Posts

Showing posts with the label 560 crore to the IT and telecom sectors

బడ్జెట్‌లో ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్ల కేటాయింపు

Image
2026-27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లను కేటాయించారు. దీంతోపాటు ఏఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం, విద్య, ఉద్యోగ, వ్యవసాయం కోసం ఉపయోగించడం. రైతుల కోసం భారత్‌ విస్తార్‌ ఏఐ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతులకు వర్షాభావం, తెగుళ్లు గురించి సమాచారం అందించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా రైతులకు స్మార్ట్‌, డేటా ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు తమ భాషలనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒకే పంటపై రైతులు ఆధారపడకుండా, ప్రాంతానికి, సీజన్‌కు తగిన పంటలు పండించేలా ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దీని వల్ల రైతుల ఆదాయం వృద్ధి చెందడమే కాకుండా, గ్రామాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీంతోపాటు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఊరటనిచ్చేలా కీలక ప్రకటన చేశారు. ఏకంగా 2047 వరకు ట్యాక్స్‌ హాలీడే ప్రకటించారు. దీంతో క్లౌడ్‌ సర్వీసులు అందించే సంస్థలకు భారీ ప్రయోజనం కలగనుంది. లగ్జరీ వాచ్‌ల ధరలు పెరగనున్నాయి. దేశీయంగా బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ఈవీ బ్యాటరీల తయారీని వినియోగించే 3...