Posts

Showing posts with the label Anant Ambani gifted Lionel Messi a Richard Mille luxury watch

లియోనెల్ మెస్సీకి రిచర్డ్ మిల్లె లగ్జరీ వాచ్‌ను బహుకరించిన అనంత్ అంబానీ

Image
అ నంత్ అంబానీకి చెందిన వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ సందర్శించారు. ఈ సందర్శంగా మెస్సీకి అనంత్ అంబానీ ప్రత్యేక కానుక అందించారు. రిచర్డ్ మిల్లె లగ్జరీ వాచ్‌ను బహుకరించారు. దాదాపు దీని ఖరీదు రూ.11 కోట్లు ఉంటుందని అంచనా. రిచర్డ్ మిల్లె గడియారం ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే వాచ్‌లో ఒకటి. ఈ వాచ్ అత్యంత ప్రత్యేకమైంది. RM 003-V2 GMT అనేది రిచర్డ్ మిల్లె మోడళ్లలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది. వంతారా సందర్శనకు వచ్చినప్పుడు మెస్సీ చేతికి ఎలాంటి వాచ్ లేదు. తిరిగి వెళ్లిపోతుండగా చేతికి RM 003-V2 వాచ్ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గడియారంలో అత్యంత అద్భుతమైన లక్షణాలుంటాయి. ఈ ప్రత్యేకమైన రిచర్డ్ మిల్లె టైమ్‌పీస్ ప్రస్తుతం బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా, ఫార్ములా 1 డ్రైవర్ మిక్ షూమేకర్, మాజీ ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు, ఫెరారీ జట్టు ప్రిన్సిపాల్ జీన్ టాడ్డ్ వంటి ప్రముఖులు ధరిస్తున్నారు. అలాగే జోహోర్ క్రౌన్ ప్రిన్స్ తుంకు ఇస్మాయిల్ ఇబ్ని సుల్తాన్ ఇబ్రహీం, వాచ్‌మేకర్ కరి వౌటిలైనెన్ కూడా ధరిస్తున్నారు. ఇప్పుడు అంత ఖరీదైన వాచ్‌ను మెస్స...