Posts

Showing posts with the label Comet C/2024 E1 is approaching Earth's orbit

అంతరిక్షం లో కనువిందు చేయబోతున్న అద్భుతం : భూ కక్ష్యకు దగ్గర రాబోతున్న C/2024 E1 తోక చుక్క

Image
ఖ గోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. మన జీవిత కాలంలో ''తోక చుక్కల''ను కనీసం ఒకసారి కూడా చూసే అవకాశం ఉండదు. అలాంటి ఒక తోకచుక్క, భూ కక్ష్యకు దగ్గర రాబోతోంది. C/2024 E1 (వియర్జోష్) అనే తోకచుక్క ఆకాశంలో దర్శనం ఇవ్వనుంది. ఇది సౌర కుటుంబం వెలుపలి నుంచి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్కనున 2024 మార్చిలో పోలాండ్ ఖగోళ శాస్త్రవేత్త కాస్పర్ వియర్జోష్ కనుగొన్నారు. ఇది ఓర్ట్ క్లౌడ్ అనే చాలా దూర ప్రాంతం నుంచి వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల నుంచి మంచు పదార్థం కలిగిన ఖగోళ వస్తువులు ఉంటాయి. ఈ తోకచుక్క ప్రయాణ మార్గం సాధారణంగా లేదు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఇది సౌరకుటుంబం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే దీనిని ఒకసారి మాత్రమే చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరి 20, 2026న సూర్యుడికి అత్యంత దగ్గరగా వచ్చింది. జనవరి 1, 2026లో శుక్రగ్రహానికి దగ్గరగా వెళ్లింది. ఫిబ్రవరి 17, 2026 భూమి కక్ష్యకు సమీపంగా వస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ తోకచుక్కలో ప్రధానం కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉంది. సాధారణంగా కనిపించే తోకచుక్కల్లో కనిపించే కార్బన్ మోనాక్...