హైదరాబాద్ మెట్రో టికెట్ల జారీ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్ : ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
హై దరాబాద్ మెట్రో టికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్లు మూసివేసి, టికెట్ వెండింగ్ మెషీన్లు ద్వారానే తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు కౌంటర్ మూసి ఉండటంతో అక్కడి సిబ్బందిని సంప్రదించగా, పక్కనే ఉన్న డిజిటల్ యంత్రంలో తీసుకోవాలని చెప్పారు. అయితే ఆ యంత్రం వినియోగంపై అవగాహన లేకపోవడంతో ప్రయాణి కుడు కొంతసేపు అక్కడే ఇబ్బంది పడ్డారు. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ టికెట్ జారీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అందరికీ అవగాహన ఉండదని ప్రయాణికులు వాదిస్తున్నారు. వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు, స్మార్ట్‌ఫోన్ లేదా డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేని వారు టికెట్ కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కౌంటర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమీర్‌పేట్, మియాప...