని పలు జిల్లాలను భారీ ఇసుక తుపాను ముంచెత్తింది. దట్టమైన ధూళి మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో వాతావరణం ఒక్కసారిగా అంధకారంగా మారింది. ఇసుక తుపాను అనంతరం భారీ వర్షం కురిసింది. చురు జిల్లాపై అధికంగా ఈ తుఫాను ప్రభావం కనిపించగా, బికనీర్, శ్రీ గంగానగర్ జిల్లాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. సుమారు 30 నిమిషాల పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ గాలులకు ఇసుక భారీగా కొట్టుకొచ్చి రోడ్లు, నివాస ప్రాంతాలను కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రహదారులపై కొన్ని అడుగుల మేర ఇసుక పేరుకుపోయింది.

పాకిస్తాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులతో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉండటం ఈ ఘటన తీవ్రతను మరింత పెంచింది. ఈ ప్రమాదం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని లగ్మన్ ప్రావిన్స్ పరిధిలో కాబూల్-నంగర్‌హర్ ప్రధాన రహదారిపై జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, గంటల తరబడి నిరంతరంగా వాహనం నడిపిన డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ట్రక్కు అదుపు తప్పి రహదారి పక్కనున్న లోతైన కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో భారీ సంఖ్యలో కుటుంబాలు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లగ్మన్ ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి అబ్దుల్ మాలిక్ నియాజాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల్లో 10 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన వారిని నంగర్‌హర్, జలాలాబాద్ ప్రాంతాల్లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారంతా పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులేనని అధికారులు ధృవీకరించారు. 2023లో అక్రమ వలసదారులపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించిన తర్వాత లక్షలాది మంది ఆఫ్ఘన్‌లు తమ స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో నివసిస్తూ అక్కడే జీవనం సాగించిన కుటుంబాలు కూడా బలవంతంగా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇరాన్ కూడా ఆఫ్ఘన్ వలసదారులపై కఠిన చర్యలు చేపడుతుండటంతో వేలాది మంది స్వదేశానికి చేరుకుంటున్నారు. అయితే తిరిగి వచ్చిన వారికి సరైన నివాసాలు, ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదం కూడా అలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనే చోటుచేసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దేశీయ మార్కెట్లో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మిత్సుబిషి కార్ల విక్రయాలను నిలిపివేసినప్పటికీ, కంపెనీకి చెందిన వాహనాలకు ఇప్పటికీ సెకండ్‌హ్యాండ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పజెరో SUV తన ఆఫ్-రోడ్ సామర్థ్యం, డాకర్ ర్యాలీ వారసత్వం, దృఢమైన నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఆటోమొబైల్ అభిమానులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు ఈ ఐకానిక్ SUV తిరిగి రానుందనే సంకేతాలను మిత్సుబిషి అధికారికంగా ఇచ్చింది. మిత్సుబిషి తన సోషల్ మీడియా వేదికల ద్వారా "Pajero/Montero is ready to write its next chapter" అనే సందేశంతో పజెరో, మాంటెరో బ్రాండ్ల పునరాగమనాన్ని ధృవీకరించింది. కంపెనీ విడుదల చేసిన రోడ్‌మ్యాప్ ప్రకారం, పజెరో పేరు ఇకపై ఒక్క మోడల్‌కే పరిమితం కాకుండా పూర్తి స్థాయి SUV బ్రాండ్‌గా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్సుబిషి చివరిసారిగా 2021లో పజెరో పేరును ఉపయోగించింది. ఇప్పుడు ఆ పేరును కొత్త తరం మోడళ్లతో తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజా ప్రణాళికల ప్రకారం, కనీసం రెండు కొత్త పజెరో SUVలు అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి ప్రీమియం ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో కూడిన లాడర్-ఫ్రేమ్ SUVగా ఉండే అవకాశం ఉంది. టీజర్ చిత్రాల ఆధారంగా చూస్తే, కొత్త పజెరో SUVకు మిత్సుబిషి ట్రైటాన్ పికప్ ట్రక్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను అందించే అవకాశం ఉంది.

దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఉద్యోగులు తమ రోజువారీ పనులను పూర్తి చేయడానికి, అలాగే కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టడానికి ఏఐ సాంకేతికతను భారీగా ఉపయోగిస్తున్నాయి. ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ బాడీ 'ACCA' నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ఉద్యోగులు ఏఐని చాలా వేగంగా అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే, ఈ టెక్నాలజీ తెస్తున్న మార్పులు ఒకవైపు ఉత్సాహాన్ని ఇస్తున్నా, మరోవైపు ఉద్యోగాల కోత లేదా లేఆఫ్స్ భయాలను కూడా తీవ్రం చేస్తున్నాయి. సర్వే ప్రకారం ఏఐ ఆధారిత రిక్రూట్‌మెంట్ పారదర్శకంగా , పక్షపాతం లేకుండా ఉంటుందని 52 శాతం మంది భారతీయ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇది ప్రపంచ సగటు (43 శాతం) కంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా యువతరం ఈ టెక్నాలజీని ఎక్కువగా విశ్వసిస్తోంది. 54 శాతం మంది జెన్-జీ యువకులు ఏఐ రిక్రూట్‌మెంట్‌ను సమర్థించగా, జెన్-వైలో 48 శాతం, సీనియర్ ఉద్యోగులైన జెన్-ఎక్స్ లో కేవలం 27 శాతం మంది మాత్రమే దీనిపై నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 57 శాతం మంది ఉద్యోగులు తమ ఆఫీస్ పనుల్లో ఏదో ఒక ఏఐ టూల్‌ను వాడుతున్నారు. అంతేకాదు, 86 శాతం మంది తాము కొత్త ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వడాన్ని పెంచాయి. 2025లో 37 శాతంగా ఉన్న ఈ సపోర్ట్, 2026 నాటికి 50 శాతానికి పెరిగింది. కానీ, ఈ పాజిటివ్ ట్రెండ్ వెనుక ఒక పెద్ద ఆందోళన దాగి ఉంది. సాంకేతికత మారుతున్న వేగం చూసి 53 శాతం మంది భయాందోళనలకు గురవుతున్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందేమో అని 57 శాతం మంది టెన్షన్ పడుతున్నారు. కంపెనీలు ఉద్యోగుల కంటే ఏఐ టూల్స్ పైనే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయని మూడో వంతు మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలో ఏఐ వల్ల జరిగే కొన్ని నష్టాలను కూడా నిపుణులు ఎత్తిచూపారు. పలువురు యజమానులు మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో వచ్చే అప్లికేషన్లను ఫిల్టర్ చేయడానికి పవర్ బిఐ, పవర్ ఆటోమేట్, చాట్‌జిపిటి వంటి టూల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అయితే, ఇదే సమయంలో మంచి ప్రతిభ ఉన్న అభ్యర్థులను కూడా ఏఐ సిస్టమ్స్ పొరపాటున రిజెక్ట్ చేస్తున్నాయని, కాబట్టి ఫైనల్ డెసిషన్ ఎప్పుడూ మనుషుల చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ హాలూసినేషన్స్, డేటా ప్రైవసీ సమస్యలు కూడా కంపెనీలను కలవరపెడుతున్నాయి. ఈ ఏఐ ఎకానమీలో నిలదొక్కుకోవాలంటే అటు ఉద్యోగులు, ఇటు కంపెనీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులు ఏఐ వల్ల తమ ఉద్యోగం పోయే వరకు ఆగకుండా, ముందే ఆ టూల్స్‌ను ఎలా వాడాలో నేర్చుకుని, తమ పని సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అలాగే యజమానులు.. రొటీన్ , బోరింగ్ పనులను మాత్రమే ఏఐకి అప్పగించి, మనుషుల సృజనాత్మకత , విచక్షణ, బాధ్యత అవసరమయ్యేలా ఉద్యోగాలను రీడిజైన్ చేయాలి. టెక్నాలజీ చాలా వేగంగా దూసుకుపోతోంది. దానికి తగ్గట్టుగా సరైన గైడ్‌లైన్స్  నిర్మించుకుంటూ మనల్ని మనం అప్‌డేట్ చేసుకోకపోతే వెనుకబడిపోవడం ఖాయం,

