భారత్‌లోకి డెంజా బ్రాండ్‌ను తీసుకొచ్చేందుకు బివైడి ప్రణాళికలు
దే శీయ మార్కెట్లోకి చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడికి చెందిన డెంజా బ్రాండ్‌ను తీసుకొచ్చేందుకు బివైడి ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. నిజానికి 2010లో బివైడి, ప్రముఖ దిగ్గజ సంస్థ మెర్సిడేస్ బెంజ్ గ్రూప్ కలిసి ఉమ్మడిగా ఈ డెంజా బ్రాండ్‌ను ప్రారంభించాయి. అయితే ఆ తర్వాత ఈ భాగస్వామ్యం నుంచి మెర్సిడేస్ బెంజ్ తప్పుకోవడంతో, బివైడి ఈ బ్రాండ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని, ఒక సూపర్ లగ్జరీ , ప్రామిసింగ్ హై-ఎండ్ బ్రాండ్‌గా రూపుదిద్దింది. బివైడి ఇప్పటికే ఉన్న తన వాహనాల రేంజ్ కంటే పైన, అంటే అత్యంత ఖరీదైన ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ డెంజా కార్లను నిలబెట్టాలని చూస్తోంది. మనదేశంలో బివైడి రూ. 20 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్‌లో కార్లను విక్రయిస్తుండగా, రూ. 80 లక్షలు దాటిన లగ్జరీ సెగ్మెంట్‌ను డెంజా కార్లతో భర్తీ చేయనుంది. ఆటోకార్ ఇండియా సమాచారం ప్రకారం, కంపెనీ ప్రారంభంలో రెండు మోడళ్లను భారతదేశంలోకి తీసుకురానుంది. అందులో ఒకటి ‘జెడ్9 జీటీ’ కాగా, మరొకటి ‘డి9 లగ్జరీ ఎంపివి’. ఈ రెండింటినీ పూర్తి స్థాయిలో తయారైన కార్లుగా – కంప్యూట్లీ బిల్ట్ అప్ యూనిట్) నేరుగా దిగుమతి చ...