2050 నాటికల్లా అన్ని ప్రొడక్ట్స్ 100% రీసైకిల్ ప్లాస్టిక్ ద్వారా తయారు !
శాంసంగ్ పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా మారేందుకు 2050 నాటికి శాంసంగ్ తన ప్రొడక్ట్స్ అన్నింటినీ రీసైకిల్ ప్లాస్టిక్ ద్వారా తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్ధాలను రీయూజ్ చేసేందుకు కొత్త టెక్నాలజీని సైతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించాలని, 2025 నాటికి ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌లను ఉపయోగించడాన్ని ఆపాలని యోచిస్తున్నట్లు తెలిపింది. పార్క్ సంగ్-సన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, శామ్‌సంగ్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ విభాగానికి చెందిన మెకానికల్ ఆర్&డీ టీమ్ హెడ్, సియోల్‌లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం విశేషం. ఇఫ్పటికే ఫిబ్రవరి ప్రారంభంలో Samsung Galaxy S23, Galaxy S23 Plus , లగ్జరీ మోడల్ Galaxy S23 Ultra అనే మూడు మోడళ్లలో కొత్త Galaxy S ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్లో సైతం రీసైకిల్ ప్లాస్టిక్ ను ఉపయోగించడం ప్రారంభించినట్లు తెలిపింది. శామ్సంగ్ గెలాక్సీ S23 రీసైకిల్ పదార్థాలతో తయారు చేసిన 12 ఇ...