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్‌ను పార్టీ ఎమ్మెల్యేలు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ముఖ్యమంత్రిగా  డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేస్తారు. నేటి రాత్రికి ఢిల్లీ వెళ్లి  రేపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని కలుస్తారు. కేబినెట్ కూర్పు, సిద్ధరామయ్య మద్దతు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల కేటాయింపులపై చర్చిస్తారని తెలుస్తోంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని కులాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేలా క్యాబినెట్‌ను రూపొందించాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. సిద్ధరామయ్య నాయకత్వంలో మంచి పని చేసిన ప్రభుత్వం కొనసాగింపుగా డీకే శివకుమార్ సామాజిక సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయనున్నారు. 

అమెరికాలో గుజరాత్ కు చెందిన 27 ఏళ్ల కావన్ కుమార్ పటేల్ అనే యువకుడు, మానవ అక్రమ రవాణాదారులతో చేతులు కలిపి ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు రుజువైంది. ఈ ఘోర నేరానికి గాను అమెరికా న్యాయస్థానం అతడికి 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించినట్లు యూఎస్ అటార్నీ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహా నగరంలో ఉన్న ‘అమెరిక్ఇన్’ అనే హోటల్లో కావన్ కుమార్ పటేల్ పని చేసేవాడు. గత ఏడాది జనవరి 2వ తేదీన ఈ హోటల్లో ఒక దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దొంగతనం కేసును దర్యాప్తు చేయడానికి అక్కడికి చేరుకున్న ఒమాహా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హోమ్ ల్యాండ్  సెక్యూరిటీ టాస్క్ఫోర్స్ అధికారులకు అక్కడ ఊహించని దారుణం వెలుగుచూసింది. హోటల్ గదుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక భారీ లైంగిక అక్రమ రవాణా ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. అక్కడ బంధీలుగా ఉన్న 15, 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను టాస్క్ ఫోర్స్  అధికారులు సురక్షితంగా రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి వాణిజ్యపరమైన వ్యభిచారం కోసం ఆ బాలికలను అక్రమంగా తరలించి, ఈ హోటల్నే వారి స్థావరంగా మార్చుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితుడైన కావన్ కుమార్ పటేల్ ప్రవర్తించిన తీరు అత్యంత క్రూరంగా ఉంది. కొందరు మానవ అక్రమ రవాణాదారులు సదరు మైనర్ అమ్మాయిలను తీసుకుని హోటల్ కు  వచ్చినప్పుడు, వారికి తక్కువ ధరకే గదులు కేటాయించాలని హోటల్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. తాము ఇక్కడే ఉండేందుకు అనుమతిస్తే, ఆ బాలికలను వాడుకోవచ్చని ఎర వేశారు. దీనికి లోబడిన కావన్ కుమార్, హోటల్ కు చెందిన క్యాష్ బాక్స్ నుంచే డబ్బులు దొంగిలించి ఆ మానవ అక్రమ రవాణాదారులకు ఇచ్చాడు. ఆ తర్వాత హోటల్ గదిలోనే ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి సహకరించినందుకు, హోటల్ యజమాన్యానికి తెలియకుండా సదరు నిర్వాహకులను, బాలికలను చాలా రోజుల పాటు అక్కడే ఉండటానికి హోటల్ సిబ్బంది అనుమతించారు. ఈ మానవ అక్రమ రవాణా ముఠా ఆన్లైన్లో వివిధ రకాల ప్రకటనలు ఇస్తూ విటులను ఆకర్షించేవారని యూఎస్ అటార్నీ కార్యాలయం పేర్కొంది. అక్రమ రవాణాదారుల చేతికి చిక్కిన ఆ మైనర్ బాలికలకు కనీసం సరైన ఆహారం