Posts

Showing posts with the label Commercial gas cylinder prices have increased sharply

భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

Image
దే శంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ  సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా ధరల ప్రకారం, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ. 111 పెరిగింది. ఈ పెరుగుదలతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు దాదాపు రూ. 1,850 వరకు చేరుకున్నాయి. గృహ వినియోగదారుల ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. వాణిజ్య గ్యాస్ ధరలు నవంబర్ 2023 తర్వాత రూ. 100కు పైగా పెరగడం ఇదే తొలిసారి. అక్టోబర్ 2023 తర్వాత ఇది అతిపెద్ద పెరుగుదలగా అధికారులు చెబుతున్నారు.