ఇండిగో పిటిషన్‌పై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ !
ఇం డిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల అనంతరం తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల సుంకాన్ని తిరిగి ఇప్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కస్టమ్స్ విభాగానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఇలాంటి కేసుల్లో కస్టమ్స్ సుంకం విధించడం రాజ్యాంగ విరుద్ధమని.. అదే లావాదేవిలపై డబుల్ టాక్సేషన్ విధింపునకు సమానమని కంపెనీ కోర్టులో వాదించారు. మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్‌గా పరిగణించాలని.. తాజా వస్తువుల దిగుమతిగా కాదని ఇండిగో వాదిస్తున్నది. అందుకు అనుగుణంగానే పన్ను విధించాలని కోరుతున్నది. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై డబుల్ లెవీగా వాదనలు వినిపించారు. ఇండిగో ఇప్పటికే ఇప్పటికే దిగుమతి చేసుకునే సమయంలో ప్రైమరీ కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని.. మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించామని ఇండిగ...