Posts

Showing posts with the label 'Al Salmi'—a massive crude oil tanker belonging to Kuwait

కువైట్‌ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడి

Image
కు వైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ భీకర దాడిచేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఈ ఘటనను ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. కువైట్‌కు చెందిన 'అల్‌ సల్మీ' అనే భారీ ముడిచమురు నౌక దుబాయ్‌ పోర్టు వద్ద ఉంది. దీనిపై ఇరాన్‌ డ్రోన్‌తో దాడి చేయగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ 24 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధ్రువీకరించారు. అయితే దాడి సమయంలో ట్యాంకర్‌ నిండా చమురు ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర జలాల్లో చమురు ఒలికే ప్రమాదం ఉందని కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఘటనను దుబాయ్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.