Posts

Showing posts with the label E20 Controversy

E20 వివాదం : తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమైన నితిన్ గడ్కరీ

Image
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా తాను, తన కుటుంబం లాభపడుతున్నారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు గడ్కరీకి సివిల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మీద మాత్రమే కాకుండా.. ఎక్స్, గూగుల్ వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు, పేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ వీడియోలు, మార్పింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం అవుతున్నాయి. వీటిలో ఈ20 ఇథనాల్ కార్యక్రమం వల్ల తనకు, తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నట్లు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని గడ్కరీ తెలిపారు. ప్ర...