Posts

Showing posts with the label Chief Justice Surya Kant

అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదు : సుప్రీంకోర్టు

Image
అ త్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్‌మంతర్‌లో విధుల్లో ఉన్న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. పెల్లెట్‌ గన్స్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్‌ అధికారి యశోవర్ధన్‌ ఆజాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌ వంటి చర్యలు ఫల...

ఢిల్లీలో కాలుష్య నివారణకు తాత్కాలిక పరిష్కారం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం వెతకాలి !

Image
గో వాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు తాత్కాలిక పరిష్కారం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం వెతకాలన్నారు. ఇందుకోసం పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అయినా కూడా కాలుష్యం కంట్రోల్ కాలేదు. పాత వాహనాలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇక పొల్యుషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ నిషేధం విధించారు. ఇక టోల్‌ప్లాజ్‌లు మూసేశారు. అయినా కూడా కాలుష్యం తీవ్రత తగ్గలేదు. ప్రమాదకర స్థితిలో కొనసాగుతోంది.

న్యాయ వ్యవస్థలో దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది : చీఫ్ జస్టిస్ సూర్యకాంత్

Image
రి టైర్మెంట్ వయసు దగ్గరపడుతున్న సమయంలో జడ్జీలు తమ ఆదేశాలతో సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోందని, రిటైర్మెంట్ సమీపిస్తున్న జడ్జీలు తమ తీర్పులతో సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీం ధర్మాసనంలో సీజేఐ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జోయ్‌మాలా బాగ్చీ కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జీ తన రిటైర్మెంట్‌కు పది రోజుల ముందు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆ జడ్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిటైర్మెంట్ సమీపిస్తున్న సమయంలో ఆ జడ్జీ రెండు కేసుల్లో కీలక ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆ తీర్పులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ జడ్జీపై సస్పెన్షన్ విధించారు. పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తన రిటైర్మెంట్‌కు ముందు సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేశారని, ఈ అంశంపై లోతుగా ఏమీ చెప్పలేమని అన్నారు. వాస్తవానికి ఆ జిల్లా జడ్జీ నవంబర్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్...