Posts

Showing posts with the label an IP69 rating for dust and water resistance

ఆగస్టు 6న ‘రెడ్‌మీ నోట్ 17’ను విడుదల

Image
దే శీయ మార్కెట్లో షియోమీ ఆగస్టు 6న ‘రెడ్‌మీ నోట్ 17’ను విడుదల చేస్తుంది. దీనిలో 8000mAh భారీ బ్యాటరీని అందించడం ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత. ఇది వినియోగదారులకు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనితో పాటు ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ AI కెమెరా, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, సరికొత్త హైపర్‌ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ఫోన్‌లో 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది గేమింగ్, వీడియా వీక్షణకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రొసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్‌ఎఫ్‌సీ, టైప్-సి పోర్ట్‌లతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నాయి.