Ad Code

ఢిల్లీలో కాలుష్య నివారణకు తాత్కాలిక పరిష్కారం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం వెతకాలి !


గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు తాత్కాలిక పరిష్కారం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం వెతకాలన్నారు. ఇందుకోసం పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అయినా కూడా కాలుష్యం కంట్రోల్ కాలేదు. పాత వాహనాలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇక పొల్యుషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ నిషేధం విధించారు. ఇక టోల్‌ప్లాజ్‌లు మూసేశారు. అయినా కూడా కాలుష్యం తీవ్రత తగ్గలేదు. ప్రమాదకర స్థితిలో కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu