Posts

Showing posts with the label Amazon Suspends Services

ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న యూఏఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్

Image
ఇ రాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడుల్లో యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ దెబ్బతింది. దీంతో అమెజాన్ తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కువైట్, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అమెజాన్ క్లౌడ్ విభాగం వెబ్ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 1, 2026 ఆదివారం తెల్లవారుజామున యూఏఈలోని డేటా సెంటర్‌లోకి ఏదో ఒక వస్తువు (మిస్సైల్ లేదా డ్రోన్ శకలాలు) వచ్చి బలంగా ఢీకొట్టింది. దీనివల్ల డేటా సెంటర్‌లో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి భారీగా మంటలు వ్యాపించాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా ఆ సెంటర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కార్యకలాపాలను పూర్తిగా మూసివేసినట్లు అమెజాన్ ధ్రువీకరించింది.