Posts

Showing posts with the label Former Chief Minister Siddaramaiah proposed

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నిక

Image
క ర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్‌ను పార్టీ ఎమ్మెల్యేలు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ముఖ్యమంత్రిగా  డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేస్తారు. నేటి రాత్రికి ఢిల్లీ వెళ్లి  రేపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని కలుస్తారు. కేబినెట్ కూర్పు, సిద్ధరామయ్య మద్దతు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల కేటాయింపులపై చర్చిస్తారని తెలుస్తోంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని కులాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేలా క్యాబినెట్‌ను రూపొందించాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. సిద్ధరామయ్య నాయకత్వంలో మంచి పని చేసిన ప్రభుత్వం కొనసాగింపుగా డీకే శివకుమార్ సామాజిక సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయనున్నారు.