Posts

Showing posts with the label A Booming July for Car Manufacturers

కార్ల తయారీ సంస్థలకు ఊపుచ్చిన జూలై మాసం : రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు

Image
దే శంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు దాదాపు అన్నీ కూడా గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. హ్యుందాయ్ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించగా, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రాకంపెనీ ఎస్‌యూవీ విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కియా, టయోటా, ఎంజీ మోటార్, నిస్సాన్ కూడా బలమైన విక్రయాలను పొందాయి. జూలైలో టాటా మోటార్స్ మొత్తం 63,760 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40 వేల యూనిట్లతో పోలిస్తే ఇది 59 శాతం ఎక్కువ. ఇందులో దేశీయ మార్కెట్‌లోనే 62,611 వాహనాలు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా.. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మరోసారి తన సత్తా చాటింది. జూలైలో 15,217 ఈవీలను విక్రయించి గత ఏడాది కంటే.. 114 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ 60,048 ఎస్‌యూవీలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అన్ని రకాల వాహనాలను కలిపి చూస్తే మహీంద్రా మొత్తం 1,03,860 యూనిట్లను విక్రయించి 26 శాతం వృద్ధిని సాధించింది. విదేశీ మార్కెట్లకు చేసిన ఎగుమతులు కూడా గణనీ...