జూన్ 1 నుండి రైల్వే స్టేషన్లలో చిరు వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాల పెంపునకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. తాజాగా పెరిగిన ధరలు చూసుకుంటే 50 గ్రాముల ఆలూ వడ ధర రూ. 15 కు చేరనుంది. దీనితో పాటు ఇచ్చే ఒక పావ్ ధర రూ. 5 గా ఉంటుంది. వెజ్ సమోసా, వెజ్ పఫ్, సాబుదానా వడ ధరలు రూ. 20 కి పెరిగాయి. అలాగే పావ్ భాజీ ధర రూ. 50 కి చేరింది. వెజ్ పిజ్జా కూడా ఇప్పుడు రూ. 50 కే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణ సమయంలో ఈ ఐటమ్స్ చాలా పాపులర్. నార్త్ ఇండియన్ ఫుడ్‌తో పాటు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ఒక మసాలా దోశ కొనాలంటే రూ. 35 చెల్లించాలి. అలాగే సాంబార్, చట్నీతో కూడిన 2 ఇడ్లీలు కొనాలంటే రూ. 30 చెల్లించాలి. రైల్వే స్టేషన్లలో దోశ, ఇడ్లీలను ప్రయాణికులు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే రైల్వే శాఖ అన్ని రకాల ఆహారాల ధరలను పెంచలేదు. కేవలం కొన్నింటిపై మాత్రమే ధరలను పెంచింది. గతంలో మాదిరిగానే మిసల్ పావ్ రూ. 35 కే లభిస్తుంది. కచోరీ కూడా పాత రేటు అంటే రూ. 15 లకే లభిస్తుంది. అలాగే దాబేలీ గతంలో మాదిరే రూ. 20 గా ఉంది. మిగతా ఆహార పదార్థాలు పాత రేట్లకే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ధరలు పెంచినందున ఆహార నాణ్యతను ఖచ్చితంగా పెంచాలని రైల్వే స్పష్టం చేసింది. నాణ్యతను తనిఖీ చేయడానికి రైల్వే అధికారులు రెగ్యులర్‌గా వస్తారని తెలిపింది. అలాగే ప్రయాణికుల నుండి అదనపు వసూళ్లను అరికట్టడానికి, ప్రతి స్టాల్ యజమాని రెండు భాషలలో స్పష్టంగా కనిపించేలా రేట్ లిస్ట్‌ను బోర్డుపై ఏర్పాటు చేయాలని తెలిపింది.
0 Comments