Posts

Showing posts with the label arrival in Mumbai from Bangkok

11 కిలోల హైడ్రోపోనిక్ గంజాయితో పట్టుబడ్డ మోడల్ హర్ష సన్నీని

Image
బ్యాం కాక్ నుంచి ముంబై చేరుకున్న మోడల్ హర్ష సన్నీ 11 కిలోల అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది. విమానాశ్రయంలో సాధారణ నిఘా నిర్వహిస్తున్న అధికారులకు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అడ్డుకున్నారు. కస్టమ్స్ అధికారుల సమాచారం ప్రకారం, జూన్ 10-11 రాత్రి బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానం TG-351 ద్వారా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హర్ష సన్నీ చేరుకుంది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్, కస్టమ్స్ విభాగానికి చెందిన అధికారులు ఆమెను ఆపి సోదా చేశారు. ఆమె వద్ద ఉన్న ట్రాలీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో వాక్యూమ్ ప్యాక్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ప్యాకెట్లలో "పచ్చటి పదార్థం" ఉండటాన్ని అధికారులు గమనించారు. వెంటనే ఎన్డీపీఎస్ కిట్ ద్వారా అక్కడికక్కడే చేసిన రసాయన పరీక్షల్లో, ఆ పదార్థం అత్యంత నాణ్యమైన 'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. నిషేధిత మత్తుపదార్థాలను స్మగ్లింగ్ చేసినందుకు గానూ హర్ష సన్నీని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేసింది. స్వాధీనం చేసుకున్న ఈ 'హైడ్రోపో...