Ad Code

పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్


న్యూ జల్పాయ్‌గురి నుంచి చెన్నై వెళ్తున్న ట్రైన్ నెంబర్ 22612, చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒడిశా లోని జాజిపూర్ జిల్లా, జఖపురా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒక ఏసీ కోచ్, రెండు జనరల్ కోచ్‌లు ట్రాక్ నుంచి ఓ పక్కకు ఒరిగాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు ధృవీకరించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే భద్రక్ నుంచి సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పట్టాలు తప్పిన కోచ్‌లలోని ప్రయాణికులను ఇతర బోగీల్లోకి పంపి వారిని తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదం కారణంగా న్యూ జల్పాయ్‌గురి - చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.

Post a Comment

0 Comments

Close Menu