కూడా ఇవ్వకుండా తీవ్రంగా వేధించేవారు. వారు చెప్పినట్లు వినకపోతే మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తూ దయనీయ స్థితిలోకి నెట్టేసేవారని దర్యాప్తులో తేలింది. "నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ చిన్నారి పిల్లలను మా టాస్క్ ఫోర్స్ సకాలంలో రక్షించగలిగింది" అని యూఎస్ అటార్నీ లెస్లీ వుడ్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దర్యాప్తు ప్రక్రియలో నిందితుడు కావన్ కుమార్ పటేల్ అమెరికాలో చట్టబద్ధమైన వీసా లేకుండా అక్రమంగా నివసిస్తున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు అతడికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా, శిక్షా కాలం పూర్తి కాగానే ఒక్క రోజు కూడా అక్కడ ఉంచకుండా వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఆదేశించింది.  ఈ కేసులో ప్రధాన అక్రమ రవాణాదారులైన ఎడ్వర్డో జోస్ పెర్డోమో, మైఖేల్ మార్టినెజ్ గోంజాలెజ్, ఆల్ఫ్రెడో జాంబ్రానో హుర్టాడోలతో పాటు.. ఈ దారుణంలో భాగస్వామ్యులైన సుమిత్ చౌదరి, విశాల్ గోస్వామి అనే మరో ఇద్దరు భారతీయ సంతతి హోటల్ ఉద్యోగులపై కూడా అమెరికా కఠిన చట్టాల ప్రకారం విచారణ జరిపి కఠినమైన శిక్షలు ఖరారు చేయనున్నారు.

హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ బ్యూరో సీఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈరోజు నాంపల్లిలోని సైబర్ క్రైమ్ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేసిన దాడిలో ఓ బాధితుడి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ ఏసీబీ వలకు చిక్కారు. కార్యాలయంలోనే సీఐ మహేందర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న సీఐ మహేందర్ బాధితులు ఇంకెంతమంది ఉన్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. గతంలో ఎవరెవరి దగ్గర నుండి ఇలా వసూళ్లకు పాల్పడ్డారు? ఈ కేసులో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీఐ మహేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించనున్నట్లు సమాచారం.

గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన కిరిత్ పటేల్ అనే వ్యక్తి, తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సూరత్ జిల్లా కలెక్టర్‌కు ఒక లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాడు. సుదీర్ఘ కోర్టు గొడవలు, నిరంతర మానసిక వేదనల వల్ల తనకు చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆ అర్జీలో ఆయన పేర్కొన్నాడు. కిరిత్ పటేల్ ఆరోపణల ప్రకారం ఇంట్లో చిన్నపాటి గొడవలు జరిగినప్పుడల్లా ఆయన భార్య మహిళా రక్షణ చట్టాలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతోంది. కావాలనే ఇంట్లో గొడవలు సృష్టించి, ఆ వెంటనే పోలీసులకు లేదా మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి భర్తను, ఆయన కుటుంబాన్ని ఇరికించేదని వాపోయాడు. