రష్యాలో డ్రోన్ల తయారీ సంస్థ సీఈఓపై హత్యాయత్నం : తీవ్రంగా గాయపడ్డ సీఈవో వ్లాదిమిర్ త్కాచుక్, డ్రైవర్ మృతి
ర ష్యన్ సైన్యానికి అత్యంత కీలకమైన డ్రోన్లను సరఫరా చేసే ఓ ప్రముఖ రక్షణ సంస్థ సీఈవో వ్లాదిమిర్ త్కాచుక్ పై హత్యాయత్నం జరిగింది. రష్యా సైన్యం ఉపయోగిస్తున్న శక్తివంతమైన ఉపిర్ ఎఫ్‌పీవీ డ్రోన్లను తయారుచేసే 'ఉరల్‌డ్రోన్‌జావోడ్' కంపెనీ సీఈవో లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. యెకాటెరిన్‌బర్గ్ సమీపంలోని బోల్షోయే ఇస్తోక్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు వెళ్తుండగా ఈ విస్పోటనం జరిగింది. కారు కింద ముందే అమర్చిన పేలుడు పదార్థాలు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి మెర్సిడెస్ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వ్లాదిమిర్ త్కాచుక్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఈ దాడికి ఎవరు ఒడిగట్టారనే దానిపై రష్యన్ భద్రతా ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు కింద పేలుడు పదార్థాలను అమర్చారని, మెర్సిడెస్ అతివేగంగా వెళ్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించిందని తెలుస్తోంది. దాడి వెనుక ఉన్నవారి గుర్తింపు ఇంకా అధికారికంగా నిర్ధారించ...