Posts

Showing posts with the label Australia eliminated from T20 World Cup 2026

టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్‌

Image
శ్రీ లంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా ఆస్ట్రేలియా ఎలిమినేట్‌ అయింది. మొత్తంగా ఇరవై జట్లను  ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్‌-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌, ఒమన్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి. శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా తర్వాత జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఐర్లాండ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్‌ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్‌ వచ్చింది. నెట్‌రన్‌ర...