Posts

Showing posts with the label A proud moment for Indian cricket

మహిళల ఆసియా కప్ విజేతగా భారత్ : సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని నరేంద్ర మోడీ

Image
8వ సారి ఆసియా కప్ ట్రైఫీని గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ప్రతిభపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని  'ఇది భారత క్రికెట్‌కు అత్యంత గర్వకారణమైన క్షణం! ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న మహిళా జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ టోర్నమెంట్ అంతటా మన అమ్మాయిలు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, నిలకడైన ఆటతీరు, అంకితభావం అద్భుతం. ఈ ఘన విజయం దేశవ్యాప్తంగా ఉన్న కోకొల్లల మంది యువతను, ముఖ్యంగా చిన్నారులను మరింతగా ఆడేలా, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రేరేపించాలి' అని ఆకాంక్షించారు.