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిరూపణ కావాల్సి ఉంది. కిరిత్ పటేల్‌కు ఇదివరకు జరిగిన పెళ్లి ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాబును చంపడానికి సైతం తన భార్య ప్రయత్నించిందని పటేల్ ఆరోపించాడు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా, వారు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వీరిద్దరి పెళ్లిళ్ల చరిత్ర ఇప్పుడు పోలీసులను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిరిత్ పటేల్‌కు, అలాగే అతని భార్యకు కూడా ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. వీరి వివాహం 2024 నవంబర్ 14న జరిగింది. పెళ్లయినప్పటి నుంచి తన భార్య, అత్త, ఆమె బంధువులు కలిసి డబ్బుల కోసం తనను తీవ్రంగా వేధిస్తున్నారని పటేల్ తెలిపాడు. నా భార్య కేవలం డబ్బుల కోసమే పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసే ముఠాకు చెందినది. గతంలో చేసుకున్న ఇద్దరు భర్తలను కూడా ఇలాగే కోర్టు కేసులు, భారీగా డబ్బుల డిమాండ్లతో వేధించి వదిలేసింది. ఇప్పుడు నన్ను కూడా అదే తరహాలో భరణం, గృహహింస కేసులతో వేధిస్తూ నరకం చూపిస్తోందంటున్నాడు. కుటుంబ కలహాలు, భార్యల వేధింపులు ఎదుర్కొనే పురుషులకు చట్టపరంగా ఎలాంటి రక్షణ లభించడం లేదని కిరిత్ పటేల్ తన దరఖాస్తులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కేవలం హామీలే ఇస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందాడు. అందుకే సూరత్ కలెక్టర్ కార్యాలయంలో కారుణ్య మరణం కోసం దరఖాస్తు ఇచ్చానని, ఈ మానసిక నరకం అనుభవించడం కంటే చావడమే మేలని ఆయన పేర్కొన్నాడు. 

దేశీయ మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మోడల్ వై కారు ధరను ఏకంగా రూ.9 లక్షల మేర తగ్గించింది. దేశంలో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోవడంతో కంపెనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ఆటోమొబైల్ రంగంలో గట్టి పోటీని ఎదుర్కొనేందుకు సదరు సంస్థ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ధరలతో మార్కెట్లోకి వస్తోంది. ఈ భారీ తగ్గింపుతో మోడల్ వై ప్రారంభ ధర ఇప్పుడు ప్రీమియం కొనుగోలుదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. ధరల తగ్గింపుతో పాటు భారతదేశంలో తన కార్ల శ్రేణిని కూడా టెస్లా పునర్వ్యవస్థీకరించింది. కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతూ పాత వాటి స్థానంలో మార్పులు చేసింది. గత కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లో ఈ కార్ల అమ్మకాలు చాలా మందకోడిగా సాగుతున్నాయి. భారీ ధరల కారణంగా చాలా మంది వాహన ప్రియులు ఇతర కంపెనీల వైపు మొగ్గు చూపారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కంపెనీ యాజమాన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టెస్లా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని ఇతర లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా టాటా, మహీంద్రా వంటి స్థానిక సంస్థలతో పాటు జర్మన్ కార్ల తయారీ సంస్థలకు ఇది గట్టి పోటీని ఇస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ధరల యుద్ధం ప్రారంభం కావడం వల్ల అంతిమంగా వినియోగదారులకే ఎక్కువ లాభం చేకూరనుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఈ తగ్గింపు మార్కెట్ గమనాన్ని పూర్తిగా మార్చవచ్చు. చౌక ధరలకే అత్యాధునిక సాంకేతికత కలిగిన కార్లను అందించడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవాలని టెస్లా యోచిస్తోంది. రానున్న రోజుల్లో షోరూమ్‌లలో బుకింగ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా అంతర్జాతీయ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంస్థ భారత్‌లో పట్టు సాధించేందుకు ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి. 

దేశంలో సిజేరియన్ (సి-సెక్షన్) ప్రసవాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సి-సెక్షన్ ప్రసవాల రేటు గణనీయంగా పెరుగుతోంది. జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రేటు అత్యధికంగా నమోదైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాల రేటు జమ్మూ కశ్మీర్‌లో 90 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 87.7 శాతం, తెలంగాణలో 84 శాతంగా నమోదైంది. దీంతో ఈ రాష్ట్రాలు దేశంలోనే అత్యధిక సి-సెక్షన్ ప్రసవాలు జరిగే రాష్ట్రాలుగా నిలిచాయి. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 84 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 66 శాతంగా ఉంది. అలాగే అస్సాంలో 81.4 శాతం, ఒడిశాలో 76.8 శాతం ప్రసవాలు సి-సెక్షన్ ద్వారా నమోదయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2005-06లో దేశవ్యాప్తంగా సి-సెక్షన్ ప్రసవాల రేటు 8.5 శాతంగా ఉండగా, 2015-16 నాటికి అది 17.2 శాతానికి చేరింది. 2019-21లో ఈ సంఖ్య 21.5 శాతంగా నమోదైంది. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో జరిగే మొత్తం ప్రసవాల్లో 27.2 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాల పెరుగుదల ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే తక్కువగా ఉండటం గమనార్హం. సాధారణ ప్రసవ సమయంలో కలిగే నొప్పిపై చాలా మంది మహిళల్లో భయం ఉంటుంది. కుటుంబ సభ్యులు లేదా పరిచయస్తుల అనుభవాలు విని కొందరు గర్భిణీలు సహజ ప్రసవానికి వెనుకాడుతూ సిజేరియన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రసవ సమయంలో బిడ్డకు ఏదైనా సమస్య తలెత్తుతుందేమోననే భయం కుటుంబాల్లో ఉంటుంది. ఈ కారణంగా కొందరు వైద్యులను సిజేరియన్ ప్రసవం చేయాలని కోరుతుంటారు. సి-సెక్షన్ ద్వారా ప్రసవ తేదీ, సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులు తమ ఏర్పాట్లను సులభంగా చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం కూడా సిజేరియన్ ప్రసవాల పెరుగుదలకు ఒక కారణంగా భావిస్తున్నారు. ప్రసవ పద్ధతిని కేవలం భయం, సౌకర్యం లేదా వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా నిర్ణయించకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తర్వాత వైద్యుల సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. తల్లి లేదా శిశువు ఆరోగ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు సిజేరియన్ ప్రసవం సురక్షితమైన, అవసరమైన ఎంపికగా మారుతుంది. అయితే వైద్యపరంగా సహజ ప్రసవం సాధ్యమైనప్పుడు కేవలం నొప్పి భయం లేదా ముందస్తు ప్రణాళిక కోసం సి-సెక్షన్‌ను ఎంచుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలపై గత కొన్ని రోజులుగా వలసదారుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. గ్రీన్ కార్డ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దరఖాస్తుదారులు అమెరికాను విడిచిపెట్టి తమ స్వదేశాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుందని ఇటీవల ప్రచారం జరగడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగి ఒక కీలకమైన స్పష్టతను జారీ చేసింది. ప్రస్తుత వలస విధానంలో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదని, గ్రీన్ కార్డ్ ప్రక్రియ సమయంలో దరఖాస్తుదారులు అమెరికాలోనే ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. యు.ఎస్. పౌరసత్వం, వలస సేవల సంస్థ ఇటీవల జారీ చేసిన ఒక అంతర్గత మార్గదర్శక ప్రకటనతో ఈ వివాదం మొదలైంది. ఆ ప్రకటనను విశ్లేషించిన నిపుణులు, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు సాధారణంగా యునైటెడ్ స్టేట్స్ విడిచిపెట్టి తమ స్వదేశాలలో వేచి ఉండాల్సి వస్తుందని, కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే అమెరికాలో ఉండటానికి అనుమతిస్తారని భావించారు. ఈ వార్త వలసదారులు, ముఖ్యంగా ఐటీ నిపుణులు, వలస హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలలో తీవ్ర కలకలం రేపింది. తమ ఉద్యోగాలు, కుటుంబాల పరిస్థితి ఏంటో తెలియక వేలాది మంది ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళనలపై శుక్రవారం స్పందించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఎలాంటి వ్యూహాత్మక లేదా పెద్ద విధాన మార్పులు లేవని తేల్చి చెప్పింది. ప్రతి కేసును వ్యక్తిగతంగా పరిశీలించి, దరఖాస్తుదారుని అమెరికాలోనే ఉంచాలా లేదా విదేశాలకు పంపాలా అని నిర్ణయించే విచక్షణాధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఇప్పటికే ఉందని గుర్తు చేసింది. అధికారులకు వారి ప్రస్తుత అధికారాలను పునరుద్ఘాటించడానికి మాత్రమే ఇటీవలి మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. అంతేగానీ దరఖాస్తుదారులందరిపై ఎలాంటి కొత్త నిబంధనలను, ఆంక్షలను విధించడం తమ ఉద్దేశం కాదని డీహెచ్ఎస్ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. వైట్ హౌస్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా ఈ మొత్తం విషయాన్ని ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియగా అభివర్ణించారు. ఇది అమెరికా వలస విధానంలో ఎలాంటి పెద్ద మార్పుకు సంకేతం కాదని, ఇప్పటికే ఉన్న హక్కులను కొనసాగించడమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా ప్రకటన ప్రకారం, అత్యధిక శాతం దరఖాస్తుదారులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. వారి గ్రీన్ కార్డ్ దరఖాస్తులు సమీక్షలో ఉన్నప్పుడు కూడా వారు యునైటెడ్ స్టేట్స్‌లోనే సురక్షితంగా ఉండటానికి అనుమతిస్తారు. దీని అర్థం, గణనీయమైన సంఖ్యలో దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లవలసిన అవసరం రాదు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు వర్తిస్తాయి. ఉదాహరణకు తమ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా చట్టవిరుద్ధంగా దేశంలోనే కొనసాగుతున్నవారు. లేదంటే ఇతర ఇమ్మిగ్రేషన్ ఉమ్మడి నిబంధనలను ఉల్లంఘించినవారు, ఇలాంటి వారి వ్యక్తిగత కేసులను పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకుంటారని, అది కూడా పాత నిబంధనల ప్రకారమే జరుగుతుందని వివరించారు. అమెరికా ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన ఈ వివరణ యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అత్యంత గణనీయమైన ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని బ్యాక్‌లాగ్‌లో ఉన్నవారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. కోటా నిబంధనల వల్ల భారతీయులకు గ్రీన్ కార్డ్ లభించడానికి తరచుగా సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. ఒకవేళ పాత ప్రచారం నిజమై ఉంటే, వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను, కుటుంబాలను వదిలేసి భారత్‌కు తిరిగి రావలసి వచ్చేది. కానీ తాజా స్పష్టతతో, భారతీయులు తమ గ్రీన్ కార్డ్‌ల కోసం వేచి ఉన్న సమయంలోనూ అమెరికాలోనే నివసిస్తూ, అక్కడ సంతోషంగా పని చేసుకోవచ్చు. తమ పిల్లల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించవచ్చు. కుటుంబాలతో కలిసి జీవించవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని దొంగపిండి గ్రామం వద్ద ఇసుక లారీ వెళ్తుండగా వంతెనఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీతో సహా వంతెన కుంగిపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ వంతెన కూలిపోవడంతో దొంగపిండి గ్రామానికి రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకే ఈ మార్గమే ఉండటంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్య సేవల కోసం నానా పాట్లు పడుతున్నారు. గ్రామానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

దేశీయ మార్కెట్‌లో బోట్ నుంచి స్టోర్మ్ కాల్ 4, అల్టిమా వోగ్ 2 అనే పేరుతో రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు విడుదల అయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా డైరెక్ట్ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇవి రావడం విశేషం. ప్రతిదానికీ విడిగా ఛార్జర్ వెతుక్కునే తిప్పలు లేకుండా ఫోన్ కేబుల్‌తోనే వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు.  బోట్ స్టోర్మ్ కాల్ 4 రూ.1,599కే లభిస్తుండగా, ప్రీమియం లుక్ ఉన్న అల్టిమా వోగ్ 2 ధరను రూ.2,799గా నిర్ణయించారు. స్టోర్మ్ కాల్ 4 ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభం కాగా, జూన్ 12 నుండి ఇవి మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరలో వచ్చే స్టోర్మ్ కాల్ 4 మోడల్‌ 1.96 ఇంచుల పెద్ద హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 12 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి అన్ని రకాల హెల్త్ ఫీచర్లతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. స్టైలిష్, ప్రీమియం లుక్ కోరుకునే వారి కోసం అల్టిమా వోగ్ 2 బాగా నచ్చుతుంది. దీనిలో 1.96 ఇంచుల బ్రైట్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు మెటాలిక్ ఫ్రేమ్ డిజైన్ ఇచ్చారు. ఇది 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. మిగిలిన హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లన్నీ స్టోర్మ్ కాల్ 4 లాగే ఇందులోనూ కొనసాగించారు.

ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఈ వారాంతం పర్యాటకులతో పోటెత్తాయి. జోషిమఠ్, ముస్సోరీతో పాటు ప్రధాన పర్యాటక రహదారులన్నీ వాహనలతో కిక్కిరిసిపోయాయి.45 డిగ్రీల ఎండ నుంచి ఉపశమనం పొందడానికి వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకోవడంతో పర్వత మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. జోషిమఠ్‌ వద్ద పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ వాహనాలు దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు స్తంభించిపోయాయి. పర్యాటకులు గంటల తరబడి తమ వాహనాల్లో చిక్కుకుపోయారు. ముస్సోరీలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. నైనిటాల్‌లో సందర్శకుల సంఖ్య పెరగడంతో హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేలాది వాహనాలతో హిమాలయాలు ప్రపంచంలోనే అతి పొడవైన పార్కింగ్ స్థలంగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. విష్ణుప్రయాగ్ నుండి 15 కిలోమీటర్ల అవతలి వరకు పర్యాటకులు గంటల తరబడి తమ కార్లలో చిక్కుకుపోయారని హిమాలయన్ హిందూ అనే ఎక్స్ యూజర్ ఓ వీడియోను షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, రోహ్‌తంగ్‌లతో పాటు ఉత్తరాఖండ్‌లోని నైనితాల్, బద్రినాథ్, హేమకుండ్ సాహిబ్, ఔలి, జోషిమఠ్ వంటి ప్రదేశాల్లో ప్రస్తుతం పర్యాటకులు, యాత్రికుల రికార్డు స్థాయి రద్దీ కనిపిస్తోంది. పర్వతాలపై ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మంచు కురిసిన దృశ్యాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రజలు సుదీర్ఘ ప్రయాణాలను, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లను భరిస్తూ పర్వత ప్రాంతాలకు వెళ్తున్నారు.

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలైయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ తరపున తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ పరీక్షను నిర్వహించింది. మే 12న జరిగిన ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వివిధ సెషన్లలో వేలాది అభ్యర్థులు పాల్గొన్నారు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.inలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫలితాలు B.Ed కోర్సు ప్రవేశాలకు కీలకం. అర్హత సాధించిన అభ్యర్థులు త్వరలోనే వచ్చే కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని సీట్లు పొందవచ్చు. ర్యాంక్ ఆధారంగా కాలేజీలు, సీట్ల కేటాయింపు జరుగుతుంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది పోటీ మరింత తీవ్రంగా ఉంది.అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంక్, క్వాలిఫైంగ్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. ఈ ఫలితాలు ఉపాధ్యాయ వృత్తి వైపు మరో ముందడుగు వేసిన అభ్యర్థులకు గొప్ప అవకాశం కల్పిస్తాయి.

3