Posts

Showing posts with the label AAP Complains to Rajya Sabha Chairman

పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీల సభ్యత్వం రద్దు చేయండి : రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ ఫిర్యాదు

Image
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌కు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు. రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికై, ఇప్పుడు పార్టీని వీడటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడుగురు ఎంపీలు ఆప్ గుర్తుపై గెలిచి, ఇప్పుడు వేరే పార్టీలో చేరడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని సంజయ్ సింగ్ వాదించారు. రాజ్యసభ లేదా లోక్‌సభలో ఎలాంటి 'చీలిక' లేదా 'గ్రూపులుగా విడిపోవడం' చట్టబద్ధం కాదని, 2/3వ వంతు మెజారిటీ ఉన్నప్పటికీ సభ్యత్వం రద్దు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పి.డి.టి. ఆచార్య వంటి నిపుణులను సంప్రదించామని, సదరు ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడినట